రిమ్స్ పీజీ విద్యార్థుల ప్రతిభ
– ప్రిన్సిపల్ డాక్టర్ టి.జమున అభినందనలు
కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్) జనరల్ సర్జరీ విభాగ పీజీ విద్యార్థులు జాతీయస్థాయి సదస్సు ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి–85వ జనరల్ సర్జరీ విజ్ఞాన సదస్సు డిసెంబర్ 17,18,19 తేదీల్లో కలకత్తాలో నిర్వహించారు. ఈ సదస్సులో రిమ్స్ జనరల్ సర్జరీ పీజీ విద్యార్థులు పోస్టర్ విభాగంలో డాక్టర్ వంశీ కళ్యాణ్ మొదటి స్థానం, డాక్టర్ సత్యబ్రత్ పాణిగ్రహి, డాక్టర్ ఉపేంద్ర రెడ్డి ద్వితీయ స్థానం, డాక్టర్ వైష్ణవి మూడోస్థానం సాధించా రు. వీరిని సోమవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి జమున ప్రత్యేకంగా అభినందించారు. వీరిని గైడ్ చేసిన జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ వినయ్, ఫ్యాకల్టీలందరినీ అభినందించారు.
హంస వాహనంపై
శ్రీరంగనాథుడు
– ముగిసిన బ్రహ్మోత్సవాలు
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ సమీపంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 9వరోజు సోమవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పగలు శ్రీరంగనాథస్వామికి ఆలయ ప్రధాన అర్చకు లు కృష్ణరాజేష్‌శర్మ విజేష పూజలు జరిపించా రు. చక్రస్నానం చేయించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరంగనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈఓ కేవీ రమణ, సభ్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడి యట్ జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో 73 పరీక్షా కేంద్రాలకుగాను 2172 మంది హాజరుకాగా 43 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐవో టీఎన్‌వీ వెంకటేశ్వర్లు, రెండు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలతోపాటు డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎగ్జామినర్స్‌కు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.
విద్యార్థుల డేటా మార్పునకు మరో అవకాశం
– డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాలో కొన్ని మార్పులకు యూడైస్ ప్లస్ పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని డీఈఓ షేక్ షంషు ద్దీన్ తెలిపారు. తల్లిపేరు, తండ్రిపేరు, కులం, ఉపకులం, ఫొటోగ్రఫీ, సంతకం, గుర్తింపు చిహ్నా లు (పుట్టుమచ్చలు) వివరాలలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ నెల 12లోగా వినియోగించుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
పాలకమండలి సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దేవదాయ శాఖ డిప్యూటి కమిషనర్, ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఆసక్తిగల వారు కడప దేవదాయ శాఖ కార్యాలయంలో ధరఖాస్తు ఫారం తీసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును గండి ఆలయ కార్యాలయంలో గాని కడప దేవదాయ శాఖ కార్యాలయంలోగాని ఈనెల 26 లోపు అందజేయాలని సూచించారు.
రిమ్స్ పీజీ విద్యార్థుల ప్రతిభ


