సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొదట అధికారులు.. బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్నప్పటికీ కాసేపటి తర్వాత లోపలికి అనుమతించారు.
దీంతో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, తలసాని సాయి కిరణ్ యాదవ్.. ఈడీ అధికారులను కలిసేందుకు ఆఫీసులోకి వెళ్లారు. ఈడీ కార్యాలయం బయట మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు కొనసాగిస్తున్నారు. మంత్రి పొంగులేటి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘అది ముమ్మాటికీ ఫార్మా సిటీనే.. ఫ్యూచర్ సిటీ కాదు’


