రీసెంట్‌గా ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో టాప్-5లో నిలిచిన వాళ్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పాడు. బయటకు రాగానే ఆమెని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు. ఇప్పుడు అదే నిజం చేసేలా తన గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు! ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?)
ఇమ్మూ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఇతడితో పాటు ఉన్నది ప్రియురాలేనా అనిపిస్తుంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడా అనిపిస్తుంది. ఆమె ఎవరు ఏంటనేది, ఫొటో లాంటి బయటపెట్టలేదు కానీ ఇన్ స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది. ఎవరో ఏంటనేది త్వరలో ఇమ్మాన్యుయేల్ బయటపెడతాడేమో చూడాలి?

షోలో ఇమ్మూ చెప్పిన లవ్‌స్టోరీ
'స్టాండప్ కమెడియన్‌గా చాలా షోలు చేశా కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. ఓరోజు నా ఇన్ స్టాలో పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తి ఇంతమందిని నవ్వించగలడా అనిపించింది అని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. థ్యాంక్యూ చెబితే.. మీకు ఓకే అయితే నెంబర్ ఇస్తారా? అని అడిగింది. నేను ఫోన్ నంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కొన్నాళ్ల తర్వాత తను డాక్టర్ కోర్స్ చేస్తున్నా అని చెప్పింది. ఏంటీ నేను డాక్టర్‌ని నవ్వించగలిగానా అనిపించింది. నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి నాకంతా గుర్తింపు రాలేదు. పోనీ అందం చూసి ప్రేమించింది అనుకోవడానికి కూడా లేదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు'
'ఆమెతో మాట్లాడిన తర్వాత.. ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నాకు ఫస్ట్ అనిపించింది. ప్రపోజ్ కూడా కాదు నేరుగా పెళ్లి చేసుకోవాలనిపించింది. అంతా ఫోన్‌లోనే. నేను కనీసం ఆమె ఫొటో కూడా చూడలేదు. ఎలా ఉంటుందో తెలీదు. తన ముఖం కూడా చూడకుండానే ప్రపోజ్ చేశా. నీకు ఇష్టమైతే చెప్పు.. మా అమ్మవాళ్లకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాను. దీంతో నాకు కాస్త టైమ్ కావాలి అని చెప్పింది. తర్వాత ఆమెని ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేశాను. ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది. కలుద్దాం అడిగితే అంత సీన్ లేదు గానీ.. మా ఊరు వెళ్తున్నా కారు ఉంటే తీసుకుని రా, కలిసి వెళ్దాం అని చెప్పింది'
(ఇదీ చదవండి: ఓడినా.. రెమ్యునరేషన్‌లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్)
'నాకు అప్పటికి కారు లేదు. మా ఫ్రెండ్‌ని కారు అడిగి, పెట్రోలుకి డబ్బులు సెట్ చేసుకుని ఆమెని కలిశాను. నాలుగు గంటల పాటు వాళ్ల ఊరివరకు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో.. చచ్చినా బతికినా దీనితోనే బతకాలనుకున్నాను. తనని నేను వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. ఏ రోజు తను, నా అందం చూడలేదు. ఆస్తి చూడలేదు. డబ్బు చూడలేదు. ఈ రోజుకి కూడా తనకి నేను ఒక్క రూపాయి పెట్టింది లేదు. కనీసం ఒక్క డ్రస్ కొనివ్వలేదు. ప్రతిసారి బర్త్ డేకి బట్టలు కొంటాం గానీ పెళ్లియ్యాకే కట్టుకుంటాం అని అంది. వాటిని నా బీరువాలోనే దాచుకున్నా. అంత మంచి వ్యక్తి ఆమె. షూటింగ్స్ బిజీలో పడి తనని సరిగా పట్టించుకునేవాడిని కాదు, చిరాకుపడేవాడిని, తిట్టేవాడిని. చాలా బాధపెట్టాను. కానీ ఇక్కడి వచ్చాక రియలైజ్ అయ్యాను. మనిషిని దూరం పెట్టి ఇంత బాధపెట్టానా అనిపిస్తుంది'
'ఈ నవంబరులో తను పీజీ చేయడం కోసం ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని ఆగిపోయింది. జీవితాన్ని త్యాగం చేసింది. తనకేం కర్మ.. నాకోసం ఎందుకింత చేస్తుందని చాలా బాధగా ఉంది. తనకోసమే ఆడుతున్నా.. గెలవాలనే ఆడుతున్నా. ఈ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. ఫారిన్ వద్దూ ఏమి వద్దూ. తనని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాం. తన విలువ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది' అని ఇమ్మూ అప్పుడు చెప్పాడు. ఇప్పుడు పరోక్షంగా తన ప్రేయసిని పరిచయం చేశాడు. చూస్తుంటే కొత్త ఏడాదిలో పెళ్లి శుభవార్త చెప్పడం గ్యారంటీ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: కష్టానికి విలువ లేదు.. ఇమ్మూ గురించి కమెడియన్ రోహిణి ఆవేదన)


