ఏనుగు ఎంత పని చేసిందీ.. | Bengaluru Wild Elephant Attack Man Killed Near Kengeri | Sakshi
Sakshi News home page

ఏనుగు ఎంత పని చేసిందీ..

Sep 29 2026 10:27 AM | Updated on Sep 29 2026 10:35 AM

Bengaluru Wild Elephant Attack Man Killed Near Kengeri

వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి హతం

బెంగళూరు కెంగేరి పరిధిలో ఘోరం

కర్ణాటక: ఉద్యాననగరిలో అడవి ఏనుగు దాడి కలకలం రేపుతోంది. మైసూరు రోడ్డు అంచెపాళ్యలో నాగరాజు (60) అనే స్థానికుడు సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తుండగా కెంగేరి సమీపంలోని ఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ వద్ద భవనాల మధ్యలోనే ఏనుగు దాడి చేసి హతమార్చింది.

గతంలో నిర్మాణ కార్మికునిగా పనిచేసి ఇప్పుడు ఊరికే ఉంటున్న నాగరాజు ఏనుగు దాడిలో చనిపోయాడని తెలిసి ఆయన భార్య, కూతుళ్లు పరుగు పరుగున వచ్చి రోదించారు. ఆస్పత్రిలో ఉంచిన మృతదేహాన్ని అటవీ మంత్రి రామలింగారెడ్డి పరిశీలించి కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

ఎలా వచ్చి వెళ్లిందంటే..
ఏనుగు గుద్దడంతో ఒకటి రెండు ప్రహరీలు కూడా కూలిపోవడం చూస్తే దాని శక్తి అర్థమవుతుంది. ఈ ఏనుగు బన్నేరుఘట్ట అడవి నుంచి జనావాసాల గుండా బయల్దేరి బీఎం కావల్‌ అరణ్యంలోకి చేరి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో పొలాలు, గుట్టల మధ్యలో ఇళ్ల నిర్మాణం అధికమైంది. ఒకప్పుడు ఇది ఏనుగులు సంచరించే ప్రాంతంగా ఉండేదని చెప్పారు. ఓ కుర్ర ఏనుగు తెల్లవారుజామున 5:10 గంటల సమయంలో పరిగెడుతూ వెళ్లడం ఓ సీసీ కెమెరాలో రికార్డయింది. అటవీ సిబ్బంది ఏనుగు కోసం అన్వేషణ చేపట్టారు. స్థానికుల్లో గుబులు నెలకొంది.

ఇదీ చదవండి: యువకుడిని ఇంట్లోకి పిలిపించి.. చున్నీ గొంతుకు బిగించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement