ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్‌తో కలిసి నటించడం ఆపేశాడు.
అవమానభారం
2011లో శక్తికపూర్ హిందీ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్‌పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.
ఎవరితోనూ గొడవల్లేవ్
దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్‌కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.


