సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడటంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రాజేంద్రనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, ఆరు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



