ఢిల్లీ: దసరా పండుగ సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరింత పెరిగింది. అక్టోబర్ నెల తొలి రోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.62.50 పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.
తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.2,810కి చేరింది. సెప్టెంబర్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈనెలలో కూడా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50, కోల్‌కత్తాలో రూ.968, హైదరాబాద్‌లో రూ.994గా ధరలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో ముఖ్యంగా వ్యాపారుల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
తాజాగా ధరల పెంపు తర్వాత ఇలా..
ఢిల్లీలో రూ.2,810
ముంబైలో రూ.2,763.50,
హైదరాబాద్‌లో రూ.3,058.50,
కోల్‌కతాలో రూ.2,946.50,
చెన్నైలో రూ.2,979కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది.
#BREAKING | Ahead of the festive season, commercial LPG prices hiked again from October 1, with the price of a 19-kg cylinder in Delhi rising by Rs 62.50 to Rs 2,810.#LPG pic.twitter.com/HgKAVqJOcW
— OTV (@otvnews) October 1, 2026
ఇదీ చదవండి: వంట గ్యాస్‌పై సుంకం.. కేంద్రం కొత్త ప్లాన్


