ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులా?.. మీరే నష్టపోతారు: కేటీఆర్‌ | BRS KTR Key Comments On Future City | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులా?.. మీరే నష్టపోతారు: కేటీఆర్‌

Sep 28 2026 1:56 PM | Updated on Sep 28 2026 2:20 PM

BRS KTR Key Comments On Future City

సాక్షి, తెలంగాణభవన్‌: పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కాంగ్రెస్‌ నేతల భూములు ముట్టుకోరు? పేదల భూములపై మాత్రం పడతారు. హైడ్రాకు కాంగ్రెస్‌ నేతల భూములు కనపడవా?. రైతుల ఇంటికి పోలీసులను పంపాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెడితే మీరే నష్టపోతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలన మూడేళ్ల మురిపెం అయ్యింది. కాంగ్రెస్‌ 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. తెలంగాణలో గడిచిన మూడేళ్లలో సీఎం రేవంత్‌ రెడ్డి ఒ​క్క మంచి పనైనా చేశాడా?. రేవంత్‌ రెడ్డికి తెలిసింది భూములు అమ్మడం, భూములు కొనడం. రేవంత్‌కు తెలిసింది భూముల దందా ఒక్కటే. బహదూర్‌గూడ భూములపై రేవంత్‌ రెడ్డి కన్నుపడింది. రేవంత్‌ పేదల కడుపుకొట్టి పెద్దవాళ్ల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వెళ్లి అయినా సరే మన భూములను కాపాడుకుందాం. బహదూర్‌గూడలో రేవంత్‌ రెడ్డికి రైతులు కనబడటం లేదు. అక్కడ రూ.6000 కోట్ల భూములు మాత్రమే కనిపిస్తున్నాయి. ఫార్మాసిటీని రద్దు చేసి భూములు వెనక్కి ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఫ్యూచర్‌ సిటీ కడుతామని అంటున్నారు.

రైతులు భూములు ఇచ్చింది.. ఫార్మా సిటీ కోసమే తప్పఫ్యూచర్ సిటీ కోసం కాదు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మహేశ్వరం, కల్వకుర్తి ప్రాంతాల్లో భారీ భూదందా చేస్తున్నారు. బినామీలు ఎవరెవరు? వారి పేర్లు అన్ని సమయం వచ్చినప్పుడు చెప్తా. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెడితే మీరే నష్టపోతారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తున్నారు.బుల్లెట్‌ ట్రైన్‌కు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం కాదు. బుల్లెట్‌ రైలు పేరుతో చేసే భూ దోపిడీకే మేము వ్యతిరేకం. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన భూముల్లోనే బుల్లెట్‌ ట్రైన్‌ పెట్టొచ్చు కదా. ఏడాదిన్నరలో మళ్లీ కేసీఆర్‌ వస్తారు. కేసీఆర్‌ వచ్చాక మళ్లీ మీ పట్టాలు మీకు అప్పగిస్తాం. మోసపోతే గోస పడతారని కేసీఆర్‌ ముందే చెప్పారు.’ అని కామెంట్స్‌ చేశారు.  

ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్స్‌.. దానం సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement