గ్రామాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

గ్రామాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి

గ్రామాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించడంలో కీలకభూమిక పోషించాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం స్థానిక జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో గ్రేడ్‌–4, గ్రేడ్‌–5 పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీలు తొలుత చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందించాలని కోరారు. ఈనెల 14 వరకు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి మైథిలి, ఎంపీడీఓలు వీర కిశోర్‌, వెంగమునిరెడ్డి, దివిజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement