breaking news
quantum mechanicals
-
మట్టిలోని జీవమే మన ఆయువు
క్వాంటమ్ ఫిజిక్స్ నుండి పర్యావరణ ఉద్యమం వైపు తన అడుగులు ఎలా పడ్డాయో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ వందనా శివ (Dr Vandana Shiva) వెల్లడించారు. 1947 భారతదేశ విభజన సమయంలో తన తల్లిదండ్రుల పోరాటంనుండి నేర్చుకున్న విలువల గురించి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థల లాభాపేక్ష వల్ల పర్యావరణానికి జరుగుతున్న ముప్పును, వాటికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో నిర్భీతి ప్రాముఖ్యాన్నీ శక్తిమంతంగా వ్యక్తీ కరించారు. ముఖ్యాంశాలు: అణువులను వదిలి పర్యావరణానికి!‘‘నేను క్వాంటమ్ సిద్ధాంతాన్ని, పదార్థం ప్రాథమిక స్వభావాన్ని అధ్యయనం చేశానని తెలిసినవాళ్లు... మట్టికి, దేశవాళీ విత్తనాల సంరక్షణకు నేను నా జీవి తాన్ని ఎలా అంకితం చేశానా అని తరచూ ఆశ్చర్యపోతుంటారు. కానీ నా దృష్టిలో, ఇందులో ఎలాంటి వైరుధ్యమూ లేదు. క్వాంటమ్ ఫిజిక్సులో మీకు, విశ్వంలోని దేన్నీ వేరు చేసి చూడలేమని చాలా త్వరగా అర్థమవుతుంది. కానీ, పారిశ్రామిక విధానం ప్రకృతిని ప్రాణం లేని, వేర్వేరు తునకల సమూహంగా చూస్తుంది. వాటిని ముక్కలు చేసి, పేటెంట్లు పొంది, అత్యధికంగా వేలం పాడేవారికి విక్రయించవచ్చని భావిస్తుంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న పర్యావరణ వినాశనాన్ని, మానవ వేదనను చూసినప్పుడు, ప్రకృతిని ఆక్రమించుకోవడానికి ఈ విచ్ఛిన్నకర సైన్స్ ఒక ఆయుధంగా మారుతోందని గ్రహించాను. అందుకే ప్రయోగశాలలో అణు కణాల్ని వదిలేసి, బయటికొచ్చాను. View this post on Instagram A post shared by Rodrigo Canelas (@rodrigocanelas)అమ్మ నేర్పిన అమూల్యమైన పాఠం‘‘నా సమగ్ర ప్రపంచ దృక్పథం నా తల్లిదండ్రులు పాటించిన విలువల వల్ల, 1947 నాటి భారతదేశ విభ జన చూపిన తీవ్ర చారిత్రక ప్రభావం వల్ల రూపు దిద్దుకుంది. మా అమ్మ రాత్రికి రాత్రే అంతా కోల్పోయి శరణార్థిగా మారినప్పటికీ, ఆమెలో ఏ విపత్తు కూడా చెరిపివేయలేని అంతశ్శక్తి ఉండేది. ఒకసారి నేను, ‘అమ్మా, నువ్వెందుకు ఖరీదైన దుస్తులు వేసుకోవు?’’ అని అడిగిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడామె నాకు ఎప్పటికీ మరచిపోలేని ఒక పాఠం నేర్పారు: ‘నేను నా డబ్బును ఖరీదైన చీరలు, నగలపై ఖర్చు చేస్తే, నిన్ను ఎలా చదివించగలను?’ అని! మా నాన్నగారు అటవీ శాఖాధికారి. అడవి అంటే కేవలం కలప మాత్రమే కాదు, అది తనంతట తానుగా మనుగడ సాగించే ఒక సాధువు అని ఆయన నాకు నేర్పించారు. నిజమైన సంపదను మనం మన వ్యక్తిత్వం, జ్ఞానం, ఈ ప్రపంచానికి మనం అందించే సహకారం ద్వారానే కొలవగలమని నా తల్లిదండ్రులు మా మనసుల్లో నాటారు.ఇదీ చదవండి: నైతిక పీఠంపై 'నిస్సహాయ యోధుడు'లాభాల వేటలో చౌకబారిన జీవితం‘‘ప్రస్తుతం మనం ఒక ప్రమాదకరమైన నాగరికతా వలలో చిక్కుకున్నాం. కార్పొరేట్ ఆర్థిక వృద్ధిని మానవ పురోగతిగా మనం పొరబడ్డాం. అతి కొద్ది గుత్తాధిపత్య సంస్థలు ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని, మూలాలనుపేటెంట్ చేసుకోవాలని చూస్తున్నాయి. మన ఆహారాన్ని కృత్రిమంగా తయారు చేయడం, ప్రయోగశాలలో మట్టిని సృష్టించటం, సహజ పర్యావరణ వ్యవస్థలను ప్రైవేటు వస్తువులుగా మారుస్తున్నాయి. ఇది... ప్రకృతి లోపభూయిష్ట మైనదని, కోటానుకోట్ల సంవత్సరాల పరిణామం కంటే కార్పొరేట్ ఇంజనీరింగ్ మెరుగైన పని చేయగలదని భావించే అంతులేని దురాశ మనల్ని నడి పిస్తోంది. లాభమే మానవ విలువకు అంతిమ కొలమానంగా మారినప్పుడు, జీవితమే చౌకైపోతుంది, సమాజాలు నిజమైన పోషకాహారం, నిజమైన సంఘం, అసలైన అర్థం కోసం అలమటించవలసి వస్తుంది.ఇదీ చదవండి: ఓ స్త్రీగా బతకడం కోసం...భయాల సంకెళ్లు తెంచుకుందాం‘‘మీరు శక్తిమంతమైన కార్పొరేట్ వ్యవస్థలను సవాలు చేసినప్పుడు, వారు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే మొదటి ఆయుధం భయం కల్పించటం. ఒంటరి అయి పోతామనే భయం, చట్టపరమైన బెదిరింపుల భయం, లేదా మీ హోదాను కోల్పోతామనే భయం. నిజమైన కిందిస్థాయి పోరాటం, నిజమైన స్వేచ్ఛ ఆ భయాల ప్రభావానికి గురి కాదు. మీరు ఏదైనా పవిత్రమైన దానికోసం నిలబడినప్పుడు అది అడవి కావచ్చు, దేశీయ విత్తనం కావచ్చు, లేదా చిన్న రైతు జీవనోపాధి కావచ్చు... మీ బలాన్ని సంస్థల నుండి పొందడం మాని, ఒక శక్తి నుండి పొందడం ప్రారంభిస్తారని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. భయం మనల్ని లొంగిపోయేలా, క్రియారహిత వినియోగదారులుగా మారు స్తుంది. నిర్భయత్వం మనల్ని మన ధైర్యంతో మళ్లీ కలుపుతుంది, ఏ కార్పొరేట్ లేదా సామ్రాజ్యం శాశ్వతం కాదని; భూమి, మన స్వేచ్ఛ, జీవపు స్థితిస్థాపకత (తిరిగి లేవటం) ఎప్పటికీ నిలిచిపోతాయని మనకు గుర్తుచేస్తుంది.-ఎడిటోరియల్ టీమ్ -
'క్వాంటమ్' పరిశోధకులకు మహా పురస్కారం
అట్లాంటా: క్వాంటమ్ మెకానిక్స్ లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోయేలా.. న్యూట్రినోలకూ ద్రవ్యరాశి ఉంటుందని రుజువుచేసిన భౌతికశాస్త్రవేత్తలు ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. జపాన్ కు చెందిన టకాకి కజితా, కెనడాకు చెందిన మెక్ డోనాల్డ్ లను సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. మూలకణంలో ఎలక్ట్రాన్లను పోలి ఉండే న్యూట్రినోల పనితీరుపై ఈ ఇరువురు పరిశోధనలు చేశారు. టకాకి.. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందినవారుకాగా, మెక్ డోనాల్డ్ కెనడాలోని సడ్బ్యూరీ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.


