
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయి. బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే సమస్య), ఏవీ మాల్ఫొర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ స్థితి). వీటివల్ల ఎముకలు విరుగుతూ.. అతడి శరీరం ఎంతో ఒత్తిడికి గురవుతూనే ఉంది. గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పి)తోనూ బాధపడ్డాడు. అయితే ఈ వ్యాది పగవాడికి కూడా రాకూడదంటున్నాడు సల్లూ భాయ్.
ఎనిమిదేళ్లు బాధపడ్డా..
తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సల్మాన్.. ట్రైజెమినల్ న్యూరాల్జియా వల్ల నేను పడ్డ నరకం మాటల్లో చెప్పలేనిది. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదనే కోరుకుంటాను. ఏడెనిమిదేళ్లు ఈ వ్యాధితో బాధపడ్డాను. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి నొప్పి నన్ను వేధించేది. దానివల్ల బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా గంటన్నర సమయం పట్టేది. ఒక ఆమ్లెట్ తినాలన్నా కూడా కష్టంగా ఉండేది. నొప్పి నన్ను వెంటాడేది.
దాన్ని భరించలేక ప్రాణాలు వదిలేవారు
బలవంతంగా ఆమ్లెట్ నోట్లో కుక్కుకునేవాడిని. పెయిన్‌కిల్లర్స్ వాడినా ఫలితం లేదు. ఈ వ్యాధి వచ్చిన చాలామంది దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడు దానికి చికిత్స లభిస్తోంది. ఏడెనిమిది గంటలపాటు సర్జరీ చేసి ముఖంలో మనల్ని ఇబ్బందిపెడుతున్న నరాలను ఫిక్స్ చేస్తున్నారు. నేనూ ఆ సర్జరీ చేయించుకున్నా.. ఇకమీదట నొప్పి 30% తగ్గుతుందన్నారు. అదృష్టవశాత్తూ ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్.. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నారు.