నేత్రపర్వంగా సిడిమాను | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా సిడిమాను

Sep 29 2026 7:18 AM | Updated on Sep 29 2026 7:18 AM

బొమ్మనహళ్లి: హాసన్‌ జిల్లాలోని చన్నరాయపట్నం తాలూకా దండిగానహళ్లి హోబళి కత్తరిఘట్ట గ్రామంలో వినాయక చవితి తరువాత దండిన సిడిమాను జాతర మహోత్సవం కనులపండువగా జరిగింది. ఆదివారం రాత్రి సిరులతల్లి లక్ష్మీదేవిని ఊరేగింపుగా పట్టణ శివార్లలోని ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రథోత్సవం జరిగింది. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోళ్లను, గొర్రెలను బలి ఇచ్చి దాసయ్యకు నైవేద్యాలు సమర్పించారు. ఎంపీ శ్రేయస్‌ పటేల్‌, ఎమ్మెల్యే హెచ్‌.డి. రేవణ్ణ తదితరులు పూజలు చేశారు.

విజయవాడలో

ఇంజినీరు పర్వేజ్‌?

● చివరిసారి మొబైల్‌ లొకేషన్‌ అక్కడే

బనశంకరి: కాంట్రాక్టర్లు వేధిస్తున్నారంటూ గదగ్‌లో కేఆర్‌డీఎల్‌ శాఖ ఏఈఈ పర్వేజ్‌ (34) అదృశ్యమైన కేసులో క్లూ దొరికింది. ఆయన మొబైల్‌ఫోన్‌ చివరి లొకేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లభ్యమైంది, అయితే ఎక్కడ ఉన్నాడనేది ఇంకా మిస్టరీగానే ఉంది. 5 పోలీస్‌ బృందాలు గాలిస్తున్నాయని గదగ్‌ జిల్లా ఎస్పీ మిథున్‌ తెలిపారు. పర్వేజ్‌ అదృశ్యంపై సోమవారం గదగ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్వేజ్‌ సెప్టెంబరు 13న ఆఫీసు పని ఉందని హంపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గదగ్‌ నుంచి బెంగళూరుకు వెళ్లారు. తరువాత మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని అదృశ్యమయ్యారు. విజయవాడలో మొబైల్‌ లొకేషన్‌ నమోదు అయ్యింది, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రత్యేక పోలీస్‌బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. కాగా, పర్వేజ్‌ డెత్‌నోట్‌ రాసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని గదగ్‌ జిల్లా మైనారీటీ సంఘాలు కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశాయి.

అడవిలో గంజాయి తోట

మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని బీఆర్టీ పులి అభయారణ్యంలో దొడ్డసంపిగే వద్ద అడవిలో పెంచుతున్న 292 గంజాయి మొక్కలను ఎకై ్సజ్‌, అటవీ అధికారులు గుర్తించి పీకివేశారు. మైసూరు అబ్కారీ అధికారి బసవరాజ హడపడ, బీఆర్టీ డీసీఎఫ్‌ శ్రీపతి, చంద్ర తదితరుల ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను తొలగించారు. 5 నుంచి 11 అడుగుల ఎత్తు ఉన్న మొత్తం 292 గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిని తూకం వేయగా 213 కేజీలు తూగాయి. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా ఏపుగా పెరిగిన మొక్కలను పరిశీలించగా గంజాయి అని తెలిసింది. ఎవరో దుండగులు పెంచారని అనుమానాలున్నాయి. కొల్లేగాళ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దయానంద్‌ మాట్లాడుతూ నెల్లికట్టి గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వారికి నీళ్లు,

మాకు ఎండిన పంటలు

● కావేరి జలం కోసం రైతుల ధర్నా

మండ్య: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ, కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని కన్నడ సేన కార్యకర్తలు, రైతులు వినూత్న నిరసన చేపట్టారు. మండ్య నగరంలోని జె.సి. సర్కిల్‌లో ఎండుగడ్డి, పచ్చగడ్డిని పట్టుకుని బెంగళూరు–మైసూరు జాతీయ రహదారిపై కూర్చున్నారు. తమిళనాడుకు నీటిని విడుదలను ఖండిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎండుగడ్డి భాగ్యాన్ని ఇచ్చిందని హేళన చేశారు. ధర్నాతో కొంతసేపు వాహనాలు నిలిచిపోయాయి. కన్నడ నేత మంజునాథ్‌ మాట్లాడుతూ మండ్య ప్రాంతంలో రైతులు, ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే తమిళనాడుకు మాత్రమే విడుదల చేస్తున్నారని ఆరోపించారు. తక్షణం నిలిపివేసి, ఎండిపోతున్న రైతుల పంటలకు నీరివ్వాలన్నారు.

3 గంటలు ప్రదూష్‌ వాంగ్మూలం

బనశంకరి: సంచలనాత్మక చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో నిందితునిగా ఉన్న ప్రదూష్‌ రావు అప్రూవర్‌గా మారిపోగా, అతని వాంగ్మూలాన్ని సేకరించారు. సోమవారం పోలీస్‌భద్రతతో బెంగళూరు 59 వ సీసీహెచ్‌ కోర్టులో హాజరు పరిచారు. రేణుకాస్వామి హత్య గురించి 3 గంటల పాటు వాంగ్మూలం ఇచ్చాడు. జడ్జి సుజాతా సాంబ్రాణి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రదూష్‌ సుదీర్ఘ వాంగ్మూలం ముద్రణ కాగితాలపై అతని సంతకం తీసుకోవలసి ఉంది, ప్రభుత్వ వకీలు వినతి మేరకు విచారణను మంగళవారానికి వాయిదావేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement