బిగ్‌బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్‌గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.
గుడ్డు దొంగతనం
తప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్‌గా ఫైనల్స్‌లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్‌కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం?
నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి
2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్‌బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు.


