
కేసిరెడ్డి లాయర్ పిటిషన్ అప్‌డేట్స్..
👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్‌లో కోరారు. రూ.11 కోట్లను ఎస్‌బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు.
👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.
👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.
👉నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్‌కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్‌కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు.
నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి
👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్‌లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు.

👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్‌హౌస్‌కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు.