రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్ | Bigg boss 9 contestant Emmanuel about his journey | Sakshi
Sakshi News home page

రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్

Dec 29 2025 2:10 PM | Updated on Dec 29 2025 2:35 PM

Bigg boss 9 contestant Emmanuel about his journey

బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!

బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement