పీ4ను పటిష్టంగా అమలు చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : పీ4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయడంతో పాటు అన్ని శాఖలు అన్ని ప్రామాణీకాల్లో వందశాతం పురోగతిని సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావ తి నుంచి జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా సంబంధిత కార్యదర్శులు, మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు రూమ్ నుంచి కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. సా యంత్రం ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ అక్షరాశ్యత శాతాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, ఫైళ్లు భద్రత కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, సీపీవో హాజరతయ్య, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, మెప్మా,, డ్వామా పిడీలు రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్, అదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహనపెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిరూపొందించిన పోస్టర్లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వ నాథ్, జేసీ నిధి మీనాలతో కలిసి ఆవిష్కరించారు.


