'డాకు మహారాజ్‌' ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో.. తమన్‌ మాస్‌ ర్యాంప్‌ | Daaku Maharaaj First Song Daaku Rage promo Out Now | Sakshi
Sakshi News home page

'డాకు మహారాజ్‌' ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో.. తమన్‌ మాస్‌ ర్యాంప్‌

Dec 13 2024 11:13 AM | Updated on Dec 13 2024 12:49 PM

Daaku Maharaaj First Song Daaku Rage promo Out Now

బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 'డాకు మహారాజ్‌' నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్ర‌ద్ధాశ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌద‌రి కీల‌క పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. తాజాగా విడుదలైన 'డాకుస్‌ రేజ్‌' ప్రోమో అదిరిపోయింది. త‌మ‌న్ అందించిన బీజీఎమ్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్‌ ఉండనుంది. ఈ సాంగ్‌కు అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా నాకాశ్‌ అజీజ్‌ ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement