అక్రమ ఆస్తుల పుట్ట : కోట్ల ఆస్తి, నగలు, నగదు, 48 లగ్జరీ వాచెస్‌ | Bihar Bureaucrat Couple Raided Rs 1 Crore Cash Jewellery Luxury Watches Found | Sakshi
Sakshi News home page

అక్రమ ఆస్తుల పుట్ట : కోట్ల ఆస్తి, నగలు, నగదు, 48 లగ్జరీ వాచెస్‌

Sep 30 2026 2:56 PM | Updated on Sep 30 2026 3:02 PM

Bihar Bureaucrat Couple Raided Rs 1 Crore Cash Jewellery Luxury Watches Found

బిహార్‌లోని పాట్నాలో ప్రభుత్వ అధికారులైన దంపతుల ఇళ్లపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. బిహార్ విజిలెన్స్ బ్యూరో బృందాలు పాట్నా, బెగుసరాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. 

స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి సంఘటనా స్థలానికి యంత్రాలను తీసుకు వచ్చారంటేనే  పరిస్థితిని  అర్థం చేసుకోవచ్చు.  కోటి రూపాయల నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు, విలాసవంతమైన వాచీలతో సహా భారీగా లెక్కల్లో చూపని ఆస్తులను అధికారులు గుర్తించారు. పాట్నా సప్లై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) రవీంద్ర కుమార్ దివాకర్, దానాపూర్ జిల్లా సబ్-రిజిస్ట్రార్ ఆయన భార్య కుమారి స్వీటీలపై అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ డిఐజి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం  రవీంద్ర కుమార్ దివాకర్, ఆయన భార్య పేర్లపై పాట్నాలో రూ. 1.07 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు, భార్య, తండ్రి పేర్లపై రూ. 1.28 కోట్ల విలువైన మూడు ఖాళీ స్థలాలు కొనుగోలు చేసినట్లు తేలింది. పాట్నా నివాసంలో రూ. 70 లక్షల నగదు, రూ. 6 లక్షల విలువైన 48 లగ్జరీ వాచ్‌లు లభించాయి. బెగుసరాయ్‌లోని పూర్వీకుల ఇంట రూ. 9 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు దొరికాయి. మొత్తం నగదు రూ. కోటికి పైనే ఉంది. ఇంకా పెద్ద ఎత్తున భూములు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించేందుకు ప్రత్యేక యంత్రాలను తెప్పించారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : నాలుగేళ్లుగా ప్రీజర్‌లోనే వృద్ధుడి మృతదేహం

ఆపరేషన్ ముగిసిన తర్వాత, సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి విలువ అధికారికంగా వెల్లడి కానుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువైతే సంబంధిత వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయనున్నారు.  ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement