'ది రాజా సాబ్' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. అధికారిక ప్రకటన | The Rajasaab Movie First Day Collections | Sakshi
Sakshi News home page

'ది రాజా సాబ్' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. అధికారిక ప్రకటన

Jan 10 2026 2:48 PM | Updated on Jan 10 2026 3:05 PM

The Rajasaab Movie First Day Collections

ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్‌ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్‌ వచ్చాయి. రాజా సాబ​్‌‌ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజా సాబ్‌ సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ రాజా సాబ్‌ మొదటిరోజు కలెక్షన్స్‌ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్‌ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్‌కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్‌, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement