‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ | Adinarayana Reddy Kamma Governance Remark Sparks Political Controversy In NDA Alliance, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’

Feb 10 2026 8:20 AM | Updated on Feb 10 2026 8:48 AM

 Adinarayana Reddy’s ‘Kamma Governance’ Remark Sparks Political Controversy in NDA Alliance

సాక్షి ప్రతినిధి, కడప : కూటమి పాలన ‘కమ్మ’గా సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కావాలనే  ఈ వ్యాఖ్యలు చేశారా... ఇంటా బయట పెరిగిన రాజకీయ ముప్పే అందుకు కారణమా అంటే... ‘అవును’ అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు అనకాపల్లి ఎంపీ రమేష్‌నాయుడు జమ్మలమడుగులో పైచేయి సాధించడం, మరోవైపు పక్కలో బల్లెంలాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్‌రెడ్డి నియామకం .. ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకొస్తున్నారు. భవిష్యత్‌లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉండడంతోనే వాంటెడ్‌ అటాక్‌కు సిద్ధమయ్యారని రాజకీయ పండితులు చెబుతున్నారు.  

తిరుపతిలో బీజేపీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పక్కనే ఉండగా, కేవలం ‘కమ్మ’ వారికి ప్రయోజనం కలిగేలా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఎందుకిలా కఠినంగా, కుల కోణంలో మాట్లాడారనే విషయమై ఎన్డీయే కూటమిలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందుకు అనేక కారణాలు లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ అన్నట్లుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు కని్పస్తోందని వివరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆది సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో అనకాపల్లి ఎంపీ రమేష్‌నాయుడు కాంట్రాక్టు పనులతో పై చేయి సాధించారు. మరోవైపు సోదరుడు కుమారుడు భూపేష్‌రెడ్డికి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత దక్కింది. ఇది జీరి్ణంచుకోలేకే ఆది ఇలా మాట్లాడుతున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు.  

బీజేపీ, టీడీపీలో సీఎం రమేష్‌ హవా... 
బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌నాయుడు స్వగ్రామం పోట్లదుర్తి. తన పరపతితో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదానీ హైడెల్‌ ప్రాజెక్టు పనులు చేజేక్కించుకున్నారు. ఆ పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే ఆది పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఏకంగా తన అనుచరులు వెళ్లి రితి్వక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి వాటాలు దక్కలేదు. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలో ఎంపీ  రమేష్‌నాయుడు హవా కని్పస్తోంది. మరోవైపు సోలార్‌ పనులు ఎర్త్‌వర్క్‌ పనులు కూడా ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి చొరవ నామమాత్రమే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు’గా పలువురు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలు  ప్రభుత్వ పెద్దలకు ఓ హెచ్చరిక సంకేతమని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెలుసుకుని సీఎం రమే‹Ùను కట్టడి చేయకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా హెచ్చరికలు చేస్టున్నట్లు తెలుస్తోంది.  

 భూపేష్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే... 
జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ చేజారడం.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు...  వెరసి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈనెల 7న జిల్లా అధ్యక్షుడిగా భూపేష్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే అంటే 8వ తేదిన తిరుపతిలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. జమ్మలమడుగులో ఇదివరకే దేవగుడి కుటుంబం నుంచి ఆదినారాయణరెడ్డికి ప్రత్యామ్నాయంగా భూపేష్‌రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అభ్యరి్థగా ఆది తెరపైకి వచ్చి అవకాశాన్ని తన్నుకుపోయారు. కాగా, ఇటీవల తన కుమారుడు సుధీర్‌రెడ్డిని ప్రత్యక్ష  రాజకీయాల్లో తీసుకొస్తానంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే టీడీపీ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని బలోపేతం చేయాలనే ఎత్తుగడ ఆ పార్టీ అధిష్టానం అవలంబించడం ఎమ్మెల్యే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఆది’ వ్యాఖ్యలు ఎంతవరకెళ్లి అంతమవుతాయో వేచి చూడాలి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement