తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లు భద్రపరిచిన పిల్లలు | Mumbai woman allegedly kept her father's body in a freezer | Sakshi
Sakshi News home page

తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లు భద్రపరిచిన పిల్లలు

Oct 1 2026 6:19 AM | Updated on Oct 1 2026 6:19 AM

Mumbai woman allegedly kept her father's body in a freezer

శాశ్వత క్రయోప్రిజర్వేషన్‌ కోసం విదేశాలకు పంపే ప్రయత్నం

ముంబై: తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా ఆసక్తి చూపని పిల్లలు కూడా ఉన్న కాలంలో.. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని భద్రపరచడానికి ఇప్పటికే రూ.50 లక్షలు ఖర్చు చేసిందో కుటుంబం. అంతేకాదు.. శాశ్వత ప్రిజర్వేషన్‌ ప్రక్రియ కోసం అమెరికా పంపే మార్గాలను అన్వేషిస్తోంది. తాజాగా వెలుగులోకి వచి్చన ఆ వివరాలను పోలీసులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. ముంబైకి చెందిన ఓ 80 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇతర వయసు సంబంధిత అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట మరణించారు. 

అతనితో ఉన్న తీవ్రమైన భావోద్వేగ అనుబంధంతో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అతని కుటుంబం మృతదేహాన్ని మలాడ్‌ ప్రాంతంలోని తమ ఇంట్లోనే ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ఈ ప్రక్రియ కోసం రూ. 50 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయితే వాళ్లు నివాసం ఉంటున్న భవనం రిన్నోవేషన్‌ చేస్తుండటంతో అతని పార్థివ దేహాన్ని స్థానిక డిస్పెన్సరీకి తరలించారు. నెల రోజుల కిందట దాన్ని మూసేశారు. దీంతో దీర్ఘకాలిక క్రయోప్రిజర్వేషన్‌ సేవలు అందించే అమెరికాలోని ఒక కేంద్రానికి దానిని పంపించే మార్గాలను అన్వేషిస్తున్నారు.  ఇందులో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని పోలీసులు తేల్చి చెప్పారు. మృతదేహాన్ని విదేశాలకు పంపించాలా లేక అంత్యక్రియలు నిర్వహించాలా అని కుటుంబం నిర్ణయించుకుంటోందని తెలిపారు. 

క్రయోప్రిజర్వేషన్‌ అంటే... 
కణాలు, కణజాలాలు లేదా అవయవాలను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడం. ఉష్ణోగ్రతలు మైనస్‌ 140 డిగ్రీ సెంటిగ్రేడ్‌ నుంచి మైనస్‌ 196 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద కణాల లోపల జీవక్రియలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ పద్ధతిలో భద్రపరిచిన కణాలు 10 నుంచి 30 ఏళ్ల వరకు దెబ్బతినకుండా, దశాబ్దాలపాటు సజీవంగా ఉంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement