సాక్షి,హైదరాబాద్: టీవీ5 మూర్తిపై కేసు నమోదైంది. వ్యక్తిగత గోప్యత, ప్రైవసీ భంగం కలిగించారనే అభియోగాలపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ1 గౌతమి చౌదరి,ఏ2 టీవీ5 మూర్తి పేర్లను చేర్చారు.
టీవీ5 మూర్తి,గౌతమి చౌదరిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ5 మూర్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి TV5 మూర్తి , గౌతమీ చౌదరిలపై చట్ట పరమయిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో Tv5 మూర్తి పై, గౌతమి చౌదరిపై పోలీసులు 308 (3) BNS 72 IT Act ప్రకారం కేసునమోదు చేసి విచారణ చేపట్టారు .


