ముచ్చుముఖం.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది, ఎంతమంది దగ్గర..! | Tollywood Actor Dharma Mahesh in Dowry Harassment Case, Wife Gautami Accuses Rithu Chowdary of Affair | Sakshi
Sakshi News home page

రీతూది ముచ్చుముఖమన్న హీరో.. ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరిందోనన్న భార్య!

Sep 25 2025 12:57 PM | Updated on Sep 25 2025 1:30 PM

Dharma Mahesh Wife Gautami Chowdary Allegations on Bigg Boss 9 Rithu Chowdary

టాలీవుడ్‌ హీరో ధర్మ మహేశ్‌పై నెలన్నర క్రితం పోలీసు కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. సినిమా ఛాన్సులు రావడంతో భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మహేశ్‌తో పాటు అతడి కుటుంబంపైనా ఫిర్యాదు చేసింది. అయితే భార్యాభర్తల గొడవలో అనూహ్యంగా రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది.

ఫ్రెండ్‌ మాత్రమే..
గర్భవతిగా ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం మానేసి రీతూ (Rithu Chowdary) వెంట తిరిగాడని మీడియాతో వాపోయింది గౌతమి. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడింది. తన అడ్డు తొలగిపోవడంతో అర్ధరాత్రి రీతూ ఇంటికి వచ్చేదంటూ సీసీటీవీ వీడియోలు సైతం రిలీజ్‌ చేసింది. అటు ధర్మ మహేశ్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. రీతూ తనకు ఫ్రెండ్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అంతమాత్రానికే డ్రగ్స్‌ అని, రిలేషన్‌ అని ఏవేవో ఊహించడం సరికాదని చెప్పాడు. 

2023 నుంచే ఎఫైర్‌
అయితే గౌతమి మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు. మహేశ్‌ (Dharma Mahesh), రీతూ బెడ్‌రూమ్‌లో ఉన్న సీసీటీవీ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటోంది. అలాగే రీతూతో ఉంటూనే తనను చీప్‌గా తీసిపడేసేవాడంది. ఇంకా ఏమందంటే? నా భర్త నన్ను ఫ్లాట్‌ నుంచి వెళ్లగొట్టాక అక్కడేం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. రోజూ అర్ధరాత్రి రీతూ కారులో వస్తుందన్నారు. ఆమె సెలబ్రిటీ, పైగా సార్‌కు పర్సనల్‌ అని తన సెక్యూరిటీ చెప్పారు. 2023 నుంచే వీళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందన్న అనుమానం మొదలైంది.

ముచ్చుముఖంతో నాకు ఎఫైరా?
ఒకసారి అదే మాట నా భర్తను అడిగాను. అందుకాయన.. హీరోయిన్లతో ఎఫైర్‌ అంటగట్టు. అంతేకానీ ఇలాంటి ముచ్చుముఖాలు, సైడ్‌ ఆర్టిస్టులతో సంబంధం అంటగట్టకు అన్నాడు. అతడి సినిమాలో రీతూ సైడ్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను గర్భిణీగా ఉన్నప్పుడు రీతూకి ఫోన్‌ చేసి ఈ ఎఫైర్‌ గురించి అడిగాను. అందుకామె ఛీఛీ.. నువ్వు నాకు తెలిసినదానివి. నేనెందుకు అలా చేస్తాను? అని నన్ను నమ్మించింది. కానీ, ఎప్పుడైతే రీతూ సావాసం మొదలైందో అప్పుడే నా భర్తకు ఏదో అలవాటు చేసింది.

ఎంతమంది ఇళ్లలో దూరిందో..
నా భర్త రాత్రిళ్లు రాకపోవడం, ఏవో నమలడం, కొన్నింటిని కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానమేసింది. రీతూకి మా ఫ్లాట్‌ నచ్చిందట! ఆమె కోసమే నన్ను బయటకు వెళ్లగొట్టాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం నాలుగు గంటల వరకే రీతూ అక్కడ ఉంటుంది. వాళ్ల బెడ్‌రూమ్‌ వీడియోలు నా దగ్గరున్నాయి. నా ఇంటికే ఆమె అలా ధైర్యంగా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరింది?

అదేంటో.. రీతూపై జాలి
నా అనుమతి లేకుండా నా భర్త దగ్గర అర్ధరాత్రి ఉండేందుకు తనెవరు? అదేంటో కానీ.. చాలామంది రీతూపై జాలిపడుతున్నారు. ఈ అమ్మాయి కాల్‌డేటా, వాట్సాప్‌ చాట్‌ తీయండి.. ఎంతమంది అబ్బాయిల డబ్బు కొల్లగొడుతుంది? ఈ డేటా మొత్తం తీయండి. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్నవాళ్లందరూ కాస్తయినా సిగ్గుపడండి అని గౌతమి చెప్పుకొచ్చింది.

చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement