'బాలకృష్ణ' ఫ్యాన్స్‌ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్‌ | Balakrishna Fans Disappointed As SS Thaman Delays Daaku Maharaaj Movie OST Release, Deets Inside | Sakshi
Sakshi News home page

'బాలకృష్ణ' ఫ్యాన్స్‌ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్‌

Feb 10 2026 9:09 AM | Updated on Feb 10 2026 10:22 AM

SS Thaman OST Still Missing o Balakrishna Daaku Maharaaj

సంగీత దర్శకుడు తమన్  కొట్టే బీజీఎమ్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్‌ సౌండ్‌ బాక్స్‌లు బద్దలవుతాయి. డాల్బీ  థియేటర్‌ అయితే మరింత కిక్‌ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్‌ కొట్టే మ్యూజిక్‌కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్‌ ఔట్‌పుట్‌ గురించి చెబుతుంటారు. అయితే, తమన్‌ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య  అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్  అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను  దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్‌ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

డాకు మహారాజ్‌లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్‌ చాలా పాపులర్‌ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్‌ కొట్టిన బీజీఎమ్‌ మరో రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్‌ ఈ ట్రాక్‌ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి  విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్‌ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్‌, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి వంటి చిత్రాలతో పాటు  ‘డాకు మహారాజ్‌’కు  తమన్‌ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement