విశ్వాసంతో ప్రార్థనలు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : విశ్వాసులు మరియమాతపై విశ్వాసంతో ప్రార్థనలు చేయాలని ఫాదర్ జంపంగి రవిరాజ్, ఫాదర్ సల్లా మనోహర్ సూచించారు. స్థానిక మరియాపురంలో కొనసాగుతున్న లూర్దుమాత తిరునాల మహోత్సవంలో ఎనిమిదవ రోజు సోమవారం పాత చర్చి ప్రాంగణంలో ఫాదర్ జంపంగి రవిరాజ్ దివ్య బలి పూజ చేయగా దువ్వూరు విచారణ గురువు సల్లా మనోహర్ దైవ సందేశాన్ని అందించారు. ముందుగా పీఠం మీద జ్యోతిప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు ఈ సందర్భంగా ఫాదర్ సల్లా మనోహర్ ప్రసంగిస్తూ లూర్దు మాత భక్తులుగా మనం ఆ తల్లి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ కెథిడ్రల్ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్ ఎండీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర లూర్దుమాత మహోత్సవాల్లో ప్రధాన ఉత్సవమైన తిరునాల నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. బిషప్ సగిణాల పాల్ ప్రకాష్ పర్యవేక్షణలో మంగళ, బుధ వారాలలో రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు తిరుణాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
విశ్వాసంతో ప్రార్థనలు చేయాలి


