మట్టిలోని జీవమే మన ఆయువు | dr Vandana Shiva podcast The Quantum Physics of Nature by Rodrigo Canelas | Sakshi
Sakshi News home page

Dr Vandana Shiva మట్టిలోని జీవమే మన ఆయువు

Oct 23 2026 1:27 PM | Updated on Oct 23 2026 1:40 PM

dr Vandana Shiva podcast The Quantum Physics of Nature by Rodrigo Canelas

వ్యూ పాయింట్‌ 

క్వాంటమ్‌ ఫిజిక్స్‌ నుండి పర్యావరణ ఉద్యమం వైపు తన అడుగులు ఎలా పడ్డాయో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ వందనా శివ (Dr Vandana Shiva) వెల్లడించారు. 1947 భారతదేశ విభజన సమయంలో తన తల్లిదండ్రుల పోరాటంనుండి నేర్చుకున్న విలువల గురించి మాట్లాడారు. కార్పొరేట్‌ సంస్థల లాభాపేక్ష వల్ల పర్యావరణానికి జరుగుతున్న ముప్పును, వాటికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో నిర్భీతి ప్రాముఖ్యాన్నీ శక్తిమంతంగా వ్యక్తీ కరించారు. 

ముఖ్యాంశాలు: 

అణువులను వదిలి పర్యావరణానికి!
‘‘నేను క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని, పదార్థం ప్రాథమిక స్వభావాన్ని అధ్యయనం చేశానని తెలిసినవాళ్లు... మట్టికి, దేశవాళీ విత్తనాల సంరక్షణకు నేను నా జీవి తాన్ని ఎలా అంకితం చేశానా అని తరచూ ఆశ్చర్య పోతుంటారు. కానీ నా దృష్టిలో, ఇందులో ఎలాంటి వైరుధ్యమూ లేదు. క్వాంటమ్‌ ఫిజిక్సులో మీకు, విశ్వంలోని దేన్నీ వేరు చేసి చూడలేమని చాలా త్వరగా అర్థ మవుతుంది. కానీ, పారిశ్రామిక విధానం ప్రకృతిని ప్రాణం లేని, వేర్వేరు తునకల సమూహంగా చూస్తుంది. వాటిని ముక్కలు చేసి, పేటెంట్లు పొంది, అత్యధికంగా వేలం పాడేవారికి విక్రయించవచ్చని భావిస్తుంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న పర్యావరణ వినాశనాన్ని, మానవ వేదనను చూసినప్పుడు, ప్రకృతిని ఆక్రమించుకోవడానికి ఈ విచ్ఛిన్నకర సైన్స్‌ ఒక ఆయుధంగా మారుతోందని గ్రహించాను. అందుకే ప్రయోగశాలలో అణు కణాల్ని వదిలేసి, బయటికొచ్చాను.

అమ్మ నేర్పిన  అమూల్యమైన పాఠం
‘‘నా సమగ్ర ప్రపంచ దృక్పథం నా తల్లిదండ్రులు పాటించిన విలువల వల్ల, 1947 నాటి భారతదేశ విభ జన చూపిన తీవ్ర చారిత్రక ప్రభావం వల్ల రూపు దిద్దుకుంది. మా అమ్మ రాత్రికి రాత్రే అంతా కోల్పోయి శరణార్థిగా మారినప్పటికీ, ఆమెలో ఏ విపత్తు కూడా చెరిపివేయలేని అంతశ్శక్తి ఉండేది. ఒకసారి నేను, ‘అమ్మా, నువ్వెందుకు ఖరీదైన దుస్తులు వేసుకోవు?’’ అని అడిగిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడామె నాకు ఎప్పటికీ మరచిపోలేని ఒక పాఠం నేర్పారు: ‘నేను నా డబ్బును ఖరీదైన చీరలు, నగలపై ఖర్చు చేస్తే, నిన్ను ఎలా చదివించగలను?’ అని! మా నాన్నగారు అటవీ శాఖాధికారి. అడవి అంటే కేవలం కలప మాత్రమే కాదు, అది తనంతట తానుగా మను గడ సాగించే ఒక సాధువు అని ఆయన నాకు నేర్పించారు. నిజమైన సంపదను మనం మన వ్యక్తిత్వం, జ్ఞానం, ఈ ప్రపంచానికి మనం అందించే సహకారం ద్వారానే కొలవగలమని నా తల్లిదండ్రులు మా మనసుల్లో నాటారు.

 

లాభాల వేటలో చౌకబారిన జీవితం
‘‘ప్రస్తుతం మనం ఒక ప్రమాదకరమైన నాగరికతా వలలో చిక్కుకున్నాం. కార్పొరేట్‌ ఆర్థిక వృద్ధిని మానవ పురోగతిగా మనం పొరబడ్డాం. అతి కొద్ది గుత్తాధిపత్య సంస్థలు ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని, మూలాలనుపేటెంట్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. మన ఆహారాన్ని కృత్రిమంగా తయారు చేయడం, ప్రయోగశాలలో మట్టిని సృష్టించటం, సహజ పర్యావరణ వ్యవస్థలను ప్రైవేటు వస్తువులుగా మారుస్తున్నాయి. ఇది... ప్రకృతి లోపభూయిష్ట మైనదని, కోటానుకోట్ల  సంవత్సరాల పరిణామం కంటే కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ మెరుగైన పని చేయగలదని భావించే అంతులేని దురాశ  మనల్ని నడి పిస్తోంది. లాభమే మానవ విలువకు అంతిమ కొల మానంగా మారినప్పుడు, జీవితమే చౌకైపోతుంది, సమాజాలు నిజమైన పోషకాహారం, నిజమైన సంఘం, అసలైన అర్థం కోసం అలమటించవలసి వస్తుంది.

భయాల సంకెళ్లు తెంచుకుందాం
‘‘మీరు శక్తిమంతమైన కార్పొరేట్‌ వ్యవస్థలను సవాలు చేసినప్పుడు, వారు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే మొదటి ఆయుధం భయం కల్పించటం. ఒంటరి అయి పోతామనే భయం, చట్టపరమైన బెదిరింపుల భయం, లేదా మీ హోదాను కోల్పోతామనే భయం. నిజమైనకింది స్థాయి పోరాటం, నిజమైన స్వేచ్ఛ ఆ భయాల ప్రభావానికి గురి కాదు. మీరు ఏదైనా పవిత్రమైన దానికోసం నిలబడినప్పుడు  అది అడవి కావచ్చు, దేశీయ విత్తనం కావచ్చు, లేదా చిన్న రైతు జీవనోపాధి కావచ్చు... మీ బలాన్ని సంస్థల నుండి పొందడం మాని, ఒక శక్తి నుండి పొందడం ప్రారంభిస్తారని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. భయం మనల్ని లొంగిపోయేలా, క్రియారహిత వినియోగదారులుగా మారు స్తుంది. నిర్భయత్వం మనల్ని మన ధైర్యంతో మళ్లీ కలుపుతుంది, ఏ కార్పొరేట్‌ లేదా సామ్రాజ్యం శాశ్వతం కాదని; భూమి, మన స్వేచ్ఛ, జీవపు స్థితిస్థాపకత (తిరిగి లేవటం) ఎప్పటికీ నిలిచిపోతాయని మనకు గుర్తుచేస్తుంది.

-ఎడిటోరియల్‌ టీమ్‌
 

పాడ్‌కాస్ట్‌: సమ్‌థింగ్‌ బిగ్గర్
అతిథి:వందనా శివపర్యావరణ ఉద్యమశీలి, ‘నవధాన్య’ ఫౌండర్‌
హోస్ట్‌:రోడ్రిగో కనేలా, గ్లోబల్‌ ట్రావెలర్, సమ్‌థింగ్‌ బిగ్గర్‌ క్రియేటర్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement