రిపోర్ట్‌ ఇవ్వాల్సిందే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు | Telangana Health Department Key Decisions | Sakshi
Sakshi News home page

రిపోర్ట్‌ ఇవ్వాల్సిందే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు

Dec 20 2025 6:50 PM | Updated on Dec 20 2025 7:33 PM

Telangana Health Department Key Decisions

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ (MCMC) కమిటీలు ఇకపై ప్రతి నెలా నివేదికలు ఇవ్వాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా 'స్పోకెన్ ఇంగ్లీష్'లో శిక్షణ ఇవ్వనున్నారు. 

ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాసులు.. ప్రత్యేక టీచర్ల నియామకానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్‌ కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా ఉంచాలని మంత్రి  అన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మెడికోల ఆత్మహత్యల నివారణకు కాలేజీల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

పెరిగిన కాలేజీలకు అనుగుణంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పటిష్టం చేయడానికి సిబ్బంది పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెల్త్ యూనివర్సిటీ సేవలను వేగవంతం చేసేలా కార్యకలాపాలన్నీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement