చిన్న సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడొచ్చి వెళ్తాయో కూడా తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగున్నా సరే స్టార్స్ లేకపోవడం ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వీటిలో కొన్ని తర్వాత ఎప్పుడో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులు చూడొచ్చు?
సూర్య భరత్ చంద్ర, విషిక హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'అష్టదిగ్బంధనం'. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియలేదు. ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఉచితంగా చూసే అవకాశం రావొచ్చు.
(ఇదీ చదవండి: కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ)
'అష్టదిగ్బంధనం' విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్ రాములన్న దగ్గర శంకర్, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్‌కి అసూయ ఏర్పడుతుంది. తాను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని రాములన్నతో చెప్పగా.. రూ.50 కోట్లు ఇస్తే సీటు ఇస్తానని అంటాడు. దీంతో శంకర్.. బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్ వేస్తాడు.
మరి శంకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇతడి స్కెచ్‌లో హీరో హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్(సూర్య భరత్ చంద్ర) గతమేంటి? ఎలక్షన్ ఫండ్ అని రాములన్న ఇచ్చిన రూ.100 కోట్లని శంకర్ ఎక్కడ దాచాడు? ఆ డబ్బు ఎవరు ఎలా కొట్టేశారు? అసలు 'అష్టదిగ్భంధనం' ప్లాన్ వేసిందెవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)


