మనశంకర వరప్రసాద్ గారు.. ప్రీమియర్స్‌ బుకింగ్స్‌ టైమ్‌ ఫిక్స్! | Chiranjeevi Mana Shankara VaraPrasad Garu Movie Premiers Bookings | Sakshi
Sakshi News home page

Mana Shankara VaraPrasad Garu: మనశంకర వరప్రసాద్ గారు.. ప్రీమియర్స్‌ బుకింగ్స్‌ టైమ్‌ ఫిక్స్!

Jan 11 2026 2:05 AM | Updated on Jan 11 2026 2:15 AM

Chiranjeevi Mana Shankara VaraPrasad Garu Movie Premiers Bookings

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ రిలీజ్‌కు ముందు రోజు ప్రీమియర్స్‌ వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తెలంగాణలోనూ అనుమతులు రావడంతో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

కాగా.. చిరంజీవి  నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్‌ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement