హీరోయిన్ అమలాపాల్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇలా తన ఇమేజ్‌తోనే తమిళ చిత్రం ‘ఆడై’ 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాని తెలుగులో ‘ఆమె’గా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలో ఎవరూ చేయని పాత్రను చేశారు అమలాపాల్. ఇందులోని ఓ కీలక సన్నివేశంలో నటించేందుకు చేసిన రిస్క్ కోసం తాజాగా వెల్లడించారు.
‘దర్శకుడు రత్నకుమార్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఎలా తీస్తారో అని భయంవేసింది. కథ కాకుండా కేవలం ఆ బోల్డ్ అంశంపైనే దృష్టంతా పెడతారేమో అని భయం వేసింది. కానీ చిత్రం బృందం ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి నాకు దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ఈ సినిమాలో నటిస్తే నా పరిస్థితి ఏంటా అని ఆలోచించా.
ఇలాంటి పాత్రలే చేయల్సి ఉంటుందేమోనని..
కెరీర్‌లో కూడా ఇలాంటి పాత్రలే చేయల్సి ఉంటుందేమోనని భయపడ్డాను. దర్శకుడి మీద నమ్మకంపై రిస్క్ తీసుకుని సరే చెప్పా. ఆ అశ్లీల సన్నివేశం చిత్రీకరణ టైంలో సెట్‌లో అతి తక్కువ మందితో షూటింగ్ చేశారు. అందువల్ల నాకు ఏలాంటి ఇబ్బంది కలగలేదు’ అని అమలాపాల్ గుర్తుచేసుకున్నారు. కాగా ఈ సినిమాలో కామిని అనే టీవీ జర్నలిస్ట్‌గా అమలాపాల్ నటించారు.
ఇదీ చదవండి: రాజమౌళికే జలాక్.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్


