మాస్‌ సాంగ్‌ కమింగ్‌ | Mana Shankara Varaprasad Garu: Mega Victory Mass Song Release Date Announced | Sakshi
Sakshi News home page

మాస్‌ సాంగ్‌ కమింగ్‌

Dec 27 2025 4:05 AM | Updated on Dec 27 2025 4:05 AM

Mana Shankara Varaprasad Garu: Mega Victory Mass Song Release Date Announced

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేశ్‌ కలిసి ఓ మాస్‌ సాంగ్‌లో చిందేశారు. మరి... వారి డ్యాన్స్‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 30 వరకూ వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్‌. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న అనిల్‌ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరో వెంకటేశ్‌ ముఖ్యపాత్ర పోషించారు.

అర్చన సమర్పణలో సాహు గార΄ాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ..’పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి, వెంకటేశ్‌ ఓ మాస్‌ నంబర్‌కి డ్యాన్స్‌ చేశారు. ఈపాట ప్రోమోని నేడు రిలీజ్‌ చేసి, పూర్తిపాటని ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ‘మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌’ కమింగ్‌ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌ డ్యాన్స్‌ చేస్తున్న పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement