జై జై నాయిక..! | Upcoming Lady Oriented Movies from Tollywood | Sakshi
Sakshi News home page

జై జై నాయిక..!

Jan 11 2026 1:38 AM | Updated on Jan 11 2026 1:39 AM

Upcoming Lady Oriented Movies from Tollywood

తెలుగులో విరివిగా ఉమెన్స్  సెంట్రిక్‌ సినిమాలు

ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా ఉమెన్స్  సెంట్రిక్‌ సినిమాలూ చేస్తున్నారు కొందరు కథానాయికలు. సందేశాత్మక చిత్రాలే కాదు.. ఫుల్‌ యాక్షన్స్  చిత్రాలకూ సై అంటున్నారు. మరి.. ఏ హీరోయిన్స్  ఏ సినిమా చేస్తున్నారు? తొలిసారిగా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు? అనే అంశాలపై ఓ లుక్‌ వేయండి.

మా ఇంటి బంగారం
‘ఓ.. బేబీ’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత హీరోయిన్స్  సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్స్ లో రూపొందుతున్న  చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ఈ సినిమా టీజర్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో సమంత ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రంలో సమంత క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నట్లుగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర వివాహం చేసుకుని, అత్తగారిఇంటికి వెళ్లడం, ఆమె ఊహించుకున్న కొన్ని పరిస్థితులు, అంచనాలు తలకిందులు కావడం, మరోవైపు సడన్స్ గా సమంత ఫైట్స్‌ చేయడం వంటి విజువల్స్‌ కూడా కనిపించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్‌ దేవయ్య, గౌతమి, మంజూషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సమంత రూత్‌ ప్రభు, రాజ్‌ నిడిమోరు, హిమాన్స్ ్క దువ్వూరు ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. మరోవైపు 2023లో విజయ్‌దేవరకొండ, సమంత కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం తర్వాత సమంత ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసిన మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గత ఏడాది మేలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత గెస్ట్‌ రోల్‌ మాత్రమే చేశారు. మరి..సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌లో విడుదలైతే, కొంతగ్యాప్‌ తర్వాత సమంతను ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారని ఊహించవచ్చు.

 పవర్‌ఫుల్‌ మైసా
రష్మికా మందన్నా నటించిన తొలి ఉమెన్స్  సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ గత ఏడాది విడుదలై, సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు..ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ జోష్‌లో ‘మైసా’ అనే మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌కు గ్రీన్స్ సిగ్నల్‌ ఇచ్చారు రష్మిక. ఈ ఫీమేల్‌ సెంట్రిక్‌ యాక్షన్స్  ఎంటర్‌టైనర్‌ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్స్  ఫార్ములా ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం రష్మికా మందన్నా అద్భుతంగా మేకోవర్‌ అయ్యారు. గోండ్‌ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా ఇందులో నటిస్తున్నారు రష్మిక. తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ‘మైసా’ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిల్వర్‌స్క్రీన్స్ పై రష్మిక మందన్నా ఎక్కువగా రొటీన్స్  గ్లామర్‌ రోల్స్, కాలేజీ అమ్మాయి, గృహిణి.. వంటి పాత్రలు చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా తొలిసారి ఓ పూర్తి స్థాయి యాక్షన్స్  సినిమా చేస్తుండటంతో, ‘మైసా’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

ది బ్లాక్‌గోల్డ్‌
‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించు కున్నారు హీరోయిన్స్  సంయుక్త. ఈ సక్సెస్‌లతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ బ్యూటీ తొలిసారిగా ఉమెన్స్  సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ జానర్‌లో ఎంట్రీ ఇచ్చి, ‘ది బ్లాక్‌గోల్డ్‌’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోపోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు సంయుక్త. యోగేష్‌ కేఎమ్‌సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్‌ ఇష్యూని టచ్‌ చేస్తూ, ‘ది బ్లాక్‌గోల్డ్‌’ను తెరకెక్కిస్తున్నారట యోగేష్‌. సంయుక్త పూర్తిస్థాయి యాక్షన్స్  చేస్తున్న ఈ ‘ది బ్లాక్‌గోల్డ్‌’ సినిమాపై ఆడియన్స్్సలో అంచనాలు ఉన్నాయి.

భార్యాభర్తల గొడవలు
భార్యాభర్తల గొడవలు, వారి అనుబంధాలు, గిల్లికజ్జాలు, విడాకులు... వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో దేవ్‌ మోహన్స్  నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్, లావణ్య భార్యాభర్తలు నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్‌’ (శివ మనసులో శృతి) చిత్రాల ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుందని తెలిసింది.

సస్పెన్స్ థ్రిల్లర్‌
హీరోయిన్స్  శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన సినిమా ‘చీకటిలో..’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్‌ ప్రోడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో నటించారు శోభిత. సంధ్య వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చని΄ోతాడు. ఈ మరణం గురించి సంధ్యకు కొన్ని షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. అవి ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ డ్రామా జనవరి 23 నుంచి ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

క్రేజీ కల్యాణం
పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రంలో అనుపమా పరమే శ్వరన్స్  లీడ్‌ రోల్‌ చేస్తుండగా, నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మెహన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో    ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు.      వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి,    ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ΄్లాన్స్  చేస్తున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ‘పరదా’ అనే ఉమెన్స్  సెంట్రిక్‌ సినిమా చేశారు అనుపమా పరమేశ్వరన్స్ . ఈ సినిమాకు మంచి పాజిటివ్‌ రెస్పాన్స్ లభించింది.

గరివిడి లక్ష్మి
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని, కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్‌తో ఆమె బయోపిక్‌ తెరకెక్కుతోంది. హీరోయిన్స్  ఆనంది టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.1990 నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్,       కృతీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఈ కోవలో మరికొన్ని ఉమెన్స్  సెంట్రిక్‌ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి.. జై జై నాయిక అంటూ ప్రేక్షకులు, హీరోయిన్ల అభిమానులు ఈ తరహా చిత్రాలను ఈ ఏడాదిలో ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.

లెజెండరీ సింగర్‌ ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ రూపకల్పనకు సన్నాహాలు మొదలైనట్లుగా తెలిసింది. నిర్మాత రాక్‌లైన్స్  వెంకటేశ్‌ ఈ బయోపిక్‌కు సంబంధిన పనులపై వర్క్‌ చేస్తున్నారని, ఈ సినిమా నిర్మాణంలో తాను అసోసియేట్‌ అవుతానన్నట్లుగా ఇటీవల ‘ఈషా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ రకంగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ బయోపిక్‌లో ఎంఎస్‌ సుబ్బలక్ష్మిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. హీరోయిన్స్  సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా గౌతమ్‌ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది. మరి.. వెండితెరపై ఎంఎస్‌ సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటిస్తారా? లేక మరోక హీరోయిన్స్  ఎవరైనా ఈ పాత్రను చేస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

⇒  వరుస సినిమాలతో టాలీవుడ్‌లో వన్నాఫ్‌ ది టాప్‌ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు హీరోయిన్స్  శ్రీలీల. అయితే ఈ యంగ్‌ బ్యూటీ ఇప్పటì æవరకు ఉమెన్స్  సెంట్రిక్‌ ఫిల్మ్‌ జానర్‌లో సినిమా చేయలేదు. అయితే ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి డైరెక్షన్స్ లో సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్‌ రానుందని, ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్స్  లీడ్‌ రోల్‌ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే అనుష్కా శెట్టి నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘అరుంధతి’ హిందీలో రీమేక్‌ కానుందని, ఈ చిత్రంలో శ్రీలీల నటించనున్నానే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం 
అందాల్సి ఉంది.

⇒  రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్స్ ’, విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’, దుల్కర్‌ సల్మాన్‌ ‘కాంత’, రామ్‌ ‘ఆంధ్రాకింగ్‌ తాలూకా’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు హీరోయిన్స్  భాగ్యశ్రీ బోర్సే. కాగా తాజాగా ఉమెన్స్  సెంట్రిక్‌ ఫిల్మ్‌ జానర్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట ఈ హీరోయిన్స్ .  ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా రానుందని, ఈ చిత్రంలో భాగ్యశ్రీ మెయిన్స్  లీడ్‌ రోల్‌ చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

ఈ సినిమాను రమేష్‌ అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్‌ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  స్వప్న సినిమా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement