breaking news
ACB
-
ఏసీబీకి చిక్కిన కార్యదర్శి.. గ్రామస్తుల సంబరాలు
వీణవంక(హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. దీంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇంటినంబర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. తర్వాత తమ పనికోసం పంచాయతీ కార్యదర్శి నాగరాజును సంప్రదించింది. అయితే నాగరాజు నెల రోజులుగా వారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించకుండా, రూ.20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్ మంజూరు చేస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయంలో వారు కార్యదర్శికి రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలుజీపీ కార్యదర్శి నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారనే విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున జీపీ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్.. నాగరాజు అరెస్టు వివరాలు వెల్లడిస్తుండగానే గ్రామస్తులు చప్పట్లతో అవినీతి అధికారి పీడ పోయిందని నినాదాలు చేశారు. ఆనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నాగరాజు అంతకు ముందు లంచాలకోసం పలువురిని వేధించాడని వారు తెలిపారు. -
AP: లిక్కర్ అక్రమ కేసులో కీలక పరిణామం
సాక్షి,విజయవాడ: లిక్కర్ అక్రమ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ అక్రమ కేసులో ఏ30 పైలా దిలీప్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 117రోజులుగా జైల్లో ఉన్న దిలీప్‌కు గురువారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రాజ్ కసిరెడ్డి పీఎగా ఉన్న పైలా దిలీప్‌ను మే1న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
రూ. 11 కోట్లు నావే అయితే నా వేలి ముద్రలు ఉంటాయి కదా?: రాజ్ కేసిరెడ్డి
విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ. 11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ఈ సందర్భంగా పేర్నొన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది విజయవాడలోని ఏసీబీ కోర్టు. దీనిలో భాగంగా ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు. ‘నన్ను కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో నా పాత్ర ఏమీ లేదు. అన్యాయంగా నన్ను ఇరికించారు. నాపై ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఆ రూ. 11 కోట్లు నావే అయితే నా వేలి ముద్రలు ఉంటాయి కదా?, అసలు రూ. 11 కోట్ల క్యాష్ అనేది ఒక్క వ్యక్తి దగ్గర ఉంటుందా?, నేను స్పై సినిమా తీశాను. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెబుతున్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు. చాలా మంది పేర్లు తొలిసారిగా వింటున్నా’ అని కేసిరెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడ ACB కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దృశ్యాలు
-
మద్యం అక్రమ కేసులో సిట్ పనితనంపై ACB కోర్టు అభ్యంతరం
-
ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ..
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా.. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్
వనస్థలిపురం: వనస్థలిపురం కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ ఎస్.రాజేష్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్టేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్‌గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ
-
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్‌పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్‌రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్‌రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
సాధింపులే లక్ష్యంగా అక్రమ మద్యం కేసు
-
AP Liquor Scam Case: బాబుకు దెబ్బ మీద దెబ్బ
-
ఫోటోలు.. వీడియోలు సమర్పించాల్సిందే.. ACB కోర్టులో సిట్ కు ఎదురుదెబ్బ
-
విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి మెమో దాఖలు
-
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
బేతాళ కుట్రలో మరో అంకం
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు. చెల్లని నోట్లతో కట్టుకథ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
సిట్ మరో అడ్డగోలు బరితెగింపు
సాక్షి, అమరావతి: నిమిషానికో అబద్ధం... అరగంటకో ఎల్లో మీడియా లీక్... గంటకో కట్టుకథ..! మొత్తానికి రోజుకో భేతాళ విక్రమార్క కథ..! మద్యం అక్రమ కేసులో సిట్ బరితెగింపు ఇది. అరాచకంలో రోజురోజుకు అంచనాలను మించుతూ, అడ్డగోలుతనంలో పీహెచ్డీ చేస్తోంది దర్యాప్తు సంస్థ. అక్రమ కేసులో ఆరు నెలలుగా డ్రామాలతో రక్తి కట్టిస్తున్న సిట్.. శనివారం మరోసారి బరితెగించింది. ‘‘ఇంతకంటే దిగజారడం ఉండదని ఊహించిన ప్రతిసారి నా అంచనా తప్పని రుజువు చేస్తున్నావ్’’ అని అదేదో సినిమాలో చెప్పినట్లు.. భేతాళ విక్రమార్క కట్టుకథల్లో అన్ని రికార్డులను దాటేస్తోంది సిట్.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. గత బుధవారం హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు పట్టుబడినట్లు.. ఇదంతా మద్యం అక్రమ కేసు సొమ్మేనంటూ సిట్ ఓ కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామా విజయవాడ ఏసీబీ కోర్టులో తేలిపోయింది. మూడో కంటికి తెలియకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. మద్యం అక్రమ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి అభ్యర్థన మేరకు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని తేల్చి చెప్పింది.మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. కాగా ఈ నగదును రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నిగానీ వాటిలో కొన్నిగానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది. దీంతో సిట్ బండారం బట్టబయలవుతుంది. మొత్తానికి ఏసీబీ కోర్టు... సిట్‌కు చెంపపెట్టు లాంటి ఆదేశాలు జారీ చేసింది. అంతే... దీన్ని కప్పిపుచ్చేందుకు శనివారం సాయంత్రానికి సిట్‌తో పాటు ఎల్లో మీడియా రంగంలోకి దిగాయి. పన్నాగంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సన్నిహితుడు వెంకటేష్‌నాయుడు సెల్‌ఫోన్ నుంచి రిట్రీవ్ చేసినట్లుగా ఓ వీడియోను సిట్ తెరపైకి తెచ్చింది.ఇదిగో కట్టుకథకు నిలువెత్తు సాక్ష్యం..సిట్ తాజా కట్టుకథ ప్రకారం విడుదల చేసిన వీడియోలో... రూ.35 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నారు. ఈ డబ్బునే గత ఏడాది (2024) ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చు కోసం చెవిరెడ్డి వినియోగించారని సిట్ కట్టుకథలతో ఎల్లో మీడియా రంగప్రవేశం చేసింది. ఇది ఎంత డొల్ల వాదన అనేది ఇక్కడే బయటపడింది. ఎలాగంటే.. వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలుగా చెబుతూ సిట్ విడుదల చేసిన వీడియోలో రూ.2 వేల నోట్లు ఉన్నాయి. కానీ, రూ.2 వేల నోటును 2023 మే 19నే రిజర్వ్ బ్యాంక్ వెనక్కుతీసుకుంది.అంటే... ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే రూ.2 వేల నోటు చెలామణి లేదు. ఏడాది ముందుగానే చెలామణి ఆగిపోయిన నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేశారనేది ప్రశ్నార్థకం. ఇదంతా చూస్తుంటే.. హైదరాబాద్‌లో రూ.11 కోట్ల జప్తు భేతాళ విక్రమార్క కథలు బెడిసికొట్టడంతో సిట్ రూ.35 కోట్ల డ్రామాను ముందుకుతెచ్చిందని స్పష్టం అవుతోంది.⇒ కాగా, వెంకటేష్‌నాయుడు రియల్టర్. తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదును మద్యం అక్రమ కేసుకు సిట్ ముడిపెడుతోందని తేలుతోంది. కోర్టులో చెంపపెట్టులాంటి ఆదేశాలతో ప్రజల ను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. వెంకటేష్ నాయుడు అరెస్టు సమయంలో డబ్బుల కట్టల వీడియో ప్రస్తావనే లేదు. రిమాండ్ రిపోర్టు సమయంలోనూ ఈ విషయం రివీల్ చేయలేదు. కానీ, రూ.11 కోట్ల కుట్ర కథ ఫెయిల్‌తో హడావుడిగా వక్రీకరణలకు దిగిందనే విషయం తేటతెల్లం అవుతోంది. -
తిమ్మిని బమ్మి చేయబోయి..
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్‌బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించేందుకు పన్నిన తాజా కుతంత్రం విఫలమైంది. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించేందుకు తెగించిన ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల బరితెగింపు బయటపడింది. ఈ అక్రమ కేసులో రూ.11 కోట్ల నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామాను కప్పిపుచ్చే సిట్ ఎత్తుగడ చిత్తయింది.హైదరాబాద్ శివారులో పట్టుకున్నట్టు చెప్పిన నగదును గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ తాజా కుయుక్తి పన్నింది. తద్వారా... ఈ కేసులో సాక్షులను బెదిరించి, ఆ నగదును తామే తెప్పించి జప్తు చేసినట్టు ఆడిన హైడ్రామాను కప్పిపుచ్చాలని యత్నించింది. కాగా, సిట్ తాజా కుట్రపై ఉప్పందడంతో అక్రమ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు శనివారం వెంటనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.దీన్ని విచారించిన కోర్టు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని విస్పష్టంగా పేర్కొంది. న్యాయస్థానం ఉత్తర్వుల కాపీని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి ఎస్బీఐ అధికారులకు అందజేశారు. నగదును ప్రత్యేకంగా భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. దీంతో రూ.11 కోట్ల జప్తు పేరిట సాగించిన కుట్రను తొక్కిపెట్టాలన్న సిట్ పన్నాగం బెడిసికొట్టింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ సాగించిన కుట్ర... కోర్టు సత్వర స్పందనతో బట్టబయలైన వైనం ఇదిగో ఇలా ఉంది.లేని ఆధారాలు సృష్టించేందుకు జప్తు డ్రామామద్యం అక్రమ కేసులో ఏదో విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. తద్వారా నిందితుల బెయిల్‌ను అడ్డుకోవడమే ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల పన్నాగం. అందుకే సిట్ రూ.11 కోట్లు పట్టివేత కనికట్టు చేసింది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగా కపట నాటకానికి తెరతీసింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి బెంబేలెత్తించింది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి భార్య దివ్యారెడ్డి హైదరాబాద్‌లోని ఎరేట్ హాస్పిటల్లో మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారు.హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి కూడా ఈ హాస్పిటల్లో భాగస్వామి. ఆయనకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, వర్ధమాన్ కాలేజీతో గానీ విజయేందర్‌రెడ్డి ఇతర వ్యాపారాలతోగానీ రాజ్ కేసిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, లేని ఆధారాలు సృష్టించేందుకు విజయేందర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సిట్ వేధించింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించే తమ కుట్రకు సహకరించాలని పోలీసు మార్కు బెదిరింపులకు పాల్పడింది. దాంతో విజయేందర్‌రెడ్డి సిట్ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్టు తెలుస్తోంది.తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అమలు చేసింది. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను ఎవరికీ తెలియకుండా విజయేందర్‌రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీకి సరిగ్గా ఎదురుగానే ఉండే సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ పనికూడా ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ అట్టపెట్టెలు తీసుకెళ్తే ఎవరైనా ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చిన తర్వాత... సిట్ అధికారులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు... రూ.11 కోట్లను గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు. ఆ నగదంతా రాజ్ కేసిరెడ్డిదేనని... 2024 జూన్ నుంచి అక్కడ ఉంచారని కట్టు కథ వినిపించారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ కేసిరెడ్డిరూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకు గానీ తన కుటుంబానికిగానీ ఏ సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈమేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎరేట్ హాస్పిటల్లో తన భార్య కేవలం మైనర్ వాటాతో డైరెక్టర్‌గా ఉన్నారని, విజయేందర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర వ్యాపార సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు.దీనికితోడు సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నగదును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్బీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. కుట్ర కప్పిపుచ్చే కుతంత్రంన్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసుల బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది. అలా చేస్తే బ్యాంకులో ఉండే ఇతర నగదుతో పాటు ఈ రూ.11 కోట్లను కలిపేస్తారు.ఆ నగదు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి సిట్‌కు ఓ డిపాజిట్ పత్రం ఇస్తారు. అంటే నగదు రూపంలో ఉన్న రూ.11 కోట్లు డిపాజిట్ పత్రం రూపంలోకి మారిపోతాయి. బ్యాంకు ఆ నగదును వివిధ అవసరాలకు వాడుకుంటుంది కూడా. అలా ఆ నోట్లు మిగతా నోట్లతో కలిసి మార్కెట్లోకి చెలామణిలోకి వెళ్లిపోతాయి. సిట్ అధికారులు హైదరాబాద్‌లో జప్తు చేసిన నోట్ల కట్టలు ఏవీ అంటే ఎవరూ చెప్పలేరు. ఇదీ సిట్ పన్నాగం...! ఇందుకోసం సిట్ అధికారులు శుక్రవారం రాత్రే రంగంలోకి దిగారు.శుక్రవారం రాత్రి నుంచే హైడ్రామా...శుక్రవారం రాత్రే విజయవాడ ఎస్బీఐ పటమటలోని సీసీఎస్ బ్రాంచి, మాచవరం బ్రాంచి అధికారులను సంప్రదించారు. అంత భారీ నగదును డిపాజిట్‌గా స్వీకరించాలంటే ముందుగా రెండుసార్లు నోట్ల కట్టలను డినామినేషన్ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. మొదటి దశ కింద డినామినేషన్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో దశ డినామినేషన్ శనివారం మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని భావించారు. న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్..సిట్ కుట్రను పసిగట్టిన రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు సత్వరం స్పందించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 నోట్ల కట్టలను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సారి జప్తు చేసినట్టు న్యాయస్థానానికి నివేదించిన నగదు, ఇతర ఆస్తులపై పూర్తి అధికారం కోర్టుకే ఉంటుంది.అటువంటిది కోర్టు అనుమతి లేకుండానే ఆ నగదును డిపాజిట్ చేయడం ద్వారా సిట్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ రూ.11 కోట్లను డిపాజిట్ చేయకుండా సిట్‌ను ఆదేశించాలని కోరారు. అప్పటికే చేస్తే వాటిని ఎస్బీఐలోని ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని సిట్‌తో పాటు ఎస్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శనివారం విచారించింది. ఈ సందర్భంగా సిట్ విచారణ అధికారి ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించేందుకు యత్నించడం గమనార్హం. రూ.11 కోట్లు ఎక్కడ ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించగా.. అప్పటికే ఎస్బీఐలో డిపాజిట్ చేసేశామని ఆయన చెప్పారు. దీనిపై రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నగదును ఇంకా డిపాజిట్ చేయలేదన్నారు. చేసి ఉంటే బ్యాంకు కౌంటర్ ఫాయిల్ చూపించాలన్నారు. ఈ ప్రశ్నకు సిట్ అధికారి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ నగదు డిపాజిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో సోమవారం అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పారు. అందుకు దుష్యంత్‌రెడ్డి సమ్మతించ లేదు. తమకు సిట్‌పై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలో సిట్ పావుగా మారిందన్నారు. రూ.11 కోట్లకు సంబంధించిన బ్యాంకు కౌంటర్ ఫాయిల్ ఫొటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకుని అయినా చూపించమని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరిణామంతో తనకు సమయం కావాలన్న సిట్ అధికారి దాదాపు గంట వరకు పత్తా లేకుండాపోవడం గమనార్హం. రూ.11కోట్లను ప్రత్యేకంగా భద్రపరచండిరాజ్ కేసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.11 కోట్లను విడిగా భద్రపరచాలని సిట్ అధికారులు, ఎస్బీఐ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే డిపాజిట్ స్వీకరించి ఉంటే బ్యాంకులోని ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా భద్ర పరచాలని స్పష్టం చేసింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని సిట్‌ను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని తేల్చి చెప్పింది. దాంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది.ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు బెంబేలుఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నగదు కట్టలను రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది.అంతేకాదు, ఆ నోట్ల కట్టలను ఏ ఏ తేదీల్లో బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారన్నది కూడా ఆర్బీఐ అధికారులు పరిశీలించి వెల్లడిస్తారు. ఆ నోట్ల కట్టలు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024, జూన్ తరువాత బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసినట్టు వెల్లడైతే సిట్ బండారం బట్టబయలవుతుంది. చివరకు కోర్టును తప్పుదారి పట్టించిన సిట్ అధికారులపై న్యాయస్థానం తీవ్రమైన చర్యలకు ఆదేశించవచ్చు. ఆపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసు కుట్ర బెడిసికొడుతుంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు హడలిపోయారు.విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదనజప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సింది ఇలా...పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు తాము జప్తు చేసే స్థిర, చర ఆస్తులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను న్యాయ వ్యవస్థ విస్పష్టంగా పేర్కొంది. అవి ఏమిటంటే...⇒ జప్తు చేసిన నగదు, స్థిర, చర ఆస్తులను మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేయాలి. ⇒అనంతరం పంచనామా చేయాలి. అంటే ఆ స్థిర, చర ఆస్తుల పరిమాణం, స్వరూప స్వభావాలను స్పష్టంగా పేర్కొనాలి. నగదు కాబట్టి.. ఆ నోట్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు, మొత్తం విలువ, వాటిని ఎందులో భద్రపరిచింది? మొదలైన వివరాలతో పంచ నామా చేయాలి. ⇒ జప్తు చేసిన నోట్ల కట్టలను ప్యాకింగ్ చేసి న్యాయస్థానంలో ప్రదర్శించాలి. ప్యాకింగ్ తెరచి మరీ న్యాయస్థానానికి చూపించాలి. ⇒ అనంతరం న్యాయస్థానం అనుమతితో ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో భద్ర పరచాలి. కోర్టు కోరితే ఎప్పుడైనా సరే వాటిని మరోసారి తీసుకొచ్చేందుకు వీలుగా ట్రెజరీలోనే ఉంచాలి. ⇒ కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.కానీ, సిట్ ఏం చేసిందంటే..⇒హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో రూ.11కోట్లు జప్తు చేసినట్టు ప్రకటించింది. ⇒జప్తు చేసిన నోట్ల కట్టలను న్యాయస్థానానికి చూపించనే లేదు. జప్తు చేసినట్టు కేవలం ఓ నోట్ సమర్పించి చేతులు దులుపుకొంది.⇒ ఆ రూ.11 కోట్లను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరచలేదు.⇒ కోర్టు అనుమతి లేకుండానే ఆ రూ.11కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించింది. తద్వారా బ్యాంకులోని ఇతర నోట్ల కట్టలతో వాటిని కలిపేయాలన్నది సిట్ కుట్ర. తద్వారా జప్తు పేరిట తమ కుట్ర బయటపడకుండా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.నోట్ల కట్టలన్నిటికీ బ్యాంక్ పిన్, సీల్స్⇒ వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది⇒ మరి రూ.11 కోట్లని ఎలా నిర్ధారించారు?⇒ లెక్కపెట్టే యంత్రాలను ఎక్కడా చూపలేదు..⇒ అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారు⇒ కానీ, ఇక్కడే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామాసిట్ కపట నాటకంలో మరో అంకం ఇది.. అది జప్తు చూపించిన డబ్బు అంతా కట్టలకు బ్యాంక్ పిన్, సీల్స్‌తో ఉంది. దీన్నిబట్టి కనీసం వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది. అలాగైతే.. ఆ మొత్తం రూ.11కోట్లని ఎలా నిర్ధారించారు? అనేది సమాధానం చెప్పాలి. పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా ఎక్కడా చూపలేదు. అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారని స్పష్టం అవుతోంది. కానీ, ఫామ్‌హౌస్‌లోనే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా నడిపించింది.నోట్ల నంబర్లు రికార్డు చేస్తే సిట్ బండారం బట్టబయలునోట్ల నంబర్లు రికార్డు చేస్తే ఏ బ్యాంకు ద్వారా ఎప్పుడు డ్రా చేశారు? ఎవరి బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు? ఏ టైమ్‌లో డ్రా చేశారు? అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుకే అది తెలియకుండా ఉండేందుకు బహుశా ప్రపంచంలో ఏ విచారణ సంస్థ కూడా చేయని విధంగా సిట్ బరితెగించింది. భారీ స్కెచ్ వేసింది. స్వయంగా డబ్బు తానే పెట్టి.. జప్తు పేరిట కపట నాటకం ఆడింది. ఇదంతా బయటపడకుండా ఉండేందుకు బ్యాంకులోని మిగతా డబ్బులో కలిపేసే కుతంత్రానికి తెరతీసింది. -
లిక్కర్ కేసు.. ఆ రూ. 11 కోట్లను ఇతర నోట్లతో కలపొద్దు: ఏసీబీ కోర్టు
లిక్కర్ కేసు.. సిట్ కుట్ర.. కేసిరెడ్డి పిటిషన్ అప్డేట్స్.. విజయవాడఅక్రమ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలువీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి మెమోకెసిరెడ్డి మెమో పై కోర్టు కీలక ఆదేశాలురూ.11 కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసిబి కోర్టు ఆదేశాలురూ.11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ , మాచవరం ఎస్.బిఐ బ్యాంకుకు ఆదేశండిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశండీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశం👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్లో కోరారు. రూ.11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు. 👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.👉నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్‌కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్‌కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు. నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్‌లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్‌హౌస్‌కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు. -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్‌కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్‌లో నేను వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్‌రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు: రాజ్ కేసిరెడ్డి
సాక్షి, విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఫామ్‌హౌజ్‌లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్న రాజ్ కేసిరెడ్డి.. ఆ ఫామ్ హౌజ్ తీగల విజయేందర్‌రెడ్డికి చెందిందని తెలిపారు.‘‘తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విజయేందర్‌రెడ్డి రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్ ఆసుపత్రిలో నా భార్య మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమే. ..అంతకు మించి విజయేందర్‌రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్‌ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్ అంటూ అబద్ధాలు చెబుతోంది’’ అని రాజ్ కేసిరెడ్డి చెప్పారు. -
ఆ ఆస్తులన్నీ నా కుమారుడివే..?
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావు.. ఏసీబీ కస్టడీలో పలు కీలక వివరాలు వెల్లడించారు. చాలావరకు ఆస్తులు తన కుమారుడి సంపాదనతోనే కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమార్జనపైనే ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కోర్టు అనుమతితో ఈనెల 23 నుంచి ఏసీబీ అధికారులు మురళీధర్‌రావును కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారంతో ఆయన కస్టడీ ముగిసింది. కాగా, ఈనెల 15న ఏసీబీ అధికారులు మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం తెలిసిందే. ఏకకాలంలో హైదరాబాద్‌లోని మురళీధర్ రావు ఇంటితో పాటు.. కరీంనగర్, జహీరాబాద్ సహా మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. స్థిర, చరాస్తులతో పాటు పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలకపత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. వీటితో పాటు బినామీల పేరుతో ఉన్న ఆస్తులను గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో మురళీధర్ రావు ఆస్తులపైనే ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మొదట ఏసీబీ అధికారులకు సహకరించకపోయినా.. వరుసగా ఆస్తుల పత్రాలు, ఇతర కీలక పత్రాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఐదు రోజుల విచారణలో భాగంగా సేకరించిన సమాచారం ఆధారంగా.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
కళ్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామిపై ఏసీబీ ట్రాప్
-
ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులపై ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. వారంలో మూడు సార్లు లాయర్ల ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.వారానికి మూడు సార్లు కుటుంబసభ్యుల ములాఖత్‌కు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. బెడ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. రోజుకొకసారి ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని ఆదేశించింది.మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది. -
Vijayawada: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజువల్స్
-
రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు
-
నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖలోని కీలక ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) వరుస దాడులు, అరెస్టులు కలకలం రేపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తప్పిన ఇంజనీర్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేస్తుండడం శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తదుపరిగా ఎవరిపై దాడులు జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి భారీ సీపేజీలు ఏర్పడ్డాయి. ఈ ఉదంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించగా, ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ విభాగం సిఫారసు చేసింది. దీంతో వీరికి సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పదోన్నతులు నిలుపుదల చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బరాజ్‌ల నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై సమాంతర విచారణ జరిపిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అరెస్టుల పర్వానికి తెరతీసింది. తొలుత హరిరామ్..తర్వాత శ్రీధర్, మురళీధర్‌రావు నీటిపారుదల శాఖలో గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండు కీలక హోదాల్లో కొ నసాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన భూక్య హరిరామ్‌ను గత ఏప్రిల్ 26న ఏసీబీ అరెస్టు చేసింది. ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను గత నెల 11న అరెస్టు చేసింది. శ్రీధర్ కూడా కాళేశ్వరం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వీరిద్దరి వద్ద రూ.వందల కోట్లు విలువైన స్థిర, చరాస్తులు లభించాయి. హరిరామ్‌కు ఇటీవల బెయిల్ లభించగా, శ్రీధర్ రిమాండ్‌లోనే ఉన్నారు. ఇదే క్రమంలో గత మంగళవారం నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్ రావును కూడా ఏసీబీ అరెస్టు చేయడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఈఎన్సీగా సుదీర్ఘ కాలం కొనసాగిన మురళీధర్‌రావు 2011 ఆగస్టు 1 నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా కొనసాగుతున్న మురళీధర్‌రావు 2013 లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, తెలంగాణ వచ్చాక కూడా ఆయన అదే పోస్టులో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత కూడా ఆయన్ను ప్రభుత్వాలు కొనసాగించాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చెబుతారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విజిలెన్స్ విభాగం సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా 2024 ఫిబ్రవరి 8న ఆయనతో ప్రభుత్వం రాజీనామా చేయించింది. ఆ తర్వాత పలుమార్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలకు ఆయన హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆయన్ను ఏసీబీ అరెస్టు చేయడం, ఆయనకు సంబంధించిన నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడడంతో శాఖలో మరోసారి కల కలం రేగింది. ఇలా ఉండగా.. నెలాఖరులోగా జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే మరికొందరిపై ఏసీబీ దాడులు జరగవచ్చనే చర్చ శాఖలో జరుగుతోంది. సర్కారు లక్ష్యం వారే.. బీఆర్ఎస్ పాలనలో చక్రం తప్పిన కొందరు ఇంజనీర్లు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, శాఖ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ మాజీ మంత్రికి రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా సర్కారుకు నివేదికలు అందాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఇంజనీర్లను ఏసీబీ లక్ష్యంగా చేసుకోవచ్చని అంటున్నారు. -
ఏసీబీ కోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డిని జడ్జి ఎదుట సిట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాదులను కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు.. కోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేశారు. కోర్టు ప్రధాన ద్వారం కూడా మూసేశారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది.కాగా, నిన్న (శనివారం) ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఇవాళ ఉదయం(ఆదివారం) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపర్చారు.సిట్ అధికారుల విచారణలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు.అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. -
ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్‌రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్‌రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్‌రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్‌ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది.కీలక అధికారుల్లో మొదలైన గుబులు..వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
-
ఏసీబీ అదుపులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్‌రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలొ ఏసీబీ అదుపులోకి తీసుకుంది.ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ కరీంనగర్, జహీరాబాద్.. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. -
బిల్లు మంజూరుకు రూ.90 వేల డిమాండ్
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గంగారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీడీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలు వెచ్చించి ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని ఆయన ఏఈ జగదీశ్‌ను సంప్రదించారు. అయితే, తనకు రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ డిమాండ్ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిసూచన మేరకు గంగారంలో రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రోడ్డుపైనే నిఘావేసి..: బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గంగారం ప్రధాన చౌరస్తా సమీపంలోని రహదారిపై నిఘా వేశారు. అటుగా వచి్చన కాంట్రాక్టర్ రాజు నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఏ ఈ జగదీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రోడ్డుపైనే బహి రంగంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. -
ఏసీబీ వలలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్
హైదరాబాద్: జీఎస్టీ రిజి్రస్టేషన్ కోసం రూ.8 వేల లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, ఎం.సుధ నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్యాక్స్ ఆఫీసర్ సుధ రూ.8 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం ఆమె బాధితుడిని నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నాలుగోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ గత నెల 30వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు.కాగా, తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కుమార్‌ను మూడు సార్లు విచారించగా.. మళ్లీ నాలుగోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ సీనియర్ అసిస్టెంట్
కూకట్పల్లి(హైదరాబాద్): లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగి సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మూసాపేట సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో సునీత సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ బాధితుడు మూసాపేటలో తన తల్లిదండ్రులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ను తన పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాడు. రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న సునీత తనకు సంబంధించిన విధులు కాకపోయినప్పటికీ.. ఈ విషయంలో కలుగజేసుకుని.. ఆస్తి పన్ను మ్యుటేషన్ చేసేందుకు రూ.80 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను తీసుకుని మొదటి విడతగా రూ.30 వేలు ఆమెకు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సునీతతో పాటు రెవెన్యూ శాఖలో పని చేసే పలువురిని ప్రశ్నించినట్లు తెలిసింది. లంచం విషయంలో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయంలో వివిధ చోట్ల సోదాలు చేశారు. ఈ మేరకు సునీతను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
కంటోన్మెంట్/ ఉప్పల్/మద్నూర్ (జుక్కల్): ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్టీఓ చెక్‌పోస్టులో కూడా సోదాలు చేశారు. గురువారం ఉదయం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. అక్కడ తచ్చాడుతున్న సుమారు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక్కో ఏజెంట్ వద్ద 50 వాహనాలు, లైసెన్సులు, రెన్యూవల్స్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.ఇన్చార్జి ఆర్టీఓ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని సూచించారు. ఆర్టీఓ సిబ్బందిని కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి రూ.3,450 నగదు, మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏసీబీ సోదాలను ముందుగానే పసిగట్టిన కొందరు అధికారులు సెలవులు పెట్టి వెళ్లినట్లు ఒక ఏసీబీ అధికారి అనుమానం వ్యక్తంచేశారు. సోదాల విషయం లీకవ్వడం వల్లనే ఆశించిన విధంగా పట్టుకోలేక పోయినట్లు తెలిపారు. ఆర్టీఓ చెక్‌పోస్టులో సోదాలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అక్కడ లెక్కలోకి రాని రూ.91 వేల నగదును గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్న సమయంలో చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కనిపించారు.విధుల్లో ఉండాల్సిన ఏఎంవీవై కవిత, కానిస్టేబుల్ మొయినొద్దీన్ నిద్ర పోతున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన మరికొందరు ప్రైవేటు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. చెక్‌పోస్ట్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఏర్పాటుచేసిన ఒక డబ్బాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీల డ్రైవర్లు డబ్బులు వేస్తూ వెళ్తున్నారు. ఏసీబీ అధికారుల ముందే డ్రైవర్లు నగదును డబ్బాలో వేశారు. మొత్తం రూ.91 వేల అక్రమ నగదు లభించిందని డీఏస్పీ తెలిపారు. -
తెలంగాణ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపించివేశారు. ఆర్టీఏ బ్రోకర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అవినీతికి పాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై ఏసీబీ రెండోసారి సోదాలు చేపట్టింది. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్స్ ద్వారా జరుగుతున్న పలు అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. అక్రమాలకుపాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై డేగ కన్ను వేసిన ఏసీబీ.. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన ఆర్టీఏలపై దృష్టిసారించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లను సైతం ఏసీబీ విచారిస్తోంది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో ఇద్దరు క్లర్క్‌లతో పాటు 10 మంది ఏజెంట్లు, ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
Formula-E Race Case: ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్.. ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. -
శ్రీధర్ బినామీలపై ఏసీబీ ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ శాఖ ఈఈ నూనె శ్రీధర్ బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. శ్రీధర్ తన అక్రమార్జనను బినామీల పేరిట దాచినట్టు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడు వారికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు అనుమతితో ఈ నెల 20 నుంచి నూనె శ్రీధర్‌ను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణలో పలు కీలక వివరాలు సేకరించారు. మంగళవారం చివరి రోజు విచారణలో బినామీల గురించే ఎక్కువసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం ఒక ఎస్బీఐ బ్యాంకు లాకర్ తెరిపించగా, మంగళవారం మరికొన్ని లాకర్లను తెరిపించారు. అందులో కొన్ని ఆస్తి పత్రాలు గుర్తించారు. ఎవరెవరి పేర్లపై ఈ ఆస్తులు ఉన్నాయి..? వారికి శ్రీధర్‌తో సంబంధాలు ఏంటి..? అన్నది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం నూనె శ్రీధర్ ఆస్తులు రూ.200 కోట్లకుపైనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. లాకర్లలో పట్టుబడిన డాక్యుమెంట్ల ప్రకారం అది మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీధర్ కస్టడీ ముగియటంతో బినామీలకు నోటీసులు జారీచేసిన వారిని సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ మనీషా
అంబర్‌పేట: కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ టి.మనీషా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒప్పందం ప్రకారం రెండోవిడత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్–16 పరిధిలోని గోల్నాక వార్డు కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మనీషా సర్కిల్ పరిధిలో నల్లకుంట డివిజన్ ఏఈగా కొంత కాలం పని చేసి ప్రస్తుతం గోల్నాక డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఓ అభివృద్ధి పనిని కాంట్రాక్టర్ దక్కించుకుని పూర్తి చేశాడు. దాని బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ ఏఈని అడుగగా ఆమె రూ.15 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.5 వేలు ఇచ్చాడు. రెండో విడత అందించేందుకు ముందు అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం గోల్నాక వార్డు కార్యాలయంలో ఏఈకి డబ్బులు అందించాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏఈ మనీషా ఏసీబీకి పట్టుబడక మందు అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తి కాకముందే అనుమతి తీసుకుని బయటకు వచ్చి ఏసీబీకి పట్టబడడం గమనార్హం. -
నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా నగలు, నగదు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరబోతున్నారు. సోమవారం నాలుగో రోజు కస్టడీలో భాగంగా నూనె శ్రీధర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించారు. మొదటి మూడు రోజులు సహకరించనప్పటికీ సోమవారం పలు ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ముందుంచి ప్రశ్నించడంతో శ్రీధర్ నోరువిప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిపించగా వాటిలో భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు, నగదును ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం లాకర్లలో లభ్యమైన బంగారు ఆభరణాల విలువే రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని తెలిసింది. అయితే అందులోని ఆస్తుల వివరాలు ఏమిటో తెలియరాలేదు. కోర్టు ఆదేశం ప్రకారం మంగళవారంతో శ్రీధర్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన వివరాల ఆధారంగా శ్రీధర్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరికి ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. -
KTR: ఏసీబీకి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని కేటీఆర్‌ను అడిగారు. ఇదే అంశంపై కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో 2024లో ఫోన్లు మార్చాను. గతంలో వాడిన ఫోన్లు నా దగ్గర లేవు. 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని అడిగిన ఏసీబీ. ఫోన్లు అడగడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఫోన్లను అడగడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్‌కు న్యాయవాదులు వివరించినట్లు సమాచారం. -
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’
సాక్షి,హైదరాబాద్: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఇవాళ కేసీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు. కేటీఆర్‌ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు. -
ఇది కేసీఆర్ సైన్యం.. ఎవరూ టచ్ చేయలేరన్న కేటీఆర్ (చిత్రాలు)
-
భయపడను.. అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్‌పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు. ‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్‌కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్(KTR) అన్నారు.అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అంతకు ముందు.. ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. -
కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్‌లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్‌కుమార్‌ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్‌ఎన్‌రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్‌గా విచారించారు. తాజాగా కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్‌లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. -
రేవంత్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్‌రెడ్డి గారూ.. ఓటుకు నోటు కేసులో మీరు..ఫార్ములా ఈ అంశంలో నేను.. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. న్యాయమూర్తి సమక్షంలో మనిద్దరం లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించుకోకూడదు. ఈ పరీక్షను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే అసలు దోషులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నాతోపాటు లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యే దమ్ముందా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేశారు. శుక్రవారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వం నడిపే చేవలేనప్పుడు ప్రజలతో సర్కస్ చేస్తూ వారి దృష్టిని మళ్లిస్తారు.కానీ కాంగ్రెస్ పార్టీతోపాటు దాని జోకర్ సీఎం చేసే హడావుడి మమ్ములను అడ్డుకోలేవు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా–ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. చట్టానికి కట్టుబడిన పౌరుడిగా విచారణకు హాజరై ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నల్లటి బ్యాగ్ నిండా డబ్బుతో దొరికి పదేళ్లు పూర్తి చేసుకున్నదెవరో చెప్పగలరా. ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న సీఎం రేవంత్.. పదే పదే విచారణలు, ప్రచారాలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు’అని కేటీఆర్ ప్రశ్నించారు.విద్యా వ్యవస్థపై బాధ్యత లేదురాష్ట్రంలో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. దీని పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. పాఠశాలలు పునః ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. ఎమ్మెల్యే పల్లాకు పరామర్శసోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తాతా మధు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. -
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్‌కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025 -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేసీఆర్ కు నోటీసులు
-
ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులుచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం(జూన్ 16)న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.జనవరి 9వ తేదీన సుమారు ఆరున్నర గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఆపై ఈ ఏడాది మే చివరి వారం(28వ తేదీ)లో మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలియజేశారు. దీంతో మరోసారి ఇవాళ మూడోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10గం. విచారణకు రావాలని ఏసీబీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. కిందటి ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. తిరిగి.. 9వ తేదీ విచారణకు హాజరై ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో 3 ఇండిపెండెంట్ హౌస్‌లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేలింది.రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
కళ్లు బైర్లు కమ్మేలా.. వామ్మో కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు ఇన్ని వందల కోట్లా
సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కేసులో నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో నూనె శ్రీధర్‌కు రూ.200కోట్లు ఆస్తుల్ని గుర్తించినట్లు సమాచారం.ఏసీబీ అధికారుల దాడుల్లో హైదరాబాద్‌తో పాటు 15 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. హైదరాబాద్ , కరీంనగర్ వరంగల్‌లో 19 ప్లాట్లు, తెల్లాపూర్‌లో విల్లా, అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండివ్యూజువల్ హౌస్, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, పలు హోటల్స్ బినామీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో తేలినట్లు సమాచారం. నూనె శ్రీధర్ తన కుమారుడు డెస్టినేషన్ మ్యారేజీని థాయిలాండ్‌లో చేసినట్లు ఆధారాల్ని సేకరించారు. దీంతో పాటు భారీగా బంగారం, నగలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.కాగా, నూనె శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,7,8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. -
ఈ గోపాలుడి లీలలు వేరయా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సీఐ పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు దిగి ఊచలు లెక్కిస్తున్న సుధాకర్‌కు తెలుగుదేశం నేత, ఓ సంస్థ చైర్మన్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి విమానాల్లో పలుమార్లు గోవా, బ్యాంకాక్ లాంటి ట్రిప్పులకు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. తాను ఏసీబీ సీఐ అని పరిచయం చేసుకుంటూ.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యవహారంలో టీడీపీ నేత బలగ సుధాకర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే, అసలు మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గోపాలుడు మరొకరు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్ హోదాలో అధికారం చెలాయిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్‌తో సదరు చైర్మన్ ఎంతో అన్యోన్యంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళుతూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలు తెలుగుదేశం పార్టీ అంతర్గత గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు సుధాకర్‌కు పలువురు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ పరిచయాలు ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో నగర శివారులోని రిసార్టుల్లో పలువురితో ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయిల ద్వారా పలువురు నేతలు, అధికారులతో అన్యోన్యంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు రికార్డు చేసి హనీట్రాప్ ద్వారా లక్షలు గుంజినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే సదరు చైర్మన్‌తో పాటు ఇతర వ్యక్తుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర చినబాబుతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్న సదరు నేతపై టీడీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. వివిధ ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా.. మాట చెల్లుబాటు చేసుకుంటుండంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ తలదూర్చుతుండటం కూడా ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో సదరు చైర్మన్‌పై పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికి ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను పంపి మరీ బాగోతాన్ని వెలికితీయాలని కోరినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇక సదరు సంస్థలో కూడా ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కేటాయిస్తూ దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని శాఖల్లోనూ వసూళ్లు నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్.. అధికార పారీ్టకి చెందిన నేత, ఇతర పోలీసుల అండదండలు చూసుకుని రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లు, రవాణాశాఖ, రెవెన్యూ, విద్యుత్ శాఖతో పాటు రాజకీయ పారీ్టల నేతలనూ బెదిరించి భారీగా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. ఏసీబీ పేరుతో పలువురు అధికారుల నుంచి లక్షల్లో గుంజుకున్నట్టు సమాచారం. వీరెవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు మాత్రం రావడం లేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే తమ మీద కూడా కేసు నమోదవుతుందనే భయమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ప్రధానంగా పలువురు సబ్ రిజిస్ట్రార్ల వద్ద లక్షల్లో వసూలు చేశారని తెలుస్తోంది. ఇక రెవెన్యూ శాఖలో కూడా భూలావాదేవీల్లో దండుకుంటున్న అధికారులను గుర్తించి టార్గెట్లు ఇచ్చి మరీ వసూలు చేశారనే ప్రచారం ఉంది. ఇక రవాణాశాఖలో కూడా కొద్ది మంది వద్ద లక్షల్లో వసూలు చేశారని సమాచారం. ఇక కొద్ది మంది నేతలు, అధికారులతో తమ బ్యాచ్‌లో ఉన్న మహిళల ద్వారా చనువుగా మాట్లాడించి.. ఆ మాటలను రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు తెగబడ్డారనే పేరుంది. ఒక విధంగా హనీట్రాప్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ విధంగా భారీగా దండుకున్న సొమ్ముతో సదరు బ్యాచ్ జల్సాలు చేసేవారు. ప్రధానంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలను ఇప్పు డు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్
కవాడిగూడ: ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.1.25 లక్షలు డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా రూ. 25 వేలు లంచం తీసుకుంటున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీటీ రేంజ్– 2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతాఫల్‌మండీ ప్రాంతానికి చెందిన రామకృష్ణ ఓ క్యాంటీన్లో పని చేసేవాడు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందడంతో ఆమె పేరున తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు బ్యాంక్ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని సూచించారు. దీంతో అతను ఫ్యామిలీ సరి్టఫికెట్ కోసం ముషీరాబాద్ తహసీల్ధార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ ఆర్ఐ భూపాల మహేష్ ను సంప్రదించాడు. ఇందుకు అతను రూ.1.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే తాను క్యాంటిన్లో పనిచేస్తున్నానని అంత ఇచ్చుకోలేనని చెప్పినా ఆర్ఐ వినిపించుకోకుండా రూ.1.10 లక్షలు ఇస్తేనే ఫ్యామిలీ సరి్టఫికెట్ ఇస్తానని చెప్పాడు. దీంతో రామకృష్ణ నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిటీ రేంజ్ 2 ఏసీపీ, డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ తహసీల్ధార్ కార్యాలయంలో ఆర్ఐ మహేష్ కు రామకృష్ణకు రూ.25 వేల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహే‹Ùపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఇటీవల అతను జారీ చేసిన సరి్టఫికెట్లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా మరో బృందం కొంపల్లిలోని మహేష్ నివాసంలోనూ సోదాలు నిర్వహించింది. ఈ దాడిలో ఏసీబీ సిఐలు గౌస్ అజాద్, జగన్మోహన్రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య సికింద్రాబాద్: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ కోటేశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాలీ పాత్ వే రైల్వే ట్రాక్ ప్రక్కన బుధవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సుమారు 25 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నలుపు గల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం విధానంపై నమోౖదెన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా’ అని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవ#తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖరెడ్డిని మూడు రోజులు, కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ఎలా! కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాదులు నాగార్జునరెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్ సీజ్ చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎల్రక్టానిక్ డివైజ్‌లను, మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎలా పంపుతారని ప్రశి్నంచారు.ఈ కేసును మొదట్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వారు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమరి్పంచలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే బాధితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ సమరి్పంచిన మెమోలో సైతం ఏ మెటీరియల్ సీజ్ చేశారనే విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమరి్పంచలేదన్నారు. సిట్ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికçప్పుడు విచారణ అధికారి ఆర్.శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిట్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో ‘కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు. మీరు డైరెక్ట్‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలి’ అని న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు బాధితుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కొనసాగిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సాక్షులను బెదిరించకుండా, ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025 హరీష్‌రావు రియాక్షన్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ.. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్‌కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్‌రావు అన్నారు. -
KTR:కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తాను. The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E caseAs a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassmentAs I have planned to leave for the UK & USA for…— KTR (@KTRBRS) May 26, 2025ఇప్పటికే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే వారి ముందు హాజరవుతాను. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపాను’అని అన్నారు. అదే సమయంలో 48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. ఆ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడ లేదు’ అని ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ అరుణ ఏసీబీకి చిక్కారు. ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఓ వ్యక్తి తన కుమారుడు పేరు మీద సొంత భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు చలానా తీశాడు. అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు చేసినందుకు సబ్ రిజిస్టార్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.సబ్ రిజిస్ట్రార్ ఆదేశించడంతో డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ కార్యాలయంలో బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్
-
‘ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు.. అరెస్టుకు ఆధారాల్లేవ్’
విజయవాడ: రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు: సుప్రీంకోర్టు -
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డీఎస్పీ ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తింపు
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. -
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్‌ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్ సెంటర్‌ను భవిష్యత్‌లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కమలాకర్‌రెడ్డి, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు కాల్ చేయాలని డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపారు. -
ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన పోలీసు ఉన్నతాధికారులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఏబీసీకి చిక్కారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ డీఎస్పీ, సీఐ ఏబీసీకి దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ఓ ఆస్పత్రిపై నమోదైన కేసులో భారీగా లంచం డిమాండ్ చేశారు.. కేసు వివరాలను.. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మీడియాకు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, వ్యాపారం సజావుగా సాగాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారధి డిమాండ్ చేశారు. డీఎస్పీను కలిసి సెటిల్ చేసుకోమంటూ సీఐ వీర రాఘవులు ఆఫర్ ఇచ్చారు. డీఎస్పీని కలిసిన సదరు వ్యక్తి.. రూ. 25 లక్షలు ఇవ్వలేనని ప్రాధేయపడటంతో రూ. 16 లక్షలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ సీఐ, డీఎస్పీ ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి పూర్తి స్థాయిలో విచారించామని . ఏసీబీ డీఎస్పీ తెలిపారు.గతంలో కూడా సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తాం. డబ్బులు తీసుకుంటూ దొరకడమే కాదు. డిమాండ్ చేయడం కూడా నేరంలో భాగమే’’ అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య -
అసెంబ్లీలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’?.. ఎమ్మెల్యే అరెస్ట్!
ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జైపూర్: భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ జైపూర్ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్ చేశారు. అయితే చివరకు డీల్ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, స్పీకర్ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. భారత్ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్ ఆదివాసీ పార్టీ కన్వీనర్, బంస్వారా ఎంపీ రాజ్‌కుమార్ రావోత్ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది. -
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్‌కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన మొయినుద్దీన్‌ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
హరిరామ్ ఆస్తులు రూ.250 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు గుర్తించాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, షేక్‌పేటలో ఒక విల్లా, కొండాపూర్‌లో ఒక విల్లా, మాదాపూర్‌లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్‌లో, మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్టు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ కట్టేపనిలో ఉన్నారు. అదేవిధంగా మూడు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిచేందుకు అనుమతి కోరుతూ అధికారులు సోమవారం కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్టు సమాచారం. కాగా, శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపిన అధికారులు.. హరిరామ్‌ను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపర్చగా. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బినామీలపై ఆరా: ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనను కొందరు బినామీల పేరిట పెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. వారు ఎవరు, ఎక్కడెక్కడ వారి పేరి ట ఆస్తులు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. జలసౌధ కార్యాల యంలో సేకరించిన పలు పత్రాలు, హరిరామ్ ఇంట్లో లభించిన పత్రాలను పరిశీలించే పనిని ప్రత్యేక టీంకు అప్పగించినట్టు తెలిసింది. హరిరాం ఇంట్లో, సిద్దిపేట జిల్లా మర్కూక్ తహ సీల్దార్ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయన భార్య అనితపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, టోలీచౌకిలోని హరిరాం ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తిపత్రాలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి గుర్తింపు.. అలాగే, మూడు బ్యాంక్ లాకర్స్‌ను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా అనధికారిక లావాదేవీలను కూడా గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసును ఏసీబీ బుక్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఇక, ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. -
ఏపీ హైకోర్టులో విడదల రజినికి ఊరట
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా.. 41 ఏ నోటీస్ ఫాలో కావాలని స్పష్టం చేసింది.అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంవ్యాఖ్యలు చేయొద్దని రజినికి కోర్టు స్పష్టం చేసింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఏసీబీ చేత నమోదు చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు. అయితే తమపై కక్ష పూరితంగా కేసులుట్టారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి విడుదల రజిని తో పాటు ఆమె పీఏ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. -
ఏసీబీ కేసు నమోదు చేయటంపై ఎక్స్ లో విడదల రజినీ పోస్ట్
-
ఆ ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చా..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు ఇలాకా చంద్రగిరిలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టుబడ్డ ఆ అధికారి, ఫిర్యాదుదారుడికి మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన కీలక రికార్డులు ఏసీబీ చేతికి చిక్కినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘నేను ఆ సీటుకు రావడానికి ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చాను.. మీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర కూడా డబ్బు తీసుకోకుండా పని చేయాలంటే.. నేను ఎలా బతకాలి? నేను ఇచ్చిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి? నా కుటుంబం రోడ్డున పడితే ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఇటీవల చంద్రగిరిలో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య, కాంట్రాక్టర్ దినేష్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కినట్టు తెలిసింది. చంద్రగిరిలో పంచాయతీ తరఫున రావాల్సిన బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్ దినేష్ నుంచి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య రూ.50 వేలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దినేష్‌కు ఓ రికార్డింగ్ చిప్ ఇచ్చి నాలుగు రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసినట్టు తెలిసింది. అనంతరం శుక్రవారం పంచాయతీ ఈవోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా, ఆ సంభాషణలో పంచాయతీ ఈవో మహేశ్వరయ్య.. ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నట్టుగా చెప్పడం కూడా అందులో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల బదిలీల సమయంలో.. చంద్రగిరిలో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఉద్యోగుల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధికి ఎవరెవ్వరు ఎంత ముడుపులు ఇచ్చారో కూడా వారి సంభాషణల్లో నిక్షిప్తమై ఉన్నట్టు తెలిసింది. -
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
సాక్షి, చిత్తూరు: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ(ACB) అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లంచావతారమెత్తిన అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్‌ల కోసం భారీగా డిమాండ్ తలెత్తింది. అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లించినట్టు అప్పట్లో దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏపనికి వెళ్లినా మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! ‘చంద్రగిరి(Chandragiri) పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్‌లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వర య్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ దినేష్ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు చంద్రగిరి మేజర్ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
Hyderabad: గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే
గచ్చిబౌలి: అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం టీజీఎస్పీడీసీఎల్ గచ్చిబౌలి ఆపరేషన్స్ విద్యుత్ ఏడీఈ కె.సతీష్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని టేబుల్ డెస్‌్కలో రూ.50 వేలను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. గచ్చిబౌలి డివిజన్లోని గోపన్‌పల్లిలో ఓ ఇంట్లో ట్రాన్స్ఫార్మర్, సీటీ మీటర్ బిగించడానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ శివారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఈ సతీష్ డిమాండ్ చేశాడు. దీంతో మొదట రూ.25 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.50వేలు శుక్రవారం అందించగా తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెట్టారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేయగా కెమికల్‌తో కూడిన డబ్బులు డెస్‌్కలో దొరకడంతో స్వా«దీనం చేసుకొని సతీష్ ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. రూ. 100 కోట్లకుపైనే అక్రమాస్తులు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు సదరు అధికారికి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అవినీతి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 1064కు అందించాలి.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. సోషల్ మీడియా వాట్సప్ నంబర్ 94404 46106కు సైతం సమాచారం అందించవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు. -
వీరు మారరా..?
ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) పేరు వినిపిస్తేనే అధికారులు హడలిపోయేవారు. ప్రస్తుతం లంచం తీసుకోవడం.. ఏసీబీకి చిక్కడం.. సాధారణమయింది. వారికి చిక్కినా మళ్లీ ఉద్యోగం ఉంటుందనే భరోసా లంచావతారులుగా మారుస్తోంది. నెల గడవక ముందే ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.వికారాబాద్/ధారూరు: ముఖ్యమంత్రి, శాసన సభాపతి సొంత ఇలాకాలో కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచావతారులుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ధారూరు ఎస్ఐ, అతని డ్రైవర్ మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఓ మైనర్‌ను కేసు నుంచి తప్పించడంతో పాటు మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) అధికారుల బృందం వేసిన వలలో ధారూరు ఠాణా ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న ఎస్ఐ, అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ మేరకు వారిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. గతేడాది డిసెంబర్లో తాండూరులో ఓ తహసీల్దార్, ఆర్ఐ క్యాడర్ అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి రెండు నెలలు గడవకముందే ధారూరు ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేతల అండదండలు..? అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకుని వస్తున్న అధికారులు వసూళ్లకు తెగబబడుతున్నారు. పోస్టింగ్‌కు వెచ్చించిన సొమ్ము ఎలా పూడ్చుకోవాలని కొందరి ముందు అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారట. దీంతో ఉన్నత స్థాయి పర్యవేక్షణాధికారులకు ఇది అడ్డంకిగా మారుతోంది. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కితే ఎస్ఐ(Dharur SI ) జలగలా పీడిస్తున్నారని.. రాజీ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడతున్నారని వేణుగోపాల్ గౌడ్ వచి్చన నాటి ఇదే తంతు కొనసాగుతోందని ఆరోపణలున్నాయి. డిపార్ట్మెంట్ డ్రైవర్‌ను పెట్టుకోకుండా ప్రైవేట్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లు చేశారని పోలీసులే చెప్పడం గమనార్హం. డ్రైవర్ వసూలైన డబ్బులో చేతివాటం ప్రదర్శించడంతో కొత్త డ్రైవర్‌ను నియమించుకుని ఇసుక ట్రాక్టర్లు, లోడ్‌తో వెళుతున్న లారీల డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.వేలల్లో వసూలు చేయడం ధారూరు ఠాణాలో చూశామని బాధితులు వాపోతున్నారు. కేసు ఏదైనా డబ్బు ముట్టజెప్పాల్సిందేనని ఫిర్యాదుదారులు, నిందితులు బాహాటంగానే చెబుతున్నారు. రెవెన్యూ, హెల్త్, పోలీస్, మున్సిపల్ శాఖల్లో విధులు నిర్వహించే పలువురిపై ఏసీబీ అధికారుల నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ఏసీబీ వలలో జిల్లా యంత్రాంగం తాజాగా పోలీసు శాఖలో పనిచేసే ఎస్ఐ అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ పట్టుబడగా.. ఇరవై రోజుల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడిన విషయం తెలిసిందే. ఇలా తరచూ బాధితులు లంచావతారుల బాధలు తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గతంలో తాండూరులో ఓ సబ్ రిజిస్టార్, పరిగిలో ఎంపీడీఓ, ఈజీఎస్ ఉద్యోగులు, డిప్యూటీ తహసీల్దార్, వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఓ పోలీసు అధికారి, వికారాబాద్‌లో(Vikarabad) ఓ ఇంజనీర్ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. తాజాగా పట్టుబడిన వారు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వారు కాగా.. మిగిలిన శాఖల్లోనే ఇదే పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, మైనింగ్, సబ్ రిజి్రస్టార్, ఎస్టీఓ, డీటీఓ, ఆర్టీఏ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదయినా సరే పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీరు చేసిన వసూళ్లో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులకు సైతం ముడుపులు అందుతాయని అందుకే వారు కూడా నోరుమెదపరని ఆరోపణలున్నాయి. జిల్లాలో మరి కొందరిపై నిఘా!తాజా ఘటన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఘటనపై చర్చించి పునారవృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బు తీసుకుని రూ.కోట్లతో ఉడాయించిన కేసులో దీపక్ వైష్టవ్ అనే వ్యాపారి నుంచి రూ. 30లక్షల వరకు వసూలు చేసి కేసు నీరుగార్చారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుకాగా అతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు పెద్దమొత్తంలో లంచం తీసుకున్నారని సమాచారం. కేసు నమో దు చేసి 70 రోజులు గడిచినా నిందితుడిని అరె స్టు చేయకుండా తాత్సారం చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఉన్నతాధికారులు ఆ కేసు సీసీఎస్ పోలీసులకు అప్పగించగా వారు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. గత డిసెంబర్లో ఐదుగురు ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు కేసు నమోదు చేయగా వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.1.10లక్షలు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. వికారాబాద్‌తో పాటు పరిగి, కొడంగల్, తాండూరు సర్కిళ్ల పరిధిలోనూ కొందరు ఎస్హెచ్ఓలతో పాటు పర్యవేక్షణాధికారులమీద ఆరోపనలు వస్తున్నాయి. పరిగి సబ్ డివిజన్ పరిధిలో ఓ బోరు బండిని పట్టుకుని వదిలేసిన కేసులో, రేసింగ్‌కు వినియోగించే పావురాలను పట్టుకున్న కేసులోనూ పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం జరుగుతోంది. రోజు వారీగా కేసులు నమోదులో వచ్చే మామూళ్లతో పాటు కొందరు ఎస్హెచ్ఓలు నెలవారీ మామూళ్లు మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.రేషన్ బియ్యం, కిరోసిన్, అక్రమ ఇసుక, మట్టి, కలప రవాణా చేసే వ్యక్తులతో పాటు మద్యం దుకాణాల నుంచి నెలవారీ మా మూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపనలు ఉన్నా యి. కాగా వారం రోజుల క్రితమే ఎస్ఐ వద్ద డ్రైవర్‌గా చేరిన బీరప్పను బలిపశువు చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టగా ఏసీబీ అధికారులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
3 ఇళ్లు.. రూ.4 కోట్ల ఆస్తులు
సాక్షి, హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. శుక్రవారం నుంచి శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో నిర్వహించిన సోదా ల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు, బంగారంతోపాటు విదేశీ మద్యం గుర్తించినట్లు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉన్న శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమి, నగదు, బంగారం, ఇతర ఆభరణాలు, వాహనాలు, ఖరీదైన గృహోపకరణాలు కలిపి మొత్తం రూ.4,04,78,767 విలువైన ఆస్తులను గుర్తించినట్టు విజయ్‌కుమార్ వెల్లడించారు. బహిరంగమార్కెట్లో ఈ ఆస్తు ల విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.శ్రీనివాస్‌పై అవి నీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968 కింద కేసు నమోదు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. ఏసీబీ సోదాల్లో గుర్తించిన శ్రీనివాస్ అక్రమాస్తులు » శ్రీనివాస్ నివాసంలో రూ.19,55,650 విలువైన 1,542.8 గ్రాముల (కిలోన్నర)బంగారం. రూ.28 వేల విలువైన వెండి ఆభరణాలు. » శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.2,79,32,740 విలువైన మూడు ఇళ్లకు సంబంధించిన పత్రాలు. » రూ.13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్ల పత్రాలు. » రూ.14,04,768 విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు. » బ్యాంకు ఖాతాలో రూ.5,85,409 డిపాజిట్లు. » రూ.22,85,700 విలువైన గృహోపకరణాలు. » రూ.43,80,000 విలువైన మూడు కార్లు, ఒక బైక్. » రూ.5.29,000 ఖరీదు చేసే 23 విదేశీ మద్యం బాటిళ్లు. -
‘కేజ్రీవాల్.. ఇది చాలా సీరియస్ ఆరోపణ.. విచారణకు సిద్ధంకండి’
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్.. మీరు విచారణకు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన ఆరోపణ చాలా పెద్దది. ఇందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాలి. మీరు విచారణకు అందుబాటులో ఉండాలి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది.తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) రూ. 15 కోట్ల ఆఫర్ ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఆశ చూపిందని కేజ్రీవాల్ ఈరోజు(శుక్రవారం) ఆరోపించారు. దీనిపై తన సోషల్ మీడియా ‘ఎక్స్’లో కేజ్రీవాల్ సుదీర్ఘమైన పోస్టుపెట్టారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ..ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ లేఖ ద్వారా కోరింది.దాంతో వీకే సక్సేనా.. ఢిల్లీ ఏసీబీని విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ముందుగా నోటీసులిచ్చింది ఏసీబీ. ఐదు ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చింది. ‘ మీరు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఏసీబీ.. ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ ముందు ఉంచింది.ఏసీబీ నోటీసులో పేర్కొన్న ఐదు ప్రశ్నలు ఇవే..1. మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ ీమీరు చేసిందేనా?.. లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా?2. మీ 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని చేసిన ట్వీట్‌తో మీరు ఏకీభవిస్తారా?3. ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్ పొందారో.. వారి వివరాలు మాకివ్వండి4, మీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆఫర్ చేశారో వారి వివరాలు ఇవ్వండి. వారి వ్యక్తిగత వివరాలు కానీ, వారి ఫోన్ నంబర్లు కానీ మాకు ఇవ్వండి.5. మీరు ేచేసిన ఆరోపణలపై మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలుంటే మాకు సమర్పించండి.రేపు(శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ కావాలనే బీజేపీపై ఆరోపణ చేశారా.. లేక నిజంగా బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందా అనేది విచారణలో తేలనుంది. -
అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్
-
హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, హనుమకొండ జిల్లా: డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో బీమారంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో అద్దె ఇంటితో పాటు, హైదరాబాద్, జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోను ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. అయితే ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. -
ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి..
ఏలూరు టౌన్: నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్‌ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్‌కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్‌సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్‌సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్‌సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్‌సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు. -
ఏసీబీ వలలో తిరుమలగిరి ఎస్ఐ
సాక్షి, సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. కేసు నుంచి తప్పించాలంటే మూడు లక్షలు డబ్బులు ఇవ్వాలన్న ఎస్సై సురేష్ డిమాండ్ చేయగా, లక్షా ముప్పై వేలకు సెటిల్మెంట్ కుదిరింది.రెండు రోజుల క్రితం రూ.30 వేలు ఇచ్చిన బాధితుడు.. తాజాగా మరో లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, డిసెంబర్ మూడున ఎస్ఐ సురేష్ నాలుగు లక్షలు తీసుకున్నాడు. తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో తానను కూడా కావాలని ఇరికించారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు. -
Formula E Car Race: ఎస్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు
-
కేసు మూసేసినా ధన దాహం తీరలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో షాహినాయత్‌గంజ్ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్ అయినా ధనదాహం తీరని ఇన్స్పెక్టర్ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్‌గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్‌గంజ్ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్ కేసును గత నెల 19న క్లోజ్ చేశారు. ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్స్పెక్టర్ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు. ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్‌పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. -
ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
-
మరోసారి ఏసీబీ పిలుపులు?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు రెండురోజుల్లోనే మరోమారు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం..అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..: చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్..మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఫార్ములా ఈ - కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు
-
ఏసీబీ దూకుడు.. ఫార్మూలా-ఈ కేసులో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మూలా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో ఏఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ(ACB Notices) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు. ఈ-రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకావడంతో.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
ఎవరి ఆదేశాలతో ఎఫ్ఈఓకు డబ్బులిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓ (ఫార్ములా– ఈ ఆపరేషన్స్ లిమిటెడ్)కు హెచ్ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నిధులు బదిలీ చేయాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? రేసు నిర్వహణ నిర్ణయాలను ఎవరెవరిని సంప్రదించి తీసుకునేవారు?’అని హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించానని, వారు ఏది చెబితే అదే చేశానని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏ–3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.ఏసీబీ అధికారులు ముందుగా సూచించిన మేరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకువచ్చారు. ఏసీబీ సీఐయూ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ బృందం బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ–1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ–2 ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈఓ కంపెనీకి హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని హెచ్ఎండీఏ అకౌంట్స్ నుంచి నగదు ఎందుకు పంపారన్న అంశంపైనే ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిధుల బదిలీ కోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఏసీబీ అధికారులకు ఆయన అందించినట్టు సమాచారం. అవసరం మేరకు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది. -
ఏసీబీ విచారణకు హాజరైన BLN రెడ్డి
-
ముగిసిన బీఎల్ఎన్రెడ్డి ఏసీబీ విచారణ
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Race case) కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని (bln reddy) ఇవాళ ఏసీబీ అధికారులు (acb) విచారించారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవో కంపెనీకి బదిలీ చేయడంపై బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ ప్రశ్నించింది. ఆరు గంటలకు పైగా ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. బీఎల్ఎన్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (ias arvind kumar) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఎల్ఎన్రెడ్డిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. ఈడీ విచారణ తర్వాత ఆయన ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ
-
నిధుల మళ్లింపుపైనే ఈడీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ నుంచి నిధు ల మళ్లింపుపైనే ప్రధానంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి విచారణ సందర్భంగా సేకరించిన అంశాల ఆధారంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ అధికారు లు ప్రశ్నించారు.ఈడీ సమన్ల మేరకు గురువారం ఉదయం 11.15 గంటలకు ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హెచ్ఎండీఏకి చెందిన రూ.54.89 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) సంస్థకు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది? హెచ్ఎండీఏ బోర్డు నిధుల ఖర్చు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఫార్ములా–ఈ కారు రేసు సీజన్ 9,10 నిర్వహణ కోసం చేసుకున్న ఒప్పందాలు.. తదితర అంశాలపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. విధి నిర్వహణలో భాగంగానే తాను అంతా చేసినట్టు అర్వింద్‌కుమార్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. అవసరం అయితే మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు అర్వింద్‌కుమార్‌కు సూచించినట్టు సమాచారం. -
రోజంతా ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏసీబీ విచారణకు హాజరు కావడం తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో..విచారణ అనంతరం ఆయన తిరిగి వచ్చేవరకు ఉత్కంఠ కొనసాగింది. ముఖ్య నేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగి తేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే కొద్దిసేపు గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం కేటీఆర్ తిరిగి వచ్చేవరకు అక్కడే ఉన్న ఆయన.. పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు విడతల వారీగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల రాకతో తెలంగాణ భవన్లో హడావుడి నెలకొంది. సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో నాయకులు స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు ఇచ్చారు. తర్వాత నందినగర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్‌కు సతీమణి శైలిమ, సోదరి కవిత తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఇలావుండగా ఏసీబీ కార్యాలయానికి దారితీసే రహదారుల్లో 8 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. సుమారుగా 400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. మరోవైపు రెండురోజులుగా నందినగర్ నివాసంలోనే బస చేసిన కేటీఆర్.. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో తన తరఫున వాదిస్తున్న వారితో ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన తీరుపై చర్చించారు. -
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ ఒక లొట్ట పీసు సీఎం అని, తనదొక లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం) ఏసీబీ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది తర్వాత కూడా రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించలేదని విమర్శించారు. ఏసీబీ(ACB) విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘ఎవరకీ రేవంత్ పేరు కూడా గుర్తు ఉండటం లేదు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టినట్లు రేవంత్ తీరుంది. ఏసీబీ అధికారుల వద్ద ప్రశ్నలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి ఏమైనా ప్రశ్నలు పంపితే ఏసీబీ మళ్ళీ పిలుస్తోందేమో. ఏసీబీ 80 పైగా ప్రశ్నలు అడిగింది. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగింది. ఏసీబీకి కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసు. రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు కాబట్టే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నారు. ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా సమాధానం ఇస్తా. రేపటినుంచి ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తాం. యాధావిధిగా పార్టీ క్యాడర్ ప్రజా సమస్యలపై పోరాడాలి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.ఏడుగంటల పాటు ఏసీబీ విచారణఫార్ములావన్ ఈ -కార్ కేసులో భాగంగా ఈరోజు(గురువారం) కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. సుమారు ఏడు గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. అయితే మరొకసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ఏసీబీ విచారణకు వెళ్లండి: కేటీఆర్‌కు హైకోర్టు సూచన
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) వేసిన లంచ్‌మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్‌తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.కేటీఆర్‌తో పాటు రాంచందర్ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్‌తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్‌కు సూచించింది. స్టేట్మెంట్ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి హైకోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ తన లాయర్‌తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు -
ఏసీబీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్
-
నేడు ఏసీబీ విచారణకు IAS అధికారి అరవింద్ కుమార్
-
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. -
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ గత నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్ 31న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్ 18న ఫిర్యాదు, 19న ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్ 528 మేరకు ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్‌లాల్, నీహారిక ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్ అదీనంలోనే హెచ్ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు. -
ఏసీబీ అధికారుల భేటీపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తెచ్చుకుంది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టుఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనక్కి..
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేసు కేసులో సోమవారం ఏసీబీ కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీ రామారావు... ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నా రు. తన న్యాయవాదులను కూడా వెంటతీసుకుని వచ్చారు. కానీ ఏసీబీ కార్యాలయానికి సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఏసీబీ నోటీసుల ప్రకారం.. న్యాయవాదులకు అనుమతి లేదని, ఒక్కరే విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. న్యాయవాదులు వెంట ఉంటే ఇబ్బంది ఏమిటని, వారిని అనుమతించాలని కేటీఆర్ పట్టుబట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం సమీపంలో తన వాహనంలోనే వేచి ఉన్నారు. చివరికి ఏసీబీ అధికారులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. న్యాయవాదులు ఉంటే ఇబ్బంది ఏమిటి? ⇒ ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏసీబీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. పోలీసులు ఏసీబీ కార్యాలయం సమీపంలో బారికేడ్లు పెట్టి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ఒక్కరే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లాలని పేర్కొన్నారు. దీంతో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైతే తప్పేమిటని.. న్యాయవాదులను తీసుకురావొద్దని ఏసీబీ అధికారులు కాకుండా పోలీసులు ఎందుకు చెబుతున్నారని కేటీఆర్ నిలదీశారు. అయినా పోలీసులు అనుమతించలేదు.కాసేపు ఏసీబీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా న్యాయవాదులను అనుమతించేందుకు ససేమిరా అన్నారు. మరోవైపు కేటీఆర్ కూడా పట్టుబట్టి తన వాహనంలోనే కూర్చుని వేచిచూశారు. పలుమార్లు పోలీసులు, కేటీఆర్ మధ్య చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఇలా 40 నిమిషాల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. చివరికి న్యాయవాదులు లేకుండా విచారణకు హాజరుకాబోనని, లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చి తిరిగి వెళ్లిపోతానని కేటీఆర్ తేల్చి చెప్పారు. దీనితో ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అడిషనల్ ఎస్పీ ఖాన్.. కేటీఆర్ నుంచి లిఖిత పూర్వక సమాధానం తీసుకున్నారు.వారిపై నమ్మకం లేదు.. అందుకే లాయర్లతో వచ్చా..: కేటీఆర్ఏసీబీ కార్యాలయం బయట వేచి ఉన్న సమయంలో కేటీఆర్ తన వాహనంలోనే ఉండి మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నాకు ఉన్న హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తోందా.. లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డిని కూడా విచారణ పేరుతో పిలిచి ఆయన చెప్పని విషయాలను స్టేట్మెంట్లో నమోదు చేశారు. ఆయన నా పేరు చెప్పినట్టుగా అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ను మీడియాకు వదిలారు. ఇప్పుడు నా విషయంలో కూడా అదే విధంగా చేసే అవకాశం ఉంది. పోలీసులపై నాకు విశ్వాసం లేదు. అందుకే న్యాయవాదులతో వచ్చాను. అయినా నా వెంట న్యాయవాదులు కూడా ఏసీబీ కార్యాలయంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏమిటో చెప్పాలి. ఒక పౌరుడిగా నాకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదా? అయితే ఆ విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి..’’అని కేటీఆర్ డిమాండ్ చేశారుసోదాల పేరిట కుట్రకు పాల్పడే ప్రయత్నం ‘‘నేను ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలోనే నా ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడుల్లో ఏవైనా చట్టవ్యతిరేకమైన వస్తువులు, పత్రాలు నా ఇంట్లో వాళ్లే పెట్టి.. అవి సోదాల్లో దొరికాయని చెప్పే కుట్ర కూడా జరుగుతోంది. మా ఇంట్లో ఈ రోజు (సోమ వార) మా మామగారి రెండో సంవత్సరీకం కార్యక్రమం ఉంది. అది జరుగుతుండగా సోదాలు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉంది. గతంలోనూ దీపావళి పండుగ చేసుకుంటే కూడా పోలీసులతో సోదాలు చేయించారు. డ్రగ్స్ పట్టుబడ్డా యని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారు. నేను ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. అయినా నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా ఏసీబీ విచారణకు వచ్చాను..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించే కుట్ర.. రేవంత్‌రెడ్డి రైతు భరోసాలో కోత విధించి రైతులకు చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రకు పాల్పడు తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘నేను సీఎంకు చెప్పేది ఒక్కటే.. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. ఏసీబీ అధికారులు విచారణ పేరిట నన్ను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉంది. గతంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. అలాంటప్పుడు ఇంకా నా దగ్గర ఏం సమాచారం ఉంటుంది?..’’అని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అనుమతిస్తే కార్యాలయం లోపలికి వచ్చి ఇద్దామనుకున్న పత్రాన్ని ఇక్కడే ఇచ్చి వెళతానని.. మళ్లీ ఏసీబీ అధికారులు రమ్మంటే వస్తానని చెప్పారు. లాయర్లు లేకుండానే విచారణకు రావాలని పోలీసులు చెబుతున్నారని.. దర్శకుడు రాజమౌళిని మించిన టాలీవుడ్ కథలు అల్లుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఏసీబీ అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఏముంది? ⇒ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ఖాన్కు కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టులో సవాల్ చేశానని, డిసెంబర్ 31న ఈ అంశంలో తుది వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని గుర్తు చేశారు. హైకోర్టులో ఏసీబీ ప్రతివాదిగా ఉందని, తన పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు కూడా వినిపించిందని వివరించారు. హైకోర్టు ఏ క్షణమైనా తీర్పు ప్రకటించే అవకాశం ఉన్న ఈ సందర్భంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘సమాచారంతోపాటు డాక్యుమెంట్లు అందివ్వాలని ఏసీబీ నోటీసులలో ప్రస్తావించారు. ఏ అంశాలపై సమాచారం కావాలన్న విషయాన్ని నోటీసులలో స్పష్టంగా ప్రస్తావించలేదు. మీకు ఏ డాక్యుమెంట్లు కావాలో తెలియజేయడంతోపాటు తగిన సమయం ఇవ్వండి. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నాకు న్యాయబద్ధంగా ఉన్న హక్కులు కాపాడబడితేనే ఈ విషయంలో నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. హైకోర్టు తుది తీర్పు తర్వాత ముందుకు వెళ్లాలని కోరుతున్నాను’’అని కేటీఆర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధం ‘‘పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? దేశవ్యాప్తంగా అన్ని పారీ్టలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై మేం చర్చకు సిద్ధం. 2022లో గ్రీన్కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా–ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. ఫార్ములా–ఈ రేస్ కారణంగా నష్టపోవడంతో గ్రీన్కో ఒప్పందం నుంచి తప్పుకుంది. కాంగ్రెస్‌కు 340 కంపెనీలు రూ.1,351 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చాయి. తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్లు తమకు అందిన ఎలక్టోరల్ బాండ్లపై ఏమంటారు?’’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం(జనవరి6) సాయంత్రం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల తొమ్మిదో తేదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అంతకు ముందు ఏసీబీ కేటీఆర్ ఇంట్లో తనిఖీలు చేసింది. సోమవారం ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు తనతో పాటు న్యాయవాదులను అనుమతించకపోవడంతో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం బయట నుంచే కేటీఆర్ విచారణకు వెనుదిరిగారు. తాను చెప్పాలనుకున్నది రాతపూర్వకంగా పోలీసులకు సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను లేనప్పుడు తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తోందని, సీఎం రేవంత్ ఆదేశాలతో కావాలని ఏదైనా పెట్టి నా ఇంట్లో దొరికినట్లు చూపించాలనుకుంటున్నారని చెప్పడం గమనార్హం. క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్ అయిందని అయినా ఏసీబీ కావాలని తనను విచారణకు పిలుస్తోందని మండిపడ్డారు. కాగా, ఫార్ములా-ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు హైకోర్టులో ఇప్పటికే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
కేటీఆర్‌కు మళ్లీ ACB నోటీసులు!
-
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. విచారణ వేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
నాతో పాటు లాయర్ వస్తే ఇబ్బందేంటి?
-
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.సోమవారం ఉదయం తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు.. నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్ అన్నారు. -
Watch Live: ACB ముందుకు కేటీఆర్
-
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్!
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కె. తారక రామారావును విచారించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈ నెల 3న ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసు నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ)కు నిబంధనలకు విరుద్ధంగా, కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో రూ. 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ–1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనుంది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ కేసులో ఏ–1గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరగా అంగీకరించిన ఈడీ వారిద్దరికీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డిని, 9న అరి్వంద్కుమార్ను హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన కేటీఆర్ సైతం వారి బాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. -
మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
-
6న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్‌లో కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను 11న, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈడీ కన్నా ముందే.. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లించారంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. ఈ అంశంలో వేగంగా స్పందించిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయగా.. అంతకంటే ఒకరోజు ముందే కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటతో.. ఫార్ములా–ఈ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ 409, 120–బీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశా రు. ఇవన్నీ నాన్‌బెయిలబుల్ సెక్షన్లు. అయితే కేటీఆర్ తనపై నమోదైన కేసు కక్షపూరితమని, ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని, కేసు దర్యాప్తు చేసుకోవచ్చని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు సమన్లు జారీ చేశారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్‌లను కూడా ఈడీ కంటే ముందే ఏసీబీ విచారించనుండటం ఆసక్తికరంగా మారింది. పలు వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.54.88 కోట్లు బదిలీ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషŒన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్న్డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. ఇప్పటికే దానకిశోర్ స్టేట్మెంట్ నమోదు చేయడంతోపాటు పలు కీలక వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా ఆయా అంశాలపై కేటీఆర్‌ను, అధికారులను విచారించేందుకు సిద్ధమయ్యారు. న్యాయవాదులతో సమావేశమైన కేటీఆర్ ఏసీబీ సమన్ల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం తన న్యాయవాదులతో సమావేశమైనట్టు తెలిసింది. వారి సూచనలు, సలహాల మేరకు ఏసీబీ సమన్లపై ఏ విధంగా స్పందించాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శని లేదా ఆది వారం ఈ అంశంపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవైపు తాము ఫార్మర్స్ (రైతుల) కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం ఫార్ములా–ఈ అంటూ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఆర్టీల సమ్మె విరమణ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లు సమ్మె విరమించారు. ఇరవై రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపారు. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. సమ్మె చేస్తున్న సీఆర్టీలతో చర్చలు జరిపారు. సీఆర్టీల డిమాండ్లలో ఉద్యోగాల క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ కేటగిరీలు మినహా మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వివరించారు. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతన చెల్లింపులు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి మరోసారి సీఆర్టీలతో సమావేశమవుతామని ఆమె హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని సీఆర్టీలను కోరారు. సీఆర్టీల సర్వీసును రెన్యువల్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్టీలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : రాజకీయంగా చర్చనీయాంశమైన ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ-కార్ రేసులో అధికారులకు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11,12 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులోఇదే కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది.వీరిలో బీఎల్ఎన్ రెడ్డిని ఈ నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు.👉చదవండి : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులుఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది.ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది.నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. -
తుది తీర్పు వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తుది తీర్పు ప్రకటించేవరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా–ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఏసీబీ డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఏ–3గా హెచ్ఎండీఏ నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, దానకిశోర్ తరఫున సీవీ మోహన్‌రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఆదేశించారు. అవినీతి లేనప్పుడు సెక్షన్లు ఎలా పెడతారు? అవినీతే లేనప్పుడు కేసు ఎలా నమోదుచేస్తారని కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్దార్థ దవే వాదించారు. ‘ఫార్ములా –ఈ రేసు నిర్వహణ ఒప్పందంలో ముందుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అనంతరం కేటీఆర్ నోట్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చడం సరికాదు. ఈ చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు గానీ, వ్యక్తిగతంగా కేటీఆర్ లబ్ధి పొందినట్లుగానీ ఏసీబీ పేర్కొనలేదు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)(్చ), 13(2) కింద కేసు పెట్టడం చెల్లదు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదు. నగదు చెల్లింపు బ్యాంక్ ద్వారానే జరిగింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారని చెబుతున్నా.. చట్టప్రకారం ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదు. ఎన్నికల కోడ్ సమయంలో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, ముందే ఉన్న ఒప్పందాన్ని అమలు చేయవచ్చు. డిసెంబర్ 18 ఫిర్యాదు చేస్తే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులకూ సెక్షన్ 405 వర్తిస్తుంది.. సిద్దార్థ దవే వాదనను ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘2023, అక్టోబర్ 30న సీజన్ 10కు సంబంధించి రెండో ఒప్పందం జరిగింది. కానీ, అక్టోబర్ 3న రూ.22,69,63,125 (పన్నులు అదనం), 11న రూ.23,01,97,500 (పన్నులు అదనం) చెల్లించారు. అంటే ఒప్పందానికి ముందే మొత్తం రూ.54,88,87,043 చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ (ఎఫ్ఈవో), మున్సిపల్ శాఖ మధ్య 2023, అక్టోబర్‌లో ఒప్పందం కుదిరింది. విదేశీ మారక ద్రవ్యం (పౌండ్) రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ నిబంధనలు, బిజినెస్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలి. కానీ పాటించలేదు. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి ఎలాంటి చెల్లింపులు జరిపినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ నోట్ ఫైల్‌కు ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఫార్ములా –ఈ రేసు ఒప్పందం చేసుకున్నారు. ఎఫ్ఈవోకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత రేసు ప్రమోటర్ ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ, ప్రమోటర్‌ను రక్షించడం కోసమే చెల్లింపులు జరిపినట్లుగా ఉంది. నిబంధనలు విరుద్ధంగా చెల్లింపులు జరిగినందునే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 405, 409 ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తాయి. చంద్రబాబునాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని ధర్మాసనాన్ని కోరారు. సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఈ లావాదేవీల్లో అవినీతి జరిగిందా? డబ్బులు ఎలా వెళ్లాయి? మళ్లీ వచ్చాయా.. లేదా? అనేది విచారణలో తేలుతుంది. నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు దర్యాప్తు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నగదు చెల్లింపులో ఉల్లంఘన జరిగితే సెక్షన్ 405 వర్తిస్తుంది. మంత్రి ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయి’ అని వాదించారు. ఏజీకి న్యాయమూర్తి సూటి ప్రశ్నలు.. నిందితుడిపై ఉన్న ఆరోపణలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ‘ఫార్ములా– ఈ’ ప్రమోటర్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా? లేదు. దర్యాప్తులో భాగంగా నిందితులను చేర్చడం, తొలగించడం జరుగుతుంది. దర్యాప్తు ఏ దశలో ఉంది? ఎంత మంది స్టేట్మెంట్ రికార్డు చేశారు? దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వీలైనంత త్వరగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఫిర్యాదుదారు దానకిశోర్ స్టేట్మెంట్ రికార్డు చేశాం. నిందితుల స్టేట్మెంట్ రికార్టు చేయాల్సి ఉంది. ఇతర నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్లు వేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రమోటర్ గ్యారంటీ సమర్పించారా? దాన్ని క్యాష్ చేసుకున్నారా? దర్యాప్తులో ఆ వివరాలు సేకరించాల్సి ఉంది. -
‘ఫార్ములా–ఈ’ రేసు కేసు: 7న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితు లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిలో బీఎల్ఎన్ రెడ్డిని వచ్చే నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురినీ ఆయా తేదీల్లో శుక్రవారం వేర్వేరుగా సమన్లు జారీ చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు. కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్ఈవో ఇన్వాయిస్లు పంపింది. దీనిపై అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు. అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది. ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. -
కేటీఆర్‌కు ఊరట వద్దు: ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల(formula-e race) కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) హైకోర్టులో శుక్రవారం(డిసెంబర్27) కౌంటర్ ధాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు ఇచ్చిన ఊరట (నాట్ టు అరెస్ట్) ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ తన కౌంటర్లో కోర్టును కోరింది.ఏసీబీ(Acb) వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం(డిసెంబర్31)కి కోర్టు వాయిదా వేసింది.కాగా ఫార్ములా-ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగాకే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేటీఆర్‌ను ఈ కేసులో 31 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. 31న జరిగే విచారణలో ఏం జరగనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా -
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
-
విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
-
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ(ACB) అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏడు గంటలపాటు ఏసీబీ ప్రశ్నించి..స్టేట్మెంట్ నమోదు చేసింది. ఇక.. స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టనుంది. త్వరలో కేటీఆర్(KTR), అరవింద్ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్నన్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే.. హెచ్ఎండీఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన. ఏ1గా కేటీఆర్ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(ACB)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి లేఖ రాశారు.ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు.ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ‘‘అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా’’ అని ఒప్పందంపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.నెక్స్ట్ ఏంటంటే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా...? అనే అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే... అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం ఖాయం.ఇదీ చదవండి: విభజన సమస్యల పరిష్కారం మరింత జఠిలం! -
కేటీఆర్ కు ACB నోటీసులు!
-
ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు త్వరలో ఏసీబీ నోటీసులు..!
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్,ఐఏఎస్ అరవింద్ కుమార్,హెచ్ఎండీఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసులో మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలు, రూ.55కోట్ల లావాదేవీలు,స్పాన్సర్స్ షిప్ కంపెనీ వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఈడీ కేసులో కూడా కేటీఆర్‌తో సహా ఇతర నిందితులకు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల్లో నిధుల గోల్మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ ఏ1గా చేర్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేటీఆర్‌ను డిసెంబర్ 30 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. విచారణ కొనసాగించవద్దని ఏసీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ఫార్ములా–ఈ ఫైర్!
రాష్ట్రంలో ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసు అంశం మంటలు రేపుతోంది. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని కూడా అట్టుడికించింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, అధికార కాంగ్రెస్ సభ్యుల విమర్శలతో సభ స్తంభించిపోయింది. ఫార్ములా–ఈ అంశంపై చర్చకు సిద్ధమని, సభలోనైనా సరే లేదా బీఆర్ఎస్ కార్యాలయానికి రమ్మన్నా సరే వస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరగా.. కార్ల రేసు అంశంలో అణా పైసా అవినీతి జరగలేదని, కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దీనితో దూకుడు పెంచాలని నిర్ణయించిన ఏసీబీ.. అధికారులు, నిందితుల నుంచి వాంగ్మూలాలు తీసుకునేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ అంశంలో రంగంలోకి దిగిన ఈడీ ... ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు’ నమోదు చేసింది. ‘ఫార్ములా–ఈ’పై ఈడీ కేసు నమోదుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గురువారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ‘ఫారిన్ ఎక్ఛ్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’కింద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ..‘ఫార్ములా–ఈ’వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో... ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాల సేకరణ, నిందితులు, కేసుతో సంబంధం ఉన్న వారి వాంగ్మూలాల నమోదుపై దృష్టిపెట్టారు. తొలుత ఈ అంశంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ నుంచి మరోమారు వివరాలు సేకరించనున్నారు. ఈ–కార్ రేసు నిర్వహణకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు, నిధుల చెల్లింపులు, ఇతర లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ రేసు నిర్వహణ కంపెనీ ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు నిధుల చెల్లింపునకు సంబంధించి.. అధికారుల మధ్య సంప్రదింపుల ఫైళ్లను పరిశీలించనున్నారు. కీలక డాక్యుమెంట్ల సేకరణతోపాటు ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషించేలా దర్యాప్తు బృందం సభ్యులకు విధులు అప్పగించారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రధాన నిందితుడు కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షంలోని కీలక వ్యక్తి కావడంతో ఏసీబీ ఉన్నతాధికారులు నేరుగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కీలక ఆధారాల సేకరణ తర్వాత నిందితులకు నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 30 వరకు అరెస్టు వద్దుసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. లంచ్‌మోషన్ పిటిషన్ మేరకు.. ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ చేపట్టాల్సిన రోస్టర్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండటంతో.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద విచారణ చేపట్టాలని న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. దీనిపై సీజే బెంచ్ అనుమతితో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు.. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘2023 అక్టోబర్‌లో జరిగిన ఘటనపై 14 నెలలు ఆలస్యంగా ఈ నెల 18న సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)( ్చ), 13(2) కింద కేసు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులపై ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని లలితాకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఏసీబీ ఉల్లంఘించింది. ప్రొసీజర్ పాటించలేదు. ఎఫ్ఐఆర్ నమోదుకు 14 నెలలు ఎందుకు ఆగారో కారణాలు లేవు. నిందితులు వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే పీసీ యాక్ట్ సెక్షన్లు పెట్టారు..’’అని న్యాయమూర్తికి వివరించారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా–ఈ రేస్ నిర్వహణపై తొలి ఒప్పందం జరిగిందని.. 2023 అక్టోబర్‌లో నిధుల చెల్లింపు ఒప్పందం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని వివరించారు. నగదు చెల్లింపులో ప్రొసీజర్ పాటించలేదని ఏసీబీ పేర్కొనడం సరికాదని.. సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం 2022లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. సీజన్ 9 నిర్వహణతో దాదాపు రూ.700 కోట్లు లాభం వచ్చిందని.. గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను నిలపడంలో ఫార్ములా–ఈ కీలక పాత్ర పోషించిందని, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని వివరించారు. సీజన్ 10 నిర్వహణ నుంచి స్పాన్సర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుందని, అందులో భాగంగానే చెల్లింపులు జరిపిందని తెలిపారు. కానీ కొత్త ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి రేసింగ్‌ను రద్దు చేసిందని.. రద్దుపై ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రేసింగ్ జరిగి ఉంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఏసీబీ పేర్కొందని, కానీ ఆ సంస్థపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాంప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదు. ఇది విచారణ ప్రారంభం మాత్రమే. అంతా ఎఫ్ఐఆర్లో ఉండదు. కొత్తగా నిందితులను చేర్చే అవకాశం ఉంటుంది. చార్జిషీట్లో మాత్రమే అన్ని వివరాలుంటాయి. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాం. పిటిషనర్ ఎమ్మెల్యే కావడంతో గవర్నర్ నుంచి అనుమతి కూడా పొందాం. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగింది. కానీ అక్టోబర్ 3న (రూ.22,69,63,125 ప్లస్ పన్నులు అదనం), 11న (రూ.23,01,97,500 ప్లస్ పన్నులు అదనం).. అంటే ముందుగానే మొత్తం రూ.56 కోట్లు చెల్లింపులు చేశారు. రూ.700 కోట్లు లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్ ఎందుకు వెళ్లిపోతారు?’’అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ సంస్థకు డబ్బును విదేశీ కరెన్సీలో చెల్లించారని, దానితో హెచ్ఎండీఏపై అధిక భారం పడిందని తెలిపారు. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తీసుకోలేదని.. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదని వివరించారు. క్వాష్ పిటిషన్‌పై ఇంత అత్యవసరంగా విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కల్పించుకుని.. ‘‘పిటిషనర్ ఏం లబ్ధిపొందారు? ఎందుకు ఆ సెక్షన్లు పెట్టారు?’అని ప్రశ్నించారు. అదంతా దర్యాప్తులో తేలుతుందని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం వాదిస్తూ.. ఫిర్యాదుకు ముందు విచారణ చేయడం కాదని, ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్కు ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని న్యాయమూర్తికి వివరించారు. ఫిర్యాదుకు ముందే విచారణ చేశామని, గవర్నర్ అనుమతి తీసుకున్నామని ఏజీ చెప్పడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్ఐఆర్ నమోదులో లోటుపాట్లు ఉన్నాయని, ప్రాథమిక విచారణ కూడా చేయలేదని పేర్కొన్నారు. సీఆరీ్పసీ సెక్షన్ 482 మేరకు హైకోర్టుకు ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు విశిష్ట అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున రోస్టర్ న్యాయమూర్తి విచారణ చేపడతారని తెలిపారు. -
ఈ-కార్ రేస్ స్కాంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్
-
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు
-
ఫార్ములా– ఈ కార్ రేసులో 'ఏ1 కేటీఆర్'
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏ–1 (మొదటి నిందితుడు)గా, పురపాలక శాఖ (ఎంఏయూడీ) మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండానే.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి పలు దఫాల్లో రూ.54,88,87,043 బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120–బీ కింద గురువారం కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతివ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ నిధుల నుంచే రూ.54,88,87,043 చెల్లింపులు హైదరాబాద్‌లో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న యూకేకు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈఓ), తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ (స్పాన్సర్)కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన ఫార్ములా–ఈ రేస్ మొదటి సీజన్ (9) కోసం హెచ్ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్ఈఓకు స్పాన్సర్‌కు మధ్య వచ్చిన విభేదాలతో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 10 నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు స్పాన్సర్ స్థానంలో తామే అన్ని ఖర్చులు భరించేలా హెచ్ఎండీఏ అధికారులు, ఎఫ్ఈఓ మధ్య చర్చలు జరిగాయి. సీజన్ 10 కార్ రేసు నిర్వహణకు సంబంధించిన ఫీజుల నిమిత్తం, ఇతర సదుపాయాల ఏర్పాటుకు అయ్యే మొత్తం రూ.160 కోట్లు ఖర్చు పెట్టేందుకు పురపాలక అధికారులు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో మొదటి దఫా కింద 2023 అక్టోబర్ 3న రూ.22,69,63,125 చెల్లించేందుకు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ మంజూరు ఇచ్చారు. రెండో దఫా కింద 2023 అక్టోబర్ 11న మరో రూ.23,01,97,500 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హిమాయత్‌నగర్ బ్రాంచ్ నుంచి యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంలో నిబంధనలు పాటించకపోవడంతో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు మరో రూ.8,06,75,404 పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం మరో రూ.1,10,51,014 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తం రూ.54,88,87,043 హెచ్ఎండీఏ చెల్లించింది. ఇవన్నీ సాధారణ నిధుల నుంచే సంస్థ చెల్లించిందని ఏసీబీ పేర్కొంది. అనుమతుల్లేకుండానే చెల్లింపులు ⇒ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు మించి ఖర్చు అయ్యే పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి తీసుకోలేదు. ⇒ హెచ్ఎండీఏ చెల్లించిన రూ.54,88,87,043కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఆర్థికశాఖ దృష్టికే తీసుకెళ్లలేదు. ⇒ హెచ్ఎండీఏ అగ్రిమెంట్లో పార్టీ కాకపోయినా నగదు చెల్లింపులు చేసింది. ⇒ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఈఓకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి. ⇒ ఫారిన్ ఎక్సేంజ్ రెమిటెన్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారకద్రవ్యం రూపంలో చెల్లింపులు జరిగాయి. ⇒ ప్రభుత్వం తరఫున ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవాలంటే ఆర్థిక, న్యాయశాఖల సమ్మతితో పాటు కేబినెట్ అనుమతి తీసుకోవాలి. తీసుకోలేదు. ⇒ ఈ ఒప్పందాలన్నీ మోసపూరితమైనవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ⇒ అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి నేర పూరిత కుట్రకు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఏమిటీ సెక్షన్లు.. శిక్ష ఏమిటి? ⇒ నిజాయితీ లేకుండా, మోసపూరితంగా సొంత ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆస్తిపై ఇతరులకు హక్కు కట్టబెట్టడం అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్ 13(1) (ఏ), సెక్షన్ 13(2) కిందకు వస్తాయి. నేరపూరిత దు్రష్పవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా అత్యధికంగా ఏడేళ్ల వరకు ఈ సెక్షన్ల కింద జైలు శిక్ష వేయవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. ⇒ ఐపీసీ సెక్షన్ 409, 120–బీ నేరపూరిత కుట్రకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగి, బ్యాంకర్, వ్యాపారి నేరపూరితంగా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడటం పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి అతని అదీనంలోని ఆస్తి విషయంలో నేర ఉల్లంఘటనకు పాల్పడటం, నిధులను పక్కదారి పట్టించడం వంటివి దీని కిందకు వస్తాయి. నేరం రుజువైతే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. హైకోర్టులో నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్! తనపై నమోదైన కేసు కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో పోర్ట్‌ఫోలియో ప్రకారం జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఇది విచారణకు వస్తుంది.అయితే శుక్రవారం ఆయన సెలవులో ఉండటంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. -
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ FIR నమోదు
-
ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్.. ఏసీబీ కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల గోల్మాల్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్ 19) ఈ-కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్ఎస్ చట్టంలోని పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఫార్ములా ఈ-కార్ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్ కరెన్సీ చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ల కేసులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఎఫ్ఐఆర్ నమోదైనందున క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం న్యాయ నిపుణులతో ఇప్పటికే కేటీఆర్ చర్చలు ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారుప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి -
ఈ -కార్ రేస్ కేసు: ఏసీబీకీ టీజీ సీఎస్ లేఖ
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఈ కార్ రేస్ కేసు అంశం ఇప్పుడు ఏసీబీ వద్దకు చేరింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి..ఏసీబీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో విచారణ కోరుతూ సీఎస్ లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను సీఎస్ జత చేశారు.గవర్నర్ అనుమతితో ముందుకు.. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది.చదవండి: కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం! -
కేటీఆర్‌పై ‘ఫార్ములా’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై ‘ఫార్ములా–ఈ’ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖరాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేస్తారా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ‘ఫార్ములా–ఈ’ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. గవర్నర్ అనుమతితో ముందుకు.. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంపై సూటిగా స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. విదేశీ సంస్థలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు? ‘విదేశీ కంపెనీలైన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించే విషయంలో నిర్ణయాధికారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఉందా? రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించవచ్చా? ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ ఒప్పందం ఎలా చేసుకుంటారు?’ అనే అంశాలపై ఏసీబీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. భారీగా డబ్బులు చేతులు మారాయని.. ఫార్ములా–ఈ కార్ల రేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా డబ్బులు చేతులు మారాయని మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ క్రీడల నిర్వహణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇటీవల కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో... ఈ విషయాలను ఆయన ఏసీబీకి చెప్పుకోవాలని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని, కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందా?, బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే! ‘ఫార్ములా–ఈ’ కారు రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఇతర అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. అరవింద్‌కుమార్ విచారణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) అనుమతి అవసరం లేదని.. సీఎస్ అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. అధికారిపై నేరారోపణలు నమోదు చేసే సమయంలోనే డీఓపీటీ అనుమతి అవసరమని వెల్లడించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై సైతం ఏసీబీ విచారణ చేపడుతుందని, వాటికి కూడా నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఆ రెండు కంపెనీలకు నిధులు చెల్లించినట్టు అరవింద్‌కుమార్ ఇప్పటికే తెలిపారని గుర్తు చేశారు. కీలక నిర్ణయాలు.. అసెంబ్లీలోనే ప్రకటన సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై అసెంబ్లీలోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవకతవకలపై వేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదించినట్టు సమాచారం. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం కొత్తగా తెచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్) బిల్లుతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల బిల్లులు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా కింద భూమి లేని రైతుకూలీలకు డిసెంబర్ 28 నుంచి రూ.12 వేల ఆర్థిక సాయం చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వీటిపై అసెంబ్లీ ప్రకటన చేయనుంది. -
కోట్లు పలుకుతున్న కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టు
కావలి సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అధికారానికి, అహంకారానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. లంచం లేనిదే సంతకం పెట్టని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలకు తావులేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావలిలోనే కాక, ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ శాఖలో అవినీతికి తావులేదని చెప్పిన ఆ ప్రజాప్రతినిధే.. మూడు నెలలు తిరగక ముందే ప్లేటు ఫిరాయించి ఆ పోస్టుకు బహిరంగ వేలం పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ vs ప్రజాప్రతినిధిగా మారింది. సెలవు పెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే ఎలా పనిచేస్తావో చూస్తానన్న సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి.. ఆ సబ్ రిజిస్ట్రార్ తన పలుకుబడితో అదే సీటులో కూర్చొని పనిచేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి సబ్ రిజిస్ట్రార్ సీటు.. భలే హాటుగా మారింది. ఈ పోస్టు వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. అధికారం, రాజకీయం ఆధిపత్యం కొనసాగుతోంది.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ద్వారా అదనపు వసూళ్లు లేకుండా కాగితం కదలని పరిస్థితి. అలాంటి సబ్ రిజిస్ట్రార్కార్యాలయం ఎదుట లంచాలకు తావులేదని, ప్రభుత్వ రుసుములు చెల్లిస్తే చాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద సంచలనంగా మారింది. నిత్యం క్రయవిక్రయాల్లో రూ.లక్షల్లో చేతులు మారే కార్యాలయంలో ఉన్న పళంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారం వెనుక అధికారి నిజాయితీ ఉందనుకుంటే పొరపాటే. రూ.కోట్లు పలికే ఆ పోస్టులో సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి కూర్చొన్న సదరు మహిళా అధికారి భవిష్యత్ ప్రమాదానికి భయపడి ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా చర్చ సాగుతోంది. నెలకు రూ.50 లక్షల ఆదాయం జిల్లాలో నెలవారీ ముడుపుల ఆదాయంలో నెల్లూరు తర్వాత కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. కావలి చుట్టూ రామాయపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కావలిలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఈ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భూ వివాదాలు ఉన్న ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కీలకంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే రూ.లక్షల్లో ముడుపులు అందుతాయి. నెలవారీగా సబ్ రిజిస్ట్రార్ ఆదాయం రూ.50 లక్షలకుపై మాటే ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ దఫా సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని ఓ మహిళా అధికారి ఈ పోస్టును పట్టేసింది. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండానే ఆ పోస్టులో కూర్చొంది. రెండు నెలల పాటు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో కాసులు గలగలాడాయి. దీంతో ఆ పోస్టుపై కన్నేసిన ప్రజాప్రతినిధి సదరు అ«ధికారిణి దందా వ్యవహారంపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ఆమె కొద్ది రోజులు సెలవుపై వెళ్లడం చకచకా జరిగిపోయాయి. పోస్టుకు బహిరంగ వేలం.. కావలి సబ్‌రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి ఈ పోస్టుకు వేలం పెట్టినట్లు తెలుస్తోంది. నెలవారీగా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆ పోస్టుకు గతంలో పని చేసిన ఓ అధికారి, నెల్లూరులో పనిచేసి వెళ్లిన మరో అధికారి పోటీ పడుతున్నారు. రెగ్యులర్ పోస్టు అయితే.. రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. రూ.కోటి వరకు బేరం కుదిరింది. లోకల్ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో భారీ ఆఫర్లతో పోస్టు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తన పోస్టుకు ఎసరు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికారిణి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు రెకమెండ్ చేయించుకుని వెను వెంటనే విధుల్లో జాయిన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని సందర్శించిన సదరు ప్రజాప్రతినిధి ఇక్కడ అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. మూడు నెలలు తిరగక ముందే ఆ పోస్టుకు వేలం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీటు వదలాల్సిందే.. కదిలే ప్రసక్తే లేదు.. కావలి సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో జాయిన్ అయిన అధికారిణి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు ఇతరులను రాజీ రాయబేరానికి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రజాప్రతినిధి ఆమె ఆ సీటులో ఎన్ని రోజులు కూర్చుంటుందో నేను చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆ సీటు వదలాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి హుంకరిస్తుంటే.. కదిలే ప్రసక్తే లేదంటూ సబ్ రిజిస్ట్రార్ మొండికేస్తున్నారు. అధికారి, ప్రజాప్రతినిధి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా ఉచ్చు బిగిసే అవకాశం ఉండడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజాప్రతినిధికే సవాల్ విసురుతూ ఎదురొడ్డుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించిన సదరు అధికారిణి కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, చలనాలు మాత్రమే చెల్లించాలని, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని బోర్డు పెట్టించడమే కాకుండా క్రయ, విక్రయ దారులను ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ కార్యాలయ ఉద్యోగులకు నచ్చడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కావలి కార్యాలయానికి బదిలీపై వస్తే లంచాలు రాకుండా ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తమకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారిణిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిణి కావలికి వచ్చేసరికి ఇలా బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారింది. -
నిఖేశ్ లీలలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: అనతి కాలంలో అంతులేని అవినీతితో వందల కోట్లకు పగడలెత్తిన నీటి పారుదల ఏఈఈ నిఖేశ్‌కుమార్ లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. తనవద్దకు పనికోసం వచ్చిన ప్రజలతోపాటు చిన్ననాటి స్నేహితులు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఆయన మోసగించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తన మిత్రులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారిని నిఖేశ్ బినామీ లుగా మార్చు కున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్‌కుమార్‌ను.. ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు శనివారం కూడా ప్రశ్నించారు. చిన్న పని ఉందంటూ.. అవినీతిలో నిఖేశ్‌కుమార్ స్టైలే వేరుగా ఉన్నది. తన పదేళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన 2020 – 2024 మధ్యే ఎక్కువ ఆస్తులు పోగేశాడు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బాగా పీక్‌లో ఉన్నప్పుడు ఆయన గండిపేట్‌లో పనిచేశాడు. అక్కడ రియల్ ఎస్టేట్ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వటంలో కీలకంగా మారాడు. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ కాబట్టి ఏ స్థలం ఎఫ్టీఎల్లోకి వస్తుంది..ఏది రాదు అన్నది ఆయనే మార్క్ చేయాల్సి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కోట్లలో డబ్బులు గుంజాడు. ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు లక్షల్లో లంచంగా తీసుకున్నాడు. నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకొనేవాడు. ఆ డబ్బును స్థిరాస్తులుగా మార్చుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులను వాడడం ప్రారంభించాడు. ఏదో ఒక సాకుతో, లేదంటే చిన్న పని ఉందని చెప్పి తన ఇంటర్మీడియెట్ స్నేహితుల నుంచి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు తీసుకున్నాడు. తన సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల ఆధార్, పాన్ కార్డులను కూడా తీసుకుని ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.లా బినామీలను పిలిచి విచారించగా.. ‘అసలు మేం ఎప్పుడు ఈ ఆస్తులు కొన్నాం? మాకు ఏమీ తెలియదు? ఏదో పని ఉందని మా దగ్గరి నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తీసుకున్నాడు’ అని వారు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా చదువులు కూడా పూర్తికాని తన కుటుంబ సభ్యుల పేర్లమీద కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు.. వాటి గురించి నిఖేశ్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఆయన ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిఖేశ్‌కుమార్ ఆస్తులు కొనుగోలు చేసిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను పిలిచి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైలాన్, బ్లిస్, కపిల్ ఇన్ఫ్రా కంపెనీల్లో నిఖేశ్‌కుమార్ మొత్తం నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పలు బ్యాంకు లాకర్లలో నిఖేశ్ దాచి ఉంచిన బంగారం ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తుల పత్రాలపైనా వివరాలు సేకరించారు. కాగా నిఖేశ్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనున్నది. -
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుంచి ఆమోదం లభించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు.2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు.ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది.ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు.ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు.అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీరుతోపాటు గత ప్రభుత్వంలో పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం... ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చినట్లు సమాచారం. -
ACB కస్టడీలో ఇరిగేషన్ AEE నిఖేష్
-
ఏఈఈ అక్రమాస్తులు రూ. 200 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: బఫర్ జోన్లలో నిర్మాణాలకు అక్రమంగా అనుమతులిచ్చి అందుకు ప్రతిగా లంచాలుగా ఆస్తులు పొందడంతోపాటు ఇటీవల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కి సస్పెండైన ఓ అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెరూర్ నిఖేశ్ కుమార్‌ను ఏసీబీ శనివారం రాత్రి అరెస్ట్ చేసింది. అంతకుముందు శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏసీబీ మెరుపుదాడులు చేసింది.హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని పెబెల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటితోపాటు 19 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాద్‌లో 3 ఫాంహౌస్‌లు, విలాసవంతమైన 3 విల్లాలు, 5 నివాస స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఫ్లాట్లు, రెండు కమర్షియల్ స్థలాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ గుర్తించింది. వాటి విలువ రూ. 17,73,53,500గా వెల్లడించింది. అయితే బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ రూ. 200 కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఏసీబీ సోదాల సమయంలో పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు, విలువైన ఆభరణాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని తెలిసింది. మరోవైపు పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు, నిఖేశ్‌కుమార్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజ పుష్ప అనే రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయనకు 56 ఆస్తులు ఉన్నట్లు పత్రాలు లభించాయి. అలాగే మరో సంస్థలో ఆయనకు చెందిన 26 ఆస్తుల పత్రాలు కూడా బయటపడ్డాయి. రూ. లక్ష తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి.. రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కార్యాలయంలో ఏడబ్ల్యూ సెక్షన్లో ఏఈఈగా పనిచేస్తున్న సమయంలో నిఖేశ్‌కుమార్ మరికొందరు అధికారులతో కలిసి మణికొండ, నేక్నామ్పూర్లో ఒక భవన నిర్మాణానికి అనుమతలిచ్చేందుకు రూ. 2.5 లక్షల లంచాన్ని తీసుకొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ముందుగా రూ. లక్షన్నర తీసుకున్నారు. ఈ ఏడాది మే 30న లంచం మొత్తంలోని మిగిలిన రూ. లక్ష తీసుకుంటుండగా ఈఈ కె.భన్సీలాల్, నిఖేశ్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.దీంతో నిఖేశ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో లంచాల సొమ్ముతో నిఖేశ్‌కుమార్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి తాజాగా సోదాలు చేపట్టారు. బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణ అనుమతులు.. చెరువులు, కుంటల దగ్గర భూముల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేసే విభాగంలో నిఖేశ్ కుమార్ విధులు నిర్వర్తించిన సమయంలో గండిపేట బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. -
అవినీతి చేపలు ఎక్కడున్నా వలపన్ని పట్టేదాం సార్!!
అవినీతి చేపలు ఎక్కడున్నా వలపన్ని పట్టేదాం సార్!! -
ఏసీబీ వలలో ఉప ఖజానా అధికారిణి
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా అధికారిణి సీహెచ్ మమత మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లోకసాని వెంగయ్యకు సుమారు రూ.9 లక్షల వరకు పాత బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయాలని వెంగయ్య ఉప ఖజానా అధికారిణి సీహెచ్ మమతను వారం రోజుల క్రితం కలిశారు. అందుకు పది శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు అంత డబ్బు ఇవ్వలేక వెనుదిరిగాడు. తర్వాత అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీహరిని సంప్రదించి రూ.40 వేలు లంచం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం ఎస్టీఓకు లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లి ఆమెను కలిసి రూ.40 వేలు తీసుకొచ్చానని చెప్పడంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు ఇవ్వాలని సూచించింది. దీంతో బాధితుడు కార్యాలయం కింద ఉన్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారుల బృందం పవన్‌ను అదుపులోకి తీసుకొని పైనున్న ఎస్టీఓ వద్దకు తీసుకెళ్లారు. ఎస్టీఓ సూచన మేరకే ఈ నగదు తీసుకున్నట్లు పవన్ ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగదుకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్టీఓను, పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌తోపాటు మరో పది మంది సిబ్బంది ఉన్నారు. మమత మూడేళ్ల క్రితం ఉదయగిరి ఉప ఖజానా అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సక్రమంగా విధులకు రావడం లేదని, ప్రతి చిన్న బిల్లుకు కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐసీడీఎస్‌కు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా లంచాలు డిమాండ్ చేసి సకాలంలో బిల్లులు పాస్ చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.లంచం ఇవ్వడం ఇష్టం లేక పట్టించానునాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.8,92,710 పాత బిల్లులు పాస్ చేయాలని ఎస్టీఓను కోరాను. ఆమె పది శాతం లంచం అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఇదే కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నాను. అయినా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించి లంచం నగదు ఇచ్చాను. -
హ్యాపీ బర్త్‌డే రేవంత్ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు. వారికి నా స్వాగతం. మీ బర్త్‌డే కేక్ వారితో కట్ చేయిస్తా. చాయ్, బిస్కెట్లు కూడా ఇస్తా’ అని పేర్కొన్నారు. Happy Birthday @revanth_anumula I am very much in Hyderabad. Your agencies are welcome anytime Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC— KTR (@KTRBRS) November 8, 2024 కాగా, అరెస్ట్ భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ పలు మీడియా కథనాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసు. జర్నలిజాన్ని జోక్‌గా మార్చొద్దు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు. ఆ ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పై విధంగా స్పందించారు. -
మళ్లీ తెరపైకి ఈ-కార్ రేస్ వ్యవహారం.. ఏసీబీకి ఫిర్యాదు
హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.చదవండి: ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్ -
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
ఏసీబీ వలలో మేడ్చల్ ఏఎస్ఐ
మేడ్చల్‌రూరల్: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన ఏఎస్ఐని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఏస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన శర్మ మేడ్చల్ మండలం, గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణమ్లో విల్లా కొనుగోలు చేశాడు. అందులో ఇంటీరియర్ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు చెల్లించాడు. సగం పనులు పూర్తి చేసిన విశ్వనాథ్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరగా, అందుకు శర్మ నిరాకరించడంతో విశ్వనాథ్ పనులు నిలిపివేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విశ్వనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్సింగిలో అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ పీఎస్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చేందుకు విశ్వనాథ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదట రూ.10 వేలు తీసుకున్నాడు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 5న రూ.50 వేలు తీసుకురావాలని ఏఎస్ఐ ఫోన్ చేయడంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు సోమవారం స్టేషన్‌కు వచ్చి డబ్బులు ఇస్తానని ఏఎస్ఐకి చెప్పాడు. పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం విశ్వనాథ్ ఏఎస్ఐ మధుసూదన్‌రావుకు స్టేషన్ ఆవరణ వెనుక నగదు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఏఎస్ఐని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ
-
ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. విషయం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్కెచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించాడు. మాటు వేసి.. సీనియర్ అసిస్టెంట్ తన స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 08ఎఫ్ఆర్ 1134 కారులో అక్కడికి చేరుకోగా ముత్యంరెడ్డి రూ.8 లక్షల నగదుతో కూడిన సంచిని అందజేశాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్‌మోహన్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతను అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో అతనితో భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించారు. నగదు తీసుకుని ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట్ ఎగ్జిట్ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఇన్నోవా కారు (టీఎస్ 07జీకే0459)లో రాత్రి 10.41 గంటలకు పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మదన్మోహన్ తన కారులో ఉన్న నగదును భూపాల్‌రెడ్డి వాహనంలో పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌కు తీసుకొచ్చి విచారించారు. తెల్లారేవరకు అక్కడే ఉంచారు. కీలక ఫైళ్లను స్వా«దీనం చేసుకున్నారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాదీనం హయత్‌నగర్ పరిధిలోని తట్టిఅన్నారం వద్ద ఇందు అరణ్య విల్లాస్‌లో ఉంటున్న భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐదుగురిని పట్టించిన ముత్యంరెడ్డిగుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డి గతంలో తుర్కయాంజాల్‌కు చెందిన ఓ వీఆర్వో, మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్‌తో పాటు ఓ ఎస్ఐని కూడా వివిధ కేసుల్లో ఏసీబీకి పట్టించడం గమనార్హం. కాగా ఇప్పుడు ఏకంగా ఓ అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పట్టించారు. -
ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులు అరెస్ట్
-
అవినీతి చేస్తే తప్పించుకోలేరు: సీవీ ఆనంద్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్(ట్విటర్)లో సంచలన ట్వీట్ చేశారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.ఇందుకు తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో చాకచక్యంగా పని చేశారు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇద్దరు లంచగొండి అధికారులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ACB traps and arrests MV Bhoopal Reddy, Joint Collector and Senior Assistant Y.Madan Mohan Reddy of Rangareddy district collectorate who colluded and abused their official positions. They were caught redhanded while accepting bribe of Rs 8,00,000 from the complainant for removal… pic.twitter.com/6cN2qastGH— CV Anand IPS (@CVAnandIPS) August 13, 2024