'గీతూ రాయల్‌' దెబ్బకు దిగొచ్చిన సంజన | Bigg boss Geetu Royal Strong Counter To Sanjana | Sakshi
Sakshi News home page

'గీతూ రాయల్‌' దెబ్బకు దిగొచ్చిన సంజన

Dec 24 2025 1:52 PM | Updated on Dec 24 2025 2:41 PM

Bigg boss Geetu Royal Strong Counter To Sanjana

బిగ్‌బాస్‌ 9 తెలుగు సీజన్‌ పూర్తి అయినప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది.  ఎపిసోడ్‌కు సంబంధించిన పలు వీడియోలను కంటెస్టెంట్స్‌ షేర్‌ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో నటి సంజన గల్రానీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బిగ్‌బాస్‌ ఎక్స్‌ కంటెస్టెంట్స్‌, రివ్యూవర్స్‌ ఆదిరెడ్డి, గీతూ రాయల్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది. దీంతో గీతూ రాయల్‌ గట్టిగానే కౌంటర్‌గా ఇచ్చింది. సంజనకు సంబంధించిన ఒక వీడియోను తన స్టోరీస్‌లో పంచకుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత సంజన తన తప్పును తెలుసుకుని తన పోస్ట్‌ను తొలగించడంతో.. రీతూ రాయల్‌ కూడా తను చేసిన పోస్ట్‌ను రిమూవ్‌ చేసింది.

సంజన ఏం చేసింది..?
బిగ్‌బాస్‌ రివ్యూవర్‌ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్‌ చేసింది.  ఆ వీడియోలో సంజన బిగ్‌బాస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై  తనూజ, ఇమ్ము, డీమాన్‌ పవన్‌ల ఆట గురించి ప్రస్తావించాడు.  అయితే, కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్‌ హైలెట్‌ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దానిని కొందరు ట్రోలర్స్‌ వైరల్‌ చేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రీతూ రాయల్‌ కల్యాణ్‌ కోసం ఓట్ల బిచ్చగాళ్లు  మాదిరిగా క్రియేట్‌ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు కలిపారు. అదే వీడియోను సంజన షేర్‌ చేయడంతో గీతూ రాయల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ఇంకేముంది సంజన తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయిపోయింది.

సంజనకు గీతూ రాయల్‌ కౌంటర్‌
డ్రగ్స్‌ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్‌ను గీతూ  పోస్ట్‌ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. సంజన గల్రానీ డ్రగ్స్‌ కేసు 2020లో కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత ఆమెకు బెయిల్‌ లభించింది. ఇదే కేసులో సుప్రీం కోర్టు కూడా కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement