బుల్లితెర నటి చైత్రరాయ్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభిచాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది.
9వ పెళ్లిరోజు.. పరిపూర్ణం
మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని రాసుకొచ్చింది. ఈ మేరకు చిన్న బుజ్జాయి రాకను తెలియజేస్తూ తన చిట్టి చేతి ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సీరియల్స్.. సినిమా
కాగా చైత్ర రాయ్.. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగులో పేరు తెచ్చుకుంది. అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సీరియల్స్‌లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ నటి 2016లో ఇంజనీర్ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జి పాప వచ్చేసింది.
చదవండి: సంజనాను ఆంటీ అనేసిన శివాజీ


