
బిగ్‌బాస్ హౌస్‌లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్ పవన్, లేదంటే పవన్ కల్యాణ్‌తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్‌బాస్ హౌస్‌ను పార్క్‌లా మార్చేసింది. కెప్టెన్‌గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.
భార్యను వదిలి రీతూతో..
చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్.. రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.
రీతూ, నేను ఫ్రెండ్స్
తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఫ్రెండ్‌లా చూస్తాను. మా బెడ్‌రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?
ఇల్లు ఖాళీ చేయించింది
ఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై..