టాలీవుడ్ నటుడు శివాజీని వదిలే ప్రసక్తే లేదంటోంది మహిళా లోకం. తన కామెంట్స్ను సమర్థించుకోవడమే కాకుండా ఎవరికీ భయపడనంటూ ఇవాళ ప్రెస్మీట్లో రెచ్చిపోయారు. ఒకవైపు సారీ చెబుతూనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఓ రేంజ్లో తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా యాంకర్, నటి అనసూయ పేరు ప్రస్తావిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. తాను అభద్రతాభావంతో ఉన్నది నిజమేనమ్మా.. మీ రుణం కూడా త్వరలోనే తీర్చుకునే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ మరో కొత్త వివాదానికి తెరతీశాయి.
ఇవాళ దండోరా మూవీ ప్రెస్మీట్లో శివాజీ తనపై చేసిన కామెంట్స్పై అనసూయ స్పందించింది. అతి వినయం దుర్త లక్షణం అనేది నాకు చిన్నప్పటి నుంచే తెలుసని వెల్లడించింది. ఈ రోజు వీడియోలు చూస్తుంటే పెద్దవాళ్లు చెప్పింది కరెక్టే అనిపిస్తోందని తెలిపింది. ఈ రోజు ఆయన ప్రెస్మీట్లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఒక నార్సిస్ట్కు ఉండే లక్షణం ఇదే.. చేతగానితనం వల్లే ఇలాంటి మాటలు వస్తాయని అన్నారు. ఫేక్ ఫెమినిజం అనేది ఎక్కడా లేదండి.. మగాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే ఫెమినిజం అని తెలిపింది.
అనసూయ మాట్లాడుతూ..' సెల్ఫ్ కంట్రోల్ లేనివాళ్లు, ఇన్ సెక్యూరిటీ వల్లే ఇలా మాట్లాడతారు. అందుకే పాపం సింపతీ కార్డ్ వాడేస్తున్నారు. నేనేందుకు అందులోకి లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? నేను కూడా హీరోయినే సార్.. మిమ్మల్ని ఇలానే బట్టలు వేసుకోవాలని మీకు ఎవరైనా చెబుతున్నారా? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలనే చెప్పేంత చిన్నపిల్లలం కాదు. మీరు నన్ను లాగలేదు. కానీ కలెక్టివ్గా లాగారు. మీరు ఏదైతే బలంగా చెబుతున్నారో.. నేను కూడా అదే చెబుతున్నా. మీరే తెలివి గలవాళ్లు అనుకుంటే..సృష్టికి మూలమైన మాకు ఎంత ఉండాలి. మరణశిక్ష వేయండి అన్నారు. అలాంటివి వద్దు సార్. నిజంగానే మీకు ఆడవాళ్లపై గౌరవం ఉంటే.. ఏంట్రా అడవి జంతువుల్లా మీద పడటం.. ఆ అమ్మాయి అంత అందగా ఉంది. ఆమెను గౌరవించడని మగవాళ్లకే చెప్పండి' అని గట్టిగా ఇచ్చిపడేసింది.
అనసూయ మాట్లాడుతూ..'మీరన్నట్లు నేను జాలి పడలేదు.. నా రుణం తీర్చుకునే అవకాశం దొరకాలి అన్నారు. నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎంతోమంది నా తోటి సహచరులు అండగా ఉన్నారు. మీలాంటి వాళ్ల మద్దకు నాకస్సలు అవసరం లేదు సార్. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. నా గురించి సోషల్ మీడియాలో ఏం వాగినా.. వల్గర్ కామెంట్స్ చేసినా లీగల్ నోటీసులు వస్తాయని హెచ్చరించింది.


