కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ పేరుతో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అతిపెద్ద కార్యక్రమాన్ని మన భాగ్య నగరంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల అక్టోబర్ 11న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి.. క్యాన్సర్‌ని జయించేలా సన్నద్ధం చేస్తుంది.
కాగా, ఈగ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (GCF) అన్ని వర్గాల ప్రజలు ఈ మహమ్మారిని జయించేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న లాభప్రేకక్షలేని స్వచ్ఛంద సంస్థ. సింపుల్‌గా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు క్యాన్సర్ స్క్రీనింగ్, సంరక్షణను పొందేలా చేస్తుంది.
ఇప్పటి వరకు 15 మిలియన్ల మందికి పైగా ప్రజలను భాగమయ్యేలా చేసింది, 130కి పైగా దేశాలకు విస్తరించింది. అంతేగాదు స్కీనింగ్‌కు మద్దతిచ్చే ఏఐ సామర్థ్యం గల డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను సైతం అందిచడం విశేషం. అంతేగాదు తన సందేశాన్ని అన్ని వర్గాల ప్రజలకు, చేరువయ్యేలా చేయడంలో భాగంగానే ఈ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ వంటి కార్యక్రమాలను చేపడుతోంది.


