ఎప్పుడు ఆవిష్కరణలు ప్రయోగాశాలల నుంచి రావు. కేవలం ఎదుర్కోనే సమస్యల నుంచే కొంగొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. సహకరించని ఆర్థిక పరిస్థితులు, తట్టుకోలేని కష్టాల కడలే..పరిష్కారానికి దారులు వేసే ఆలోచనలు ఉద్భవిస్తాయి. యావత్తు ప్రపంచాన్ని తమవైపు తిరిగే చూసేలా చేస్తాయి అనేందుకు ఈ యువ ఆవిష్కర్తే ఉదాహరణ.
ఆ అమ్మాయే ఝాన్సీకి చెందిన 16 ఏళ్ల కల్యాణి శ్రీ వాస్తవ. తనుండే ప్రాంతంలో వేడి విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఎండలు నిప్పుల కొలిమిలో ఉంటాయి. అయితే అక్కడ ఏసి పెట్టుకునేంత స్థోమత లేని పేద కుటుంబాలే ఎక్కువ. ఆ పరిస్థితుల మధ్యే పెరగడం వల్లే..తక్కువ ఖర్చుతో దొరికే ఏసి సాధ్యం కాదా అన్న ఆలోచన మనసులో మెదిలింది. అదే క్రమంగా ఆవిష్కరణకు దారితీసింది. ఖర్చు తక్కువగా ఉండే ఏసి, విద్యుత్ బిల్లుల మోత ఉండనే ఉండకూదనుకుంది.
ఎందుకంటే తనలాంటి పేదలకు ఎండ వేడి నుంచి ఉపశమనంగా ఉండాలని ఆశించింది ఆమె. అదే శ్రీ కళ్యాణికి చౌక ధరలో లభించే ఏసిని తయారు చేసేలా చేసింది. కేవలం రూ. 18 వేలుకు లభించే ఏసీ రూపొందించి శెభాష్ అనిపించుకుంది. ఆమె ఆవిష్కరణకు యావత్తు ప్రపంచం విస్మయం చెందింది. అందులోనూ కరెంట్ బిల్లు సమస్య లేకుండా సోలార్ శక్తితో నడిచే ఏసీని తక్కువ ఖర్చులోనే లభించేలా చేయడంతో అందరి దృష్టిని ఈ ఆవిష్కరణ అమితంగా ఆకర్షించింది.
ఎలా పనిచేస్తుందంటే..
కళ్యాణి ఏసి తయారీ కోసం కేవలం ధర్మోకోల్, ఐస్‌బాక్స్, 12 వోల్ట్ డీసీ ఫ్యాన్‌ని ఉపయోగించింది. ఈ అమరికలో గాలి కూలింగ్ ఛాంబర్ గుండా ప్రయాణించి, ఆ తర్వాత ఎల్బో ఆకారపు అవుట్‌లెట్ ద్వారా బయటకు వెళ్తుంది. ఇది ఒక గంటలోని గదిని సుమారు నాలుగు నుంచి 5°C వరకు గది ఉష్ణోగ్రతను తగ్గించగలదు. సరైన సోలార్ సెటప్‌తో పనిచేస్తుంది. దీనికి విద్యుత్ సరఫరాతో సంబంధం ఉండదు కూడా. సాంప్రదాయ కండిషనర్లకు ఎక్కువ ఖర్చుతో కూడిన తయారీ. పైగా అధిక పెట్టుబడులు అవసరం.
కానీ కళ్యాణి తయారు చేసిన దానికి ఖర్చు తక్కువే, కరెంట్ బిల్లుల మోత కూడా ఉండదు. ఈ ఆవిష్కరణ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షగోయెంక మనసుని సైతం దోచింది. ఆయన సోషల్ మీడాయ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘ఝాన్సీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి కళ్యాణి శ్రీవాస్తవ, వేడిమి తాపంతో బాధపడుతున్న గ్రామీణ ప్రజలకు రక్షకురాలిగా నిలిచింది. ఆమె కేవలం రూ.1800తో పర్యావరణ అనుకూల ఎయిర్ కండిషనర్‌ను ఆవిష్కరించింది, పైగా ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైనది. ఇలాంటి ప్రతిభను మనందరం ప్రోత్సహిద్దాం!” అని రాసుకొచ్చారు.
Kalyani Srivastava, a 16 year girl from Jhansi has emerged as a saviour for heat stricken rural people. She has invented an eco-friendly air conditioner costing just Rs.1800, the cheapest in the world. Let’s encourage such talent! https://t.co/hRPvQep8ha
— Harsh Goenka (@hvgoenka) June 15, 2019
ఇదీ చదవండి: ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి..కానీ అలా చేయొద్దు..! హాట్‌టాపిక్‌గా గవర్నర్ వ్యాఖ్యలు


