బాలకృష్ణ 'డాకు మహారాజ్'.. న్యూ ఇయర్‌ అప్‌డేట్‌ ఇదే | Nandamuri Balakrishna Latest Movie Daku Maharaj Third Single Update | Sakshi
Sakshi News home page

Daaku Maharaaj: దబిడి దిబిడి అంటోన్న 'డాకు మహారాజ్'.. న్యూ ఇయర్‌ అప్‌డేట్‌ ఇదే

Jan 1 2025 5:13 PM | Updated on Jan 1 2025 5:21 PM

Nandamuri Balakrishna Latest Movie Daku Maharaj Third Single Update

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమన్‌ అందించిన బీజీఎమ్‌ మరో రేంజ్‌లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పటికే రెండు పాటలు కూడా మేకర్స్‌ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితమే  చిన్నీ చిన్నీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్‌లోని మూడో సింగిల్‌ను జనవరి 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దబిడి దిబిడి అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.

కాగా.. ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement