నిమ్స్‌ బార్బర్‌ ఇంట నోట్ల కట్టలు.. ఏసీబీ సోదాల్లో షాక్‌ | NIMS ACB Raids, Fresh Searches In Lakshmi Bhaskar Disproportionate Assets Case, ₹7 Lakh Cash Seized, Check Details Inside | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ బార్బర్‌ ఇంట నోట్ల కట్టలు.. ఏసీబీ సోదాల్లో షాక్‌

Sep 29 2026 10:36 AM | Updated on Sep 29 2026 10:59 AM

NIMS ACB Raids: Fresh Searches in Lakshmi Bhaskar Disproportionate Assets Case

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి అవినీతి నిరోధక శాఖ తనిఖీల కలకలం రేగింది. నిమ్స్‌ ఉద్యోగుల నివాసాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. అడిషన్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ కేసులో భాగంగా ఐదు చోట్ల ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లక్ష్మీ భాస్కర్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిమ్స్‌కు చెందిన పలువురు ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఇళ్లలో కీలకమైన డాక్యుమెంట్లు, నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిమ్స్‌లో బార్బర్‌గా పని చేస్తున్న ధన్‌రాజ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు బయటపడినట్లు తెలుస్తోంది. 

బార్బర్‌ ధన్‌రాజ్‌ ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల్లో లభించిన పత్రాలు, నగదు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. భూముల డాక్యుమెంట్లు, నగదు లావాదేవీలకు సంబంధించినవి అందులో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష్మీ భాస్కర్‌ కేసులో మరికొందరు స్టాఫ్‌ ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. భాస్కర్‌తో ఉన్న సంబంధం, ఆర్థిక లావాదేవీలపై వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు కొనసాగుతుండటంతో నిమ్స్‌ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు వినిపించాయి. అయితే.. సెప్టెంబర్‌ 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదే రోజు ఆయన నివాసంతోపాటు బంధువులు, సన్నిహితులు, అనుబంధ వ్యక్తులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో 8 ఫ్లాట్లు, 5 ఓపెన్‌ ప్లాట్లు, రూ.41 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌, రూ.12 లక్షల పోస్టాఫీస్‌ డిపాజిట్లు, రూ.35 లక్షల పెట్టుబడులు, రూ.29.55 లక్షల మ్యూచువల్‌ ఫండ్స్‌, 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఓట్‌ చోరీ.. ఆయన చెప్పినట్లే జరుగుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement