ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డ్రింకర్‌ సాయి’ | Dharm Mahesh Drinker Sai Now Released In OTT, From Average Theatrical Run To OTT Sensation, Trending In ZEE5 | Sakshi
Sakshi News home page

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డ్రింకర్‌ సాయి’

May 30 2026 5:20 PM | Updated on May 30 2026 6:23 PM

Drinker Sai Now Streaming In This OTT

ధర్మ మహేష్ హీరోగా  కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2024 డిసెంబర్‌లో  థియేటర్స్‌లో విడుదలై యావరేజ్‌ టాక్‌ సంపాదించుకుంది.  కానీ దాదాపు ఏడాదిన్నర ఓటీటీలోకి వచ్చి.. ఇక్కడ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది.  జీ5 ఓటీటీ  వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం  ఫ్రీ ఆన్ జీ5  విభాగంలో  టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది.

ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో  నేచురల్‌గా నటించారు.  కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో  బెస్ట్ డెబ్యూ యాక్టర్‌‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్.  

హీరోయిన్‌గా నటించిన  ఐశ్వర్య శర్మ  తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్‌తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.  అలాగే  రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్  తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement