యువకుడిని ఇంట్లోకి పిలిపించి.. చున్నీ గొంతుకు బిగించి.. | Hyderabad Abids Woman Allegedly Kills Youth Over Harassment | Sakshi
Sakshi News home page

యువకుడిని ఇంట్లోకి పిలిపించి.. చున్నీ గొంతుకు బిగించి..

Sep 29 2026 9:59 AM | Updated on Sep 29 2026 9:59 AM

Hyderabad Abids Woman Allegedly Kills Youth Over Harassment

హైదరాబాద్‌: తనను వేధిస్తున్న ఓ యువకుడిని పుట్టింటికి పిలిపించి చున్నీ గొంతుకు బిగించి ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహీంపురాలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్‌నగర్‌లో అనిషా సింగ్‌ ఆమె భర్త లకన్‌ సింగ్‌లు నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో నివసించే సాయినాథ్‌ సింగ్‌ (26) తరచూ అనిషాసింగ్‌ను వేధిస్తున్నాడు.

ఈ విషయం భర్తకు, కొంతమందికి చెప్పడంతో వారందరూ సాయినాథ్‌సింగ్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ సోమవారం అనిషాకు ఫోన్‌ చేసిన సాయినాథ్‌సింగ్‌ తనను కలవాలని వేధించాడు. దీంతో సమీపంలోని రహీంపురాలో ఉన్న తన పుట్టింటికి రావాలని ఆమె సూచించింది. అక్కడకు వచ్చిన సాయినాథ్‌ సింగ్‌ మెడకు చున్నీ బిగించి హతమార్చింది.

అనిషాసింగ్‌తో పాటు మరికొందరు అతడిని చంపేందుకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన స్థలాన్ని గోల్కొండ జోన్‌ డీసీపీ జె.రాఘవేందర్‌ రెడ్డి, కుల్సుంపురా డివిజన్‌ ఏసీపీ తిరుపతి సందర్శించారు.

ఇదీ చదవండి: పెళ్లైన  5 నెలలకే టెకీ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement