Daaku Maharaaj Movie
-
నెల రోజుల్లోపే ఓటీటీకి డాకు మహారాజ్.. ఆ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025 -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
Pragya Jaiswal : గోల్డ్ కలర్ టాప్‌లో ‘డాకు’ బ్యూటీ
-
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
డాకు మహారాజ్లో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ స్టిల్స్ (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్‌గా మిగిలింది.. డాకు మహారాజ్ బ్యూటీ కామెంట్స్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మరోసారి తన మాటలతో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాజాగా గేమ్ ఛేంజర్( Game Changer) సినిమా రిజల్ట్ గురించి ఊర్వశి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడిన చిత్రాల్లో గేమ్ ఛేంజ్ర్ కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఊర్వశి చేసిన కామెంట్లు చరణ్ అభిమానుల్లో కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి.డాకు మహరాజ్(Daaku Maharaaj) సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులేసిన ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె తాజాగా బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు మంచి మైలేజ్ వచ్చిందని ఇలా మాట్లాడింది. 'బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. కానీ, నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నా తప్పు అయితే లేదు. సినిమా బాగా లేకున్నప్పటికీ పెయిడ్ పీఆర్లు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నా జనాలు తిప్పికోడతారు.' అని ఊర్వశి చెప్పుకోచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: అదివారం నాడు ఒక సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ)చాలామంది ఈ రెండు సినిమాల గురించి సోషల్‌మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారని ఊర్వశి పేర్కొంది. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని అంటూనే ఊర్వశి రౌటేలా నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయిందని చాలామంది తెలుపుతున్నారని ఆమె తెలిపింది. శంకర్ సర్ చాలా ప్రసిద్ధ దర్శకుడని ఆమె చెప్పింది. ఆయనతో ఇండియన్ 2లో కూడా పనిచేశానని గుర్తుచేసింది. ఆ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదని ఆమె అభిప్రాయపడింది.వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. సుమారు రూ. 450 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ (10రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సక్నిల్క్ వెల్లడించింది. అయితే, తొలి రోజే ఈ చిత్రానికి రూ. 186 కోట గ్రాస్ వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో సోషల్‌మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు.Kiara's #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster. - @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025 -
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ
‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తాను.వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్బీకే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్’ ఉండాలని మొదలుపెట్టాం.డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. -
ట్రోలర్స్‌పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్‌పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
కియారా సినిమా డిజాస్టర్.. ఊర్వశి మూవీ బ్లాక్‌బస్టర్.. బ్యూటీ రియాక్షనిదే!
ఎప్పుడొచ్చామన్నది కాదు హిట్టు కొట్టామా? లేదా? అన్నదే ముఖ్యం! ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా మిక్స్డ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్రెండు రోజుల గ్యాప్‌తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. దబిడి దిబిడి పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ అవేవీ సినిమా విజయానికి అడ్డుగా నిలవలేదు.సంక్రాంతి విన్నర్?చివరగా జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam)తో వచ్చాడు. వస్తూనే పండగ మోసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. మౌత్ టాక్‌తోనే ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించగలిగాడు. రూ.100 కోట్లు అందుకోవడానికి డాకు మహారాజ్‌కు నాలుగు రోజులు పడితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు రోజుల్లోనే సెంచరీ క్లబ్లో చేరింది.(చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య)అభిప్రాయాలు గౌరవిస్తాఇకపోతే దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.అది ఒక కళఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.నేనేం చేయలేదుకియారా అద్వానీ గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. మనం నటించిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మనకంటూ ఓ క్రేజ్ తీసుకొస్తాయి. ఉదాహరణకు.. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్‌సైడర్ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. ఇది మనకు ఇండస్ట్రీ ఇచ్చే గుర్తింపు. దీనివల్ల మన యాక్టింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నేను కొన్ని ట్వీట్స్ చూశాను.. కియారా అద్వానీ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఊర్వశి సినిమా బ్లాక్‌బస్టర్ అని రాశారు. అందులో నా హస్తం ఏమాత్రం లేదు అని ఊర్వశి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) చదవండి: సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా? -
హీరోయిన్ బర్త్‌డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
కలెక్షన్ల దంచుడు.. బాలకృష్ణతో హీరోయిన్ బర్త్‌డే పార్టీ
డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie).. మొదట ఈ సినిమాకు అసలు హైపే లేదు. ఎప్పుడైతే దబిడి దిబిడి పాట విడుదలైందో వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దబిడి దిబిడి పాటలో బాలకృష్ణ.. హీరోయిన్ ఊర్వశి రౌతేలాను కొడుతున్నట్లుగా అసభ్యకరమైన స్టెప్పులేశాడు. దీనిపై ట్రోలింగ్ జరిగే క్రమంలోనే డాకు మహారాజ్ సినిమా ప్రచారంలోకి వచ్చింది.ఏదైతేనేం జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. మూడు రోజుల్లోనే రూ.92 కోట్లకు పైగా వసూలు చేసింది. రేపటితో వంద కోట్ల మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.బర్త్‌డే వేడుకలుబాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్ రోజే హీరోయిన్ ప్రగ్యా బర్త్‌డే. దీంతో చిత్రయూనిట్ ఆమె పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరిపింది. బాలకృష్ణ కేక్ కట్ చేసి తనకు తినిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.'12 -01 -2025.. ఇది నా బెస్ట్ బర్త్‌డే. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి, మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి పుట్టినరోజు కానుకను ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది నాకు బ్లాక్‌బస్టర్ బర్త్‌డేగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. డాకు మహారాజ్‌పై మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ వేడుకల్లో హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా పాల్గొనడం విశేషం. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) The King of Sankranthi Delivers Big 🔥#DaakuMaharaaj clocks 𝟗𝟐 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬 - Ruling the box office and hearts alike! 💥💥A PERFECT SANKRANTHI treat packed with high octane action and heartwarming family emotions! ❤️… pic.twitter.com/duMQ4H4zm6— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025 చదవండి: పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ.. -
'డాకు మహారాజ్' సినిమాలోని పాప ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీ హీరోయిన్ అదిరిపోయే స్టిల్స్ (ఫోటోలు)
-
డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie). బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. హీరోకు బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్‌లోని చిన్నారి ఎవరు?ఈ సినిమాలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ పాప సినిమా సెట్స్‌లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఎవరని పలువురూ ఆరా తీస్తున్నారు. ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్ (Veda Agrawal). తను నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురే వేద.(డాకు మహారాజ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఉప్పొంగిపోయిన సింగర్తన గారాలపట్టి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో తండ్రిగా ఉప్పొంగిపోయాడు మాధవ్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఆగ్రాలో పుట్టినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్‌లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం.కల నెరవేరినట్లుగా ఉందిఈ ప్రయాణం నాకు సంపూర్ణమైన అనుభూతినిస్తోంది. మా భావోద్వేగాలు ఆగడం లేదు. హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్‌పై తనను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. డాకు మహారాజ్లో వైష్ణవిగా కట్టిపడేసింది వేద. ఈ సినిమాతో తనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.డాకు మహారాజ్ సినిమా విశేషాలుడాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌తో మెరిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ముందుకు వచ్చిన ఈ మూవీకి తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. సక్సెస్ పార్టీపైగా జనవరి 10న రిలీజైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీకి వస్తున్న మిక్స్డ్ టాక్ డాకు మహారాజ్‌కు కలిసొచ్చినట్లైంది. తొలి రోజే బాలకృష్ణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. అటు ఆన్ స్క్రీన్‌లో, ఇటు ఆఫ్ స్క్రీన్‌లో బాలకృష్ణ.. ఊర్వశిని దబిడి దిబిడి ఆడేసుకున్నారు. View this post on Instagram A post shared by Madhav Agrawal (@abmadhav) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్‌లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!
‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్నే ఎక్కువగా ట్రోల్ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.సక్సెస్ పార్టీతో వికృత స్టెప్పులు!హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్, శ్రధ్ధాశ్రీనాథ్ హీరోయిన్. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) ముద్దులతో ముంచేసిన బాలయ్య`డాకు మహారాజ్`పార్టీలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. -
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్‌స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
డాకు మహారాజ్‌కు హిట్ టాక్. తొలిరోజే ఓవర్సీస్లో క్రేజీ రికార్డ్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj Movie). బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో దిగిన డాకు మహారాజ్ తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.(ఇది చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)తమన్ బీజీఎంపై ప్రశంసలు..తొలిరోజు డాకు మహారాజ్ వీక్షించిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమన్ బీజీఎం అదిరిపోయిందని కామెంట్స్ చేశారు. మరోసారి తమన్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూఎస్‌లో 10 లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అమెరికాలో రికార్డ్ ప్రీ సేల్స్..ఈ సారి డాకు మహారాజ్ సినిమాకు అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్స్‌లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు. అనంతపురంలో సక్సెస్ మీట్డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్ మీట్‌ను అనంతపురంలో నిర్వహిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ప్రకటించారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వల్ల సక్సెస్ మీట్ అక్కడే నిర్వహించనున్నట్లు నాగవంశీ వెల్లడించారు. టికెట్ ధరల పెంపునకు అనుమతి..డాకు మహారాజ్ మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500 కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.#DaakuMaharaaj crosses $1M+ Gross in the USA and continues its BLOCKBUSTER HUNTING spree! 💥💥This is just the start of NBK’s storm! 🦁#BlockbusterHuntingDaakuMaharaaj 🔥USA Release by @ShlokaEnts Overseas Release by @Radhakrishnaen9 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/82Kkd5ZnHN— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
బాలయ్య 'డాకు మహారాజ్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. (ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు.