బస్సును ఓవర్‌టేక్‌ చేస్తూ ఆటో పల్టీ | - | Sakshi
Sakshi News home page

బస్సును ఓవర్‌టేక్‌ చేస్తూ ఆటో పల్టీ

Sep 29 2026 7:18 AM | Updated on Sep 29 2026 7:18 AM

టిప్పర్‌, బైక్‌ ఆహుతి

చింతామణి: నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో పలుచోట్ల ప్రమాదాలు సంభవించాయి. కేఎస్‌ ఆర్టీసి బస్సును ఓవర్‌ టేక్‌ చేయబోయిన ఆటో పల్టీలు కొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడిన సంఘటన చింతామణి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాయంద్రహళ్లి క్రాస్‌ దగ్గర సోమవారం జరిగింది. వివరాలు... చింతామణి పట్టణం శాంతినగరకు చెందిన లక్ష్మీ, మంజుళ, సింధు తదితరులు హొసకోటలో కూలీ పనులకు ఆటోలో వెళుతున్నారు. అయితే ఆటోడ్రైవర్‌ సత్తి వేగంగా వెళుతూ బస్సును ఓవర్‌టేక్‌ చేయబోగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో మహిళలు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతవాసులు అంబులెన్సును పిలిపించి చింతామణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు పంపించారు. డ్రైవర్‌ చిన్నపాటి గాయంతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

లారీ దూసుకెళ్లి స్కూటరిస్టు..

యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా కార్వార తాలూకా అరగా వద్ద స్కూటరిస్టు మరణించాడు. హైవేలో కార్వారలో సంతకు వెళుతున్న గణపతిగౌడ (60)ను లారీ వేగంగా వెళ్తూ స్కూటర్‌పై లారీ దూసుకెళ్లగా గణపతిగౌడ అక్కడే మృతి చెందారు. స్కూటర్‌లోని పెట్రోలో ట్యాంక్‌ పేలి మంటల్లో కాలిపోయింది. కొంతదూరంలో లారీని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. కార్వార రూరల్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ముగ్గురు మహిళా కూలీలకు

తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement