నైతిక పీఠంపై 'నిస్సహాయ యోధుడు' | Sakshi Guest Column On Antonio Guterres, Ian Bremmer | Sakshi
Sakshi News home page

నైతిక పీఠంపై 'నిస్సహాయ యోధుడు'

Oct 2 2026 12:27 AM | Updated on Oct 2 2026 12:28 AM

Sakshi Guest Column On Antonio Guterres, Ian Bremmer

వ్యూ పాయింట్‌

పాడ్‌కాస్ట్‌: 
వరల్డ్‌ విత్‌ ఇయాన్‌ బ్రెమర్‌
జి–జీరో మీడియా

అతిథి:
ఆంటోనియో గుటెర్రెస్,ఐరాస సెక్రెటరీ జనరల్‌

హోస్ట్‌:
ఇయాన్‌ బ్రెమర్‌
పొలిటికల్‌ సైంటిస్ట్,జి–జీరో మీడియా ఫౌండర్‌ 

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఐదేళ్ల రెండో పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ‘జి–జీరో వరల్డ్‌’ పాడ్‌కాస్ట్‌లో ప్రసారమైన ఆయన తాజా ఇంటర్వ్యూ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాలను పరిష్కరించటంలో ఐక్యరాజ్యసమితికి ఉన్న పరిమితులపై ఆయన తన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పెరుగుతున్న ‘చట్టవిరుద్ధత’, ఆర్థిక వనరుల కొరత నడుమ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం ఎంత క్లిష్టంగా మారిందో వెల్లడించారు. ముఖ్యాంశాలు:

నాకున్నది సాయుధ అధికారం కాదు!
‘‘ప్రజలు తరచూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ను అతడేదో ప్రపంచానికే అధ్యక్షుడైనట్లు చూస్తుంటారు! (నవ్వుతూ). ఆజ్ఞలు జారీ చేయడం, అంతర్జాతీయ చట్టా లను అమలు చేయడం లేదా యుద్ధాన్ని నిలిపివేయ డానికి సైన్యాన్ని పంపడం నా చేతుల్లోనే ఉందనుకుంటారు. కానీ ఐక్యరాజ్యసమితి అనేది ఒక ప్రపంచ ప్రభుత్వం కాదు. నా దగ్గర ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ ఉండవు. సైన్యం, పోలీసు బలగాలు ఉండవు. అలాగే సార్వభౌమా ధికారం ఉన్న దేశాలను కట్టుబడి చేసేలా బలవంతం చేసే అధికారం కూడా లేదు. నా పాత్రల్లా ఒక ఆహ్వానకర్తగా (కన్వీనర్‌), మధ్యవర్తిగా, మానవతా మనస్సాక్షికి ప్రతి నిధిగా వ్యవహరించడమే. నా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ‘ఐక్యరాజ్య సమితి చార్టర్‌’ (రాజ్యాంగం వంటిది)కి ఉండే నైతిక బలం, నా అనునయించే శక్తి మాత్రమే. పోరుబాట లోని సభ్య దేశాలు ఆ నైతిక అధికారాన్ని తృణీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు, వారిని అడ్డుకునే ఎలాంటి భౌతిక శక్తి లేదా వ్యవస్థ ఐక్యరాజ్యసమితికి లేవు. 

చేష్టలుడిగిన స్థితిలో భద్రతా మండలి
‘‘ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల వ్యవస్థ అంతా కూడా భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు కనీస స్థాయిలోనైనా పరస్పరం సహకరించుకుంటాయనే నమ్మకం పైనే ఆధారపడి ఉంది. కానీ నేడు ఆ వ్యవస్థ  దెబ్బతింది. ప్రధాన ప్రపంచ శక్తులు నేరుగా యుద్ధాలలో పాల్గొంటు న్నప్పుడు, లేదా తమను, తమ మిత్రదేశాలను కాపాడుకోవ డానికి వీటో అధికారాన్ని ఉపయోగించి నప్పుడు, భద్రతా మండలి పూర్తిగా నిస్సహాయమై, స్తంభించిపోతోంది. నేను ఎంతో ఆవేశపూరితమైన ప్రసంగాలు చేయగలను, ప్రమాద ఘంటికలను మోగించ గలను, క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలను ప్రపంచం ముందు ఉంచగలను. కానీ శాశ్వత సభ్య దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు పరస్పరం విభేదించి నప్పుడు, నేను వీటోను దాటి వెళ్లలేను. లేదా ఆ ఐదు శాశ్వత సభ్య దేశాలను ఒక ఒప్పందానికి వచ్చేలా బల వంతం చేయలేను.

నాటి ప్రపంచానికి నేటి నాయకత్వం!
‘‘మనం ఆధారపడే ప్రాథమిక ప్రపంచ వ్యవస్థలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ సహా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, 1945లో ఏర్పాటు అయినవి. అవి దాదాపు 80 సంవత్సరాల క్రితం ఉన్న అధికార సమతు ల్యతను ప్రతిబింబించేవి. నేటి వాస్తవికత పూర్తిగా వేరుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఎదుగు తున్న దేశాలు, గ్లోబల్‌ సౌత్‌ తగిన ప్రాతినిధ్యాన్ని కోరు తున్నాయి. అందుకు అవి అర్హమైనవి కూడా. అయినప్పటికీ వాటికి ప్రాతినిధ్యం లేదు. ఆనాటి, 20వ శతాబ్దపు భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఉపయోగించి ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌ నియంత్రణ, వాతావరణ మార్పు వంటి 21వ శతా బ్దపు మనుగడ ముప్పులను పరిష్కరించడానికి ప్రయత్నించడం తీవ్ర ఘర్షణకు దారి తీస్తుంది. మనం సాధించగలిగే పురోగతిని పరిమితం చేస్తుంది.

బలానిదే రాజ్యమనే భావన ‘‘నా పదవీ కాలంలో నేను చూసిన అత్యంత ఆందోళ నకరమైన మార్పు బహుశా ప్రపంచవ్యాప్తంగా– ‘శిక్ష పడు తుందనే భయం లేకపోవటం’ అన్నది  వేగంగా విస్తరించ డమే. పెద్ద దేశాలు ఎలాంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనకుండానే అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల నిబంధనలను లేదా ఇతర దేశాల సార్వభౌమాధి కారాన్ని బహిరంగంగా ఉల్లంఘించినప్పుడు, అది ప్రపంచ రంగస్థలంలోని ప్రతి ఒక్కరికి ఒక ప్రమాదకరమైన సంకే తాన్ని పంపుతుంది. దేశాలు, సాయుధ దళాలు ‘ఏం చేసినా చెల్లుతుంది’ అని భావించటం ప్రారంభిస్తాయి. ఒప్పందా లను తోసిపుచ్చవచ్చనీ, అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పు లను పూర్తిగా విస్మరించవచ్చనీ అనుకుంటాయి. చట్టపాలన స్థానంలో బలానిదే రాజ్యం అనే భావన వచ్చి చేరుతున్న ఈ ప్రపంచ సముదాయాన్ని నడిపించడం తీవ్రమైన అసంతృప్తిని, నైరాశ్యాన్ని కలిగిస్తుంది. 

బాధ్యతల భారం... నిధుల నిరోధం
‘‘ఐక్యరాజ్యసమితికి అప్పగించే బాధ్యతలు ప్రతి సంవ త్సరం పెరుగుతూనే ఉన్నాయి. అపూర్వమైన మానవీయ విపత్తులకు స్పందించడం, సంక్లిష్టమైన సాయుధ పోరాటా లలో మధ్యవర్తిత్వం వహించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారే చర్యలను సులభతరం చేయడం, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధాల (కిల్లర్‌ రోబోలు) వంటి నూతన సాంకేతిక బెదిరింపుల కోసం విధానపరమైన చట్రాలను ఏర్పాటు చేయడం వంటివి మేము చేయాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో మేము తీవ్రమైన బడ్జెట్‌ లోటు, సభ్య దేశాలు విరాళాల చెల్లింపులో చేసే ఆలస్యం, ప్రధాన దాతృత్వ దేశాలు నిధులను నిరోధించటం వంటి పరిస్థితుల మధ్య నిర్బంధంగా పని చేస్తున్నాం. ఈ బాధ్య తను సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన రాజకీయ మద్దతు, ఆర్థిక వనరులు క్షీణిస్తున్నప్పటికీ, మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాలనీ, మరింత పెద్ద సమస్యలను పరిష్కరించాలనీ మమ్మల్ని నిరంతరం కోరుతూనే ఉన్నారు.
-ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement