breaking news
liquor scam
-
కక్షసాధింపులకే లిక్కర్ స్కాం సృష్టి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాలు, దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ స్కాంను సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గంగాధర్ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలకిష్్మతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షసాధింపుల కోసమే లిక్కర్ పేరుతో బేతాళ కథను సృష్టించి తప్పుడు కేసులు పెడుతూ వైఎస్సార్ సీపీ నేతలను, మచ్చలేని రిటైర్డ్ అధికారులను అరెస్టు చేసి పైశాచికానందం పొందుతున్నారని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..! 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న నాపై కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వల్లే గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట ఇబ్బంది పెట్టే యత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చా. ఐదేళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశా. అన్నీ పారదర్శకంగానే జరిగాయని, ఎక్కడా అవకతవకలకు తావులేదని నేను చెప్పా. కానీ నాపైన ఉన్నవారే అన్ని నిర్ణయాలూ చేశారని నేను చెప్పినట్టు ఎల్లోమీడియాలో అబద్ధపు కథనాలు రాశారు.నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వా«దీనం చేసుకుంటున్నారంటూ గంటగంటకూ విద్వేషపూరిత బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలూ లేవు. సిట్‌వాళ్లు కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అయినా ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. వాటినే సిట్ చార్జిషీట్లలో పేర్కొనడం చూస్తున్నాం. ఈ లిక్కర్ వ్యవహారం ఓ అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అనవసరం. నాకు ల్యాప్‌ట్యాప్ వాడకమే తెలియదు.. నాకు ల్యాప్‌ట్యాప్ లేదు. అయినా సిట్ వాళ్లు ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్టు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. నాకు ల్యాప్‌ట్యాప్ వాడడం కూడా తెలియదు. లేని ల్యాప్‌ట్యాప్‌ను ఎలా స్వాదీనం చేసుకుంటారు? సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారని కూడా రాశారు. ఫోన్ తీసుకుని వారేం చేస్తారు? ఏదో జరుగుతుందని ప్రజలను నమ్మించేందుకు ఎల్లోమీడియా, టీడీపీ పడరాని పాట్లు పడుతున్నాయి. మా ప్రభుత్వంలో లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం. ప్రభుత్వ షాపులుపెట్టి మాఫియాను అరికట్టాం. పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాం. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014–19తో పోలిస్తే పెరిగింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే లాభాపేక్ష లేకుండా నడిపినప్పుడు అక్రమాలకు తావెక్కడ? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా మద్యం పాలసీ పేరిట దోచుకుతింటున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో కేసూ నమోదైంది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
లిక్కర్ స్కామ్ చంద్రబాబు కట్టుకథే
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబునాయుడు అల్లిన కట్టుకథే లిక్కర్ కుంభకోణమని, ఆ కథ ఆధారంగానే సిట్ అధికారులు సరైన ఆధారాలు లేకపోయినా విచారణ చేస్తూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. లిక్కర్ అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సోమవారం ములాఖత్ అయ్యారు.అనంతరం అనంత సెంట్రల్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అధైర్య పరచేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. జైల్లో మిథున్‌రెడ్డికి అన్ని వసతులూ కల్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నా.. పాటించడం లేదన్నారు. బాబును ఎదుర్కొన్నందుకే: కేతిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో లేని స్కామ్‌ను తీసుకొచ్చి నిరాధారంగా ఎంపీ మిథున్‌రెడ్డిని జైల్లో ఉంచారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తన చిన్నాన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు మూడు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలిచి్చనా వారు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌ను నమ్మితే, పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాపులకు అర్థమవుతోందన్నారు. -
తాగండి.. ఊగండి.. నా టార్గెట్ 35 వేల కోట్లు
-
అడ్డంగా దొరికిపోయి ACB కోర్టు నుంచి పారిపోయిన SIT అధికారులు
-
Big Question: మద్యం కేసులో రెండో వీడియో.. 11 కోట్ల మతలబు
-
కేసిరెడ్డి కేసులో.. బాబుకు ఊహించని దెబ్బ
-
AP Liquor Scam Case: బాబుకు దెబ్బ మీద దెబ్బ
-
ఫోటోలు.. వీడియోలు సమర్పించాల్సిందే.. ACB కోర్టులో సిట్ కు ఎదురుదెబ్బ
-
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్‌కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన భార్య..
-
SIT సీన్ రివర్స్.. కోర్టు నుంచి పరార్.. అబ్బా కథ అడ్డం తిరిగిందే
-
బేతాళ కుట్రలో మరో అంకం
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు. చెల్లని నోట్లతో కట్టుకథ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..
-
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
అడ్డంగా దొరికిన సిట్!
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో జప్తు చేసిన రూ.11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ రూ.11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్‌ను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే, ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్‌ను కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రూ.11 కోట్ల జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్ చెప్పగా, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక 2024 ఎన్నికలకు ముందే ఈ రూ.11 కోట్లను దాచిపెట్టినట్లు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరానివో నిగ్గు తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. రూ.11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డ్ చేసేందుకు ఓ అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ రాజ్ కేసిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఉంటే స్లిప్ చూపమనండి..కేసిరెడ్డి తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి, దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమకున్న సమాచారం మేరకు ఆ రూ.11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సిట్‌పై తమకు ఏ విధమైన నమ్మకమూ లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారి (ఐవో)ని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేశామని చెప్పారు. ఈ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ, సిట్‌ను నమ్మలేమని, ఒకవేళ రూ.11 కోట్లను డిపాజిట్ చేసి ఉంటే డిపాజిట్‌కు సంబంధించిన బ్యాంక్ స్లిప్పును చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ స్లిప్పును 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చన్నారు. డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచేలా బ్యాంకును ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంటలో డిపాజిట్ స్లిప్పును తీసుకొస్తానని వెళ్లారు. గంటలు గడిచినా కూడా ఆ అధికారి తిరిగి రాలేదు. ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. -
లిక్కర్ కేసులో సిట్ కుట్ర బట్టబయలు.. నోట్ల కట్టల తారుమారు..?
-
రూ. 11 కోట్ల కథలో కొత్త ట్విస్ట్.. అడ్డంగా దొరికిపోయిన బాబు
-
లిక్కర్ కేసు.. ఆ రూ. 11 కోట్లను ఇతర నోట్లతో కలపొద్దు: ఏసీబీ కోర్టు
లిక్కర్ కేసు.. సిట్ కుట్ర.. కేసిరెడ్డి పిటిషన్ అప్డేట్స్.. విజయవాడఅక్రమ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలువీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి మెమోకెసిరెడ్డి మెమో పై కోర్టు కీలక ఆదేశాలురూ.11 కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసిబి కోర్టు ఆదేశాలురూ.11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ , మాచవరం ఎస్.బిఐ బ్యాంకుకు ఆదేశండిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశండీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశం👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్లో కోరారు. రూ.11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు. 👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.👉నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్‌కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్‌కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు. నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్‌లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్‌హౌస్‌కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు. -
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
Big Question: జైల్లో బాబు రాసిన కథ
-
లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే.. బాబు ఒంటి నిండా అవినీతి మరకలే
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?. లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్‌లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారుముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్‌కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది. మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారులిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. .. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్‌ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్‌ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట.. .. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్‌కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్‌కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా? -
అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసిన SIT
-
జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన భార్య, కొడుకు
-
దొంగ దొరికాడు.. బొక్క బోర్లా పడ్డ పచ్చ పేపర్
-
ఏపీ తాలిబన్ల ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, రాజమండ్రి: కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అయిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తోంది. ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయింది. కూటమి సర్కార్ అప్రజాస్వామిక్యంగా వెళ్తోంది. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. అయినా మిథున్‌రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపులను దీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే న్యాయపరంగా అందాల్సిన చర్యలను కూడా కూటమి అడ్డుకోవాలని చూస్తోంది. ఈ అన్యాయాలపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం అని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి కుట్రేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డిస్టలరీలతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు జరిపింది. మా పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కానీ, కూటమి పాలనలో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారు అని మండిపడ్డారాయన.కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మిథున్‌రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆయనపై పెట్టింది అక్రమ కేసు. వైఎస్సార్సీపీకి ఆయనకు అండగా ఉంటుంది మాజీ హోం మంత్రి అనిత అన్నారు.ప్రతిపక్షం నోరు నొక్కాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు భయపడి వెనక్కి తగ్గం అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. -
Big Question: బెయిల్ పై బయట తిరుగుతున్న అతిపెద్ద లిక్కర్ స్కామ్ స్టర్..
-
దొంగను పట్టించిన యాంకర్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
-
కట్టుకథల కుట్ర సర్కార్!
కుట్రలు తప్ప తెలియనివాడికీ, వంచనతప్ప మరేదీ చేతగానివాడికీ మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించటం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో నిరుడు గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలనూ, గూండాలనూ ప్రోత్సహించి హత్యలకూ, దౌర్జన్యాలకూ తెగబడటంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. రెడ్ బుక్‌లో సరికొత్త అంకం లిక్కర్ స్కాం! ఆ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను జైలుపాలు చేసిన ప్రభుత్వం, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చే సింది. విద్యార్థి రాజకీయాల నాటినుంచీ తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవటానికే ఆయన కుమారుడు మిథున్‌రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకూ, సన్నిహితులకూ నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవటానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేనిచోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ‘ఆత్రగాడికి బుద్ధి మట్టు’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ఎదుటివారిపై బురద చల్లి ఏదోరకంగా వారికి అవినీతి మకిలి అంటి ద్దామని తండ్రీ కొడుకులు పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన మద్యం విధానంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి అనుమతినిచ్చిన వైనం లేదు. సరిగదా... అంతకుముందు టీడీపీ ఏలుబడిలో చెలరేగిన మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి, మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మద్యం విక్రయ వేళల్ని కుదించారు. బాబు హయాంలో తామర తంపరగా పెరిగిపోయి, ఊరూవాడా జనం మూల్గులు పీల్చిన బెల్ట్ షాపుల జాడే లేకుండా చేశారు. పర్మిట్ రూమ్‌ల దందా అడ్డుకున్నారు. ఆ విధానం కారణంగా తమ అక్రమ సంపాదన నిలిచిపోగా లబోదిబోమని అప్పట్లో గగ్గోలు పెట్టింది తెలుగు దేశీయులే. మద్యపాన ప్రియుల్ని తగ్గించటానికి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందట! అందులో భారీమొత్తం డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్‌కి తరలిపోయిందట!! ఇంగితజ్ఞానం వున్నవారెవరికైనా ఇందులోని కపట నాటకం అర్థమవుతుంది. బురద చల్లటానికి వీళ్లకంటూ ఒక పద్ధతుంటుంది. ముందు ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు వండివార్చుతారు. ఏదో జరిగిపోయిందంటూ ఆ మీడియా పెడబొబ్బలు పెడుతుంది. వాటిని ఆధారం చేసుకుని కేసులు రూపొందుతాయి. వాటిపై దర్యాప్తుకంటూ సీఐడీ ఆధ్వర్యాన సిట్ ఏర్పాటవుతుంది. ఏం చేయడానికీ పాలుబోని సిట్... ఎల్లోమీడియా తప్పుడు కథనాలనే రీసైక్లింగ్ చేసి చార్జిషీట్లుగా రూపొందిస్తుంది. అవి న్యాయస్థానం మెట్లెక్కకుండానే ఎల్లోమీడియాకు చేరతాయి. తమకు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఆ మీడియా పతాక శీర్షికలతో పండగ చేసుకుంటుంది. ఇంతకూ జనంలో ఇసుమంతైనా విశ్వసనీయత లేని ఈ మీడియాకు ‘విశ్వసనీయంగా’ చెప్పేవారెవరు? ఇంకెవరు... తండ్రీకొడుకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వీర విధేయ అధికారులూ! తమ కథనాలే చార్జిషీట్లుగా అవతారమెత్తాయని, అవే న్యాయస్థానాల పరిశీలనకు పోతున్నాయని తెలియనట్టు, కొత్తగా ఆ రోజే బయట పడినట్టు ఎల్లోమీడియా వికృత విన్యాసాలకు తెగబడుతుంది. 13 వేల ఫోన్‌కాల్స్‌ట, వందలాది వాట్సాప్ చాటింగ్‌లట. దుబాయ్‌లో జల్సాలట. జనం నవ్విపోతారన్న వెరపే లేదు. వారిపట్ల జవాబుదారీతనం అసలే లేదు.జనానికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాదికాలం మాయమాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కారు ప్రజల దృష్టి మళ్లించటానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం దీని ఆంతర్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అంతేవాసులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణ కాదు. సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విప్పిచెప్పిన లోగుట్టు. గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా సంతకాలు చేసిన బాబు నిర్వాకం కారణంగా ఖజానాకు 2015–19 మధ్య రూ. 5,200 కోట్ల మేర గండి పడిందని ఆ సంస్థ బయటపెట్టింది. ఇదిగాక ఎంఆర్పీ కన్నా 20 శాతం అధిక ధరలకు విక్రయించి మరో రూ. 20,000 కోట్లు కొల్లగొట్టారని బయటపడటంతో 2023లో కేసు నమోదైన కారణంగా బాబు, ఆయన అనుచరగణం బెయిల్ కూడా తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకొచ్చాక ఈ దోపిడీ మరింత విశృంఖలంగా పెరిగింది.తమ మద్యం కుంభకోణాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా కేసులుపెట్టి నడిబజారులో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే తాజా కేసు. జగన్ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫిర్యాదుచేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలూ జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా వున్నదని సీసీఐ తేల్చిచెప్పింది. ఒకసారి ఛీకొట్టించుకున్నా బుద్ధిరాని పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెర లేపింది. ఈ ప్రహసనాన్ని జనం నిస్సందేహంగా తిప్పికొడతారు. -
సిట్ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్‌రెడ్డి ఆవేదన
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నానుమాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన. -
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు. అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోపు ఈ పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో.. జులై 19వ తేదీ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఆదివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగష్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఆయన ఉంటున్న స్నేహా బ్లాక్‌లో సరైన సదుపాయాలు లేవని మిథున్‌రెడ్డి లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం తాము సదుపాయాలు కేటాయించామని చెబుతున్నారు. -
లిక్కర్ మాఫియా అండతోనే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన బాబు
-
Liquor Scam: CID విచారణలో బట్టబయలు.
-
సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్ పై ఉన్న చంద్రబాబు
-
రెడ్ బుక్ కుతంత్రం
-
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు..జరగని స్కామ్‌లో రూ.3500 కోట్ల దోపిడీ అంటూ భేతాళ విక్రమార్క కథ..సిట్ చార్జ్‌షీట్ సాక్షిగా వెల్లడైన బాగోతం
-
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్ చార్జ్జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్ తన చార్జ్‌షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్కే దక్కుతుంది. కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్... కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.⇒ సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్‌బుక్ కుతంత్రం బట్టబయలవుతోంది.కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అంటూ బురిడీ కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్జషీట్లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్ కాల్స్, వందలాది వాట్సాప్ చాటింగ్‌ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్ యత్నించింది. పోనీ ఆ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్ చార్జ్జషీట్లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్‌కాల్స్, చాటింగ్లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యంవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్‌బుక్ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సిట్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్‌షీట్‌ను స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్‌జషీట్ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్ బరితెగించి ప్రకటిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి.. లోకేశ్ బినామీ కేశినేని చిన్ని భాగస్వామి ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్‌కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారు. ⇒ కేశినేని చిన్ని మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్ కేసిరెడ్డి..వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబుగానీ ఇటు సిట్‌గానీ స్పందించకుండా మౌనం వహించడం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.బాబు కుట్ర కథే... సిట్‌తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటేచంద్రబాబు సిట్ ద్వారా రెడ్‌బుక్ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్‌బుక్ కుట్ర అమలుకు సిట్ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్‌జషీట్ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్ రిపోర్టులు, చార్జ్‌జషీట్ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్కే సాధ్యపడింది. రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్‌బుక్ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్ ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమేడిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇక బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్‌యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్‌కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. టీడీపీ సిండికేట్‌కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్‌విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానంనాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే.సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణవైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతమద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?డిస్టిలరీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్‌తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్ కోడ్ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్‌కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరిట్‌ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్ జగన్‌వేనని సిట్‌తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్ హోటల్ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్‌కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్ పెట్టడంతో పాటు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? -
టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్ చేశారుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్ -
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మిథున్‌రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది. ఓ పార్లమెంట్ సభ్యుడికి నిబంధనల ప్రకారం జైలులో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో వాటన్నింటినీ మిథున్‌రెడ్డికి కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. వెంట మందులు తీసుకెళ్లేందుకు మిథున్‌రెడ్డికి అనుమతినిచ్చింది.ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ తరువాత శనివారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కోర్టు ఎదుట హాజరుపరిచే ముందు మిథున్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.రాజకీయ కక్ష సాధింపుతో నాపై కేసు పెట్టారు ఈ సందర్భంగా మిథున్‌రెడ్డితో న్యాయాధికారి మాట్లాడారు. ఊరు, పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబంలో ఎంత మంది ఉంటారు.. వంటి వివరాలు అడిగారు. వాటన్నింటికీ మిథున్‌రెడ్డి సమాధానం చెప్పారు. తనపై దురుద్దేశాలతో, రాజకీయ కారణాలతో ఈ కేసు నమోదు చేశారని మిథున్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. తానెలాంటి తప్పు గానీ, నేరం గానీ చేయలేదన్నారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు వైద్యులు తనకు రెండుసార్లు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని, రెండింటికీ తేడాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల తనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి.. ఆ తర్వాత మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డి మూడు పర్యాయాల నుంచి ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఆయన లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారని వివరించారు. ఆయనకున్న ప్రాణహాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించిందని నాగార్జునరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు. పిటిషనర్‌కు రిమాండ్ విధిస్తే తగిన సౌకర్యాలు ఉన్న నెల్లూరు కేంద్ర కారాగారానికి గానీ, రాజమండ్రి కేంద్ర కారాగారానికి గానీ పంపాలని కోరారు. జైలులో వీఐపీ బ్యారెక్ కేటాయించాలని అభ్యర్థించారు.కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా జైలులో ఎక్కువ ములాఖాత్‌లను మంజూరు చేయాలని కోర్టును కోరారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ మద్యం విధానంలో మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని తెలిపారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మిథున్‌రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. నెల్లూరు, రాజమండ్రి కేంద్ర కారాగారాలకు కాకుండా, విజయవాడ లేదా గుంటూరు జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది.రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు మిథున్‌రెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాత్రి 8.38 గంటలకు తీసుకొచ్చారు. జైలు అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయనకు కేటాయించిన బ్యారక్‌లోకి తీసుకెళ్లారు. పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాకినాడ వెళ్లే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. 144 సెక్షన్, 30 సెక్షన్లు అమలు చేశారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయనకు మద్దతుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి వచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు జైలు వద్ద నిరసనకు దిగారు. జైలు గేటు ఎదురుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ బైఠాయించి, నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
జగన్‌కు సన్నిహితుడనే నా తనయుడ్ని అరెస్ట్ చేశారు
చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని.. ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన. సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది. అసలు లిక్కర్ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు. -
మద్యం దందాకు చంద్రబాబే డాన్
-
ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపు
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపుఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు: సజ్జల తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసుఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారులిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగిందిఏడాదికి రూ. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారుతన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ మీద బయట ఉన్నాడు ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారుమిథున్ రెడ్డి రిమాండ్ పై ముగిసిన వాదనలు మిథున్ రెడ్డి ECG హెల్త్ రిపోర్ట్స్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులువాటిని కోర్టుకు సమర్పించలేదని కోర్టుకు తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులువై క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కనుక సెంట్రల్ జైలుకి అనుమతివ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురాజమండ్రి లేదంటే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురిమాండ్ పై మరికొద్ది సేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తిజైల్లో కూడా వై క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరిన మిథున్ రెడ్డి న్యాయవాదులుస్పెషల్ బ్యారక్ కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుభద్రత ,హెల్త్,ములాఖత్ లకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు చేసిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుకొనసాగుతున్న వాదనలులిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలుమిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించనున్న ఇ.కోటేశ్వరరావుకోర్టుకు వచ్చిన వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,లేళ్ల అప్పిరెడ్డి,భరత్కోర్టు బయట పోలీసుల ఓవరాక్షన్.. న్యాయాధికారికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులుబార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకున్నారని ఫిర్యాదులిక్కర్ కేసులో ఏం తేల్చారు?: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందిఈ క్రమంలోనే నా తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందిఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారుగతంలోనూ మిథున్‌రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టారుమిథున్రెడ్డిపై పెట్టింది తప్పుడు కేసేలిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఏం తేల్చారుమా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారుతప్పు చేయలేదు కాబట్టి మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడురాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాతిరస్కారం తప్పదువిజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్ అధికారులుకోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులుకోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులుకోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులుపోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలులిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్రెడ్డికాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్అక్రమ కేసులకు జడిసేది లేదురాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారుఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమంలిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదులిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదువైఎస్సార్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు:::ఎమ్మెల్యే విరుపాక్షివిజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలుకోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులుఅడ్వకేట్లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులుపోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులుగేట్లు సైతం మూసేసిన పోలీసులుప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుకాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలుఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ శ్రేణుల అడ్డగింతవైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంలిక్కర్ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్సీపీజీజీహెచ్కు తరలించే ముందు సిట్ కార్యాలయం వద్ద మిథున్రెడ్డివాట్ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్!రిమాండ్ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్ స్కాంలో.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమద్యం స్కామ్.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025 -
కోర్టు కంటే ముందే ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్!
రెడ్‌బుక్ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం, సిట్ అధికారులు ఏకంగా న్యాయ వ్యవస్థకే అగౌరవం కలిగిస్తుండడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానం కంటే ముందుగా అక్రమ కేసులో చార్జ్‌షీట్ వివరాలను ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చానళ్లకు సిట్ అధికారులు తెలియజేయడమే దీనికి నిదర్శనం. అక్రమ కేసులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి సమర్పించారు. శనివారం(జులై 20) ఉదయం మార్కెట్లోకి వచ్చిన ఈనాడు పత్రికలో ఆ చార్జ్‌షీట్ వివరాలు ప్రచురితం కావడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి. ఈ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు కంటే ముందుగానే ఈనాడు, ఇతర ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలను వెల్లడించింది. ఎంత పక్కాగా అంటే చార్జ్‌షీట్ ఎన్నిపేజీలు ఉన్నాయి...? అందులోని వివరాలన్నీ యథాతథంగా ఎల్లో మీడియా ముందే ప్రచురించింది. టీడీపీ అనుకూల ఎల్లో మీడియా టీవీ చానళ్లు చార్జ్‌షీట్‌లోని వివరాలను శనివారం ఉదయం నుంచే ప్రసారం చేశాయి. అంటే.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఎల్లో మీడియాకే పెద్దపీట వేస్తోందనన్నది మరోసారి స్పష్టమైంది. -
మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లు.. 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు. ‘ప్రివిలేజ్’గా ఖజానాకు గండి కొట్టారుమద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.తమవారికి దోచిపెట్టారు2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది. -
మూడు గంటలకు పైగా ఎంపీ P.V మిథున్ రెడ్డిని - విచారిస్తున్న సిట్
-
తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా: ఎంపీ మిథున్‌రెడ్డి
-
మిథున్ రెడ్డి సిట్ విచారణపై ఉత్కంఠ
-
లోకేష్ డైరెక్షన్లోనే మిథున్‌రెడ్డి ఎపిసోడ్
కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడారు. సాక్షి, తిరుపతి: కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీలో కీలక నేత మాత్రమే కాదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర దాగుంది. అందుకే ఎలాంటి సంబంధం లేని మిథున్‌రెడ్డి ఈ స్కామ్‌ను అంటగట్టాలని చూస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగింది అనే ఓ అబూతకల్పన మాత్రమే. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అదే తరహాలో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చెయ్యడం.. కొట్టడం చేస్తున్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు మారుతుంటాయి. ఆ ఇంగితజ్ఞానం కూడా లేకపోతే ఎలా?.అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యాలని, ప్రతిదాడులు చెయ్యడానికి కాదు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ చూస్తున్నారు, జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై అతి పెద్దనేరం మోపి తప్పు చేశారు. మీకు ఇది ప్రస్తుతానికి ఆనందాన్ని కలిగొచ్చవచ్చు. కానీ, భవిష్యత్తులో మీకు ఆవేదన మాత్రమే మిగులుస్తుంది. పోలీసు వ్యవస్థ వాడుకొని అక్రమ అరెస్టు చేస్తున్న మీకు ప్రజలు నుండి తిరుగుబాటు తప్పదు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక మీరు నేర్పిన పాఠాలే మీకు అప్పచెప్పాల్సివస్తుంది అని భూమన హెచ్చరికలు జారీ చేశారు. -
కాంగ్రెస్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో, ఆయన అరెస్ట్ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఆరోపించింది. 2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | Bhilai, Chhattisgarh: Congress workers clash with police personnel and try to stop ED vehicles after Chaitanya Baghel, son of former CM Bhupesh Baghel, was taken into custody by the Enforcement Directorate.The Enforcement Directorate (ED) conducted fresh searches at the… pic.twitter.com/beb7Eq7Pnq— Press Trust of India (@PTI_News) July 18, 2025అయితే, ఈరోజు చైతన్య బఘేట్ పుట్టినరోజు కావడం విశేషం. పుట్టినరోజే ఆయనను ఇలా అరెస్ట్ చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అరెస్ట్ఫై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ.. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. మరోవైపు.. చైతన్య బఘేల్ అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులను.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. #WATCH | Former Chhattisgarh Chief Minister Bhupesh Baghel's son, Chaitnya Baghel (in yellow t-shirt), arrested by Enforcement Directorate, in connection with the ongoing investigation into alleged multi-crore liquor scam in the state, say officials.Visuals from Durg,… pic.twitter.com/bRPTxqfu0b— ANI (@ANI) July 18, 2025 -
తప్పుడు కేసులు పెట్టినోళ్లు శిక్ష అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు. ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది! -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్’ చిత్ర హింసలు
సాక్షి అమరావతి: మద్యం అక్రమ కేసులో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పాలని ఆయనతో పాటు తిరిగిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం–ఎస్ఐటి) అధికారులు టార్గెట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. పోలీసులని కూడా చూడకుండా గతంలో గన్మెన్లుగా పని చేసిన వారిపై కూడా చేయి చేసుకుంటున్నారు.జరగని లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి భాగమున్నట్లు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని తనకు నరకం చూపారని గతంలో చెవిరెడ్డికి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ఖాకీ యూనిఫాం ఉన్నప్పటికీ తనను కొట్టారని, అనరాని మాటలతో మానసిక వేదనకు గురిచేశారని వివరిస్తూ డీజీపీకి లేఖ రాశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. చెప్పినట్లు చేయడానికి నీకేంటి రోగం?⇒ ‘నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్లు రమ్మంటే వెళ్లాను. మొదటి రోజు వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. నేను సాక్షిగా వచ్చాను.. వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్లు నన్ను అసభ్యంగా తిట్టారు. నీ కన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడని చెప్పారు. వీడియో రికార్డింగ్‌లోనూ అదే చెప్పాడు. మరి నీకేంటి రోగం.. అంటూ తిట్టారు.⇒ మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అనరాని మాటలు అంటుంటే, నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదన్నాను. ఇక్కడ నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని చెప్పడంతో ఆ రోజుకు పంపించేశారు. రేపు రా.. అది కూడా యూనిఫాం తీసేసి రా అని చెప్పారు. నా కన్నా ముందు సిట్ విచారణకు యూనిఫాం తీసేసి వచ్చిన కానిస్టేబుల్ గిరిని కొట్టారని తెలిసి రెండో రోజు కూడా యూనిఫాం వేసుకుని విచారణకు వెళ్లాను. అలా వచ్చినందుకు నన్ను బూతులు తిట్టారు. ⇒ నువ్వు కూడా రాసిచ్చి మీ ఊరికి వెళ్లిపో అని చెప్పారు. నేను చెవిరెడ్డి దగ్గర పదేళ్లు గన్‌మెన్‌గా పనిచేశాను. లిక్కర్ వల్ల ఆయన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా మద్యం పంపిణీ చేయలేదు. అతనికి సెంటిమెంట్ కూడా. అలాంటిది ఒక చిన్న కానిస్టేబుల్ అయిన నా చేత అంత పెద్ద మాటలు చెప్పించడం, రాయించడం ఏంటి సార్.. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని చెప్పాను. దీంతో సిట్ వాళ్లు చాలా కోపంతో నీ ఉద్యోగం ఊడబెరికి జైలుకు పంపుతామని బెదిరించారు. ఏమైనా సరే అంతగా అబద్ధాలు చెప్పలేనన్నాను. దీంతో అక్కడున్న పది మంది సిబ్బంది యూనిఫాంలో ఉన్న నాపై విరుచుకుపడ్డారు.⇒ తల, ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు. నా చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు విరిచారు. ఆ నొప్పి భరించలేక నేను గట్టిగా అరిచాను. నీళ్లు తాగించి మళ్లీ అలాగే చేశారు. కొంత సేపటి తర్వాత.. యూనిఫాం తీసేసి రావాలంటూ పంపించారు. నేను రూముకు వచ్చాక కళ్లు తిరిగి కిందపడ్డాను. తర్వాత మణిపాల్ ఆసుపత్రికి వెళ్లాను. తీవ్ర ఆందోళనలో ఉన్న నాకు కార్డియాలజీ, న్యూరాలజీ పరీక్షలు చేయాలని అడ్మిట్ చేసుకున్నారు. ⇒ సార్.. ఈ పరిస్థితిలో నేను సిట్ దగ్గరకు ఒంటరిగా వెళ్లలేను. ఆ దెబ్బలు తట్టుకొనే శక్తి, ఆరోగ్యం నాకు లేవు. నాకు ఉద్యోగం లేకపోయినా కూలి పనులు చేసుకుని, పశువులు మేపుకుని బతుకుతాను. అక్కడ నాకు ఏమైనా జరిగితే నా కుటుంబం అన్యాయమైపోతుంది.. దయచేసి పెద్ద మనస్సుతో నా విన్నపాన్ని మన్నించి, నన్ను కొట్టకుండా విచారించేలా సిట్ వాళ్లకు ఆదేశాలివ్వండి’ అని విన్నవించారు. గిరి.. మదన్.. వెంకటేష్.. బాలాజీ..చెవిరెడ్డికి అంగరక్షకులుగా.. అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిని బలవంతంగా అరెస్టు చేసిన సిట్ అధికారులు రోజుల తరబడి వారి అదుపులో పెట్టుకుని చిత్రవధ చేశారని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు మీడియా ద్వారా వెల్లడించారు. మొదటగా గన్‌మెన్ గిరిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారని, ఆ తర్వాత మరో గన్‌మెన్ మదన్‌ను విచారణకు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేశారని చెవిరెడ్డి తెలిపారు.తన సన్నిహితుడైన వెంకటేష్‌నాయుడు, అతని కుటుంబీకులను వేధింపులకు గురి చేసి టార్చర్ పెట్టారన్నారు. బాలాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపారన్నారు. చెవిరెడ్డికి ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని చెప్పాలని వీరందరిపై ఒత్తిడి చేశారని చెప్పారు. సిట్ అధికారుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడమే సిట్ బరితెగింపుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు.సిట్ వేధిస్తోంది..జోక్యం చేసుకోండిమద్యం విధానానికి సంబంధించిన కేసులో సాక్షిగా విచారణకు హాజరైన తనను సిట్ అధికారులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ ఎన్.మదన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారణ జరిపారు. మదన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మద్యం విధానం కేసులో సాక్షిగా తమ ముందు హాజరు కావాలంటూ పిటిషనర్‌కు సిట్ అధికారులు నోటీసులిచ్చారన్నారు. ఈ నోటీసులను గౌరవిస్తూ పిటిషనర్ ఈ నెల 10న విచారణకు హాజరయ్యారని తెలిపారు.విచారణ పేరుతో సిట్ అధికారులు మదన్‌రెడ్డిని తీవ్రంగా బెదిరించారన్నారు. చెవిరెడ్డికి గత పదేళ్లలో రూ.200 కోట్లు అందినట్లు చెప్పాలని, తాము చెప్పినట్లు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వివరించారు. సిట్ అధికారుల తీరు వల్ల పిటిషనర్ తీవ్రంగా ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారని, వైద్యులు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారన్నారు.మదన్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. సిట్ అధికారుల తరఫున వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అందుబాటులో లేకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ చేసిన ఆరోపణలను సిట్ అధికారులు ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారించామే తప్ప తామెవరినీ కొట్టలేదన్నారు. బెదిరింపులు.. వేధింపులు.. చిత్రహింసలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ ఆరచకాలకు మొదటి నుంచీ అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ రాజ్యాంగేతర శక్తిగా బరితెగిస్తోంది. అందుకోసం ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలువురు డిస్టిలరీల ప్రతినిధులను సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి బలవంతంగా విజయవాడ తీసుకువచ్చి వేధించారు.60 ఏళ్లు పైబడిన వారిని కూడా భౌతికంగా హింసించడం సిట్ అరాచకానికి తార్కాణం. ఆ డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ వేధింపులకు అడ్డుకట్ట పడింది. వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే అదీ సాయంత్రంలోపే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకు ముందు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిని దర్యాప్తు పేరుతో వేధించింది. సిట్ వేధింపులకు వ్యతిరేకంగా ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ సిట్ పట్టు వీడకుండా ఆయన్ను వెంటాడి వెంటాడి వేధించింది.సిట్ వేధింపులతో బెంబేలెత్తిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతోనే ఆయన్ను రాష్ట్ర సర్విసు నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బేవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా సిట్ అధికారులు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక ఈ కేసులో అరెస్టు చేసిన పలువురు ప్రైవేటు వ్యక్తులను బెదిరించి లోబరచుకుని వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. -
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్‌ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్‌రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
మేం భయపడం.. ఎలాంటి విచారణకైనా సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోందని.. ఇందుకోసం తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీ అక్రమ నిర్బంధం, అబద్దపు వాంగ్మూల సేకరణకు జరుగుతున్న ప్రయత్నాలు, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించారు. బాలాజీని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. అయినా మేం భయపడం. ఎందుకంటే తప్పుడు కేసులు నిలవబడవు కాబట్టి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ బాలాజీతో సహా ముగ్గురుని పోలీసులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్యప్రదేశంలో వాళ్లను హింసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తమ వాళ్లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తుండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసుల దుశ్చర్యను ప్రశ్నిస్తూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నట్లు సమాచారం. -
ఏమైనా ఉంటే నాతో తేల్చుకోండి.. నా సన్నిహితుల జోలికి వస్తే ..
-
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్‌లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి. దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్‌ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్మెంట్లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ‘ వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు. అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి’ అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్‌ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు. -
మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతోన్న చంద్రబాబు
-
లిక్కర్ స్కామ్ కేసు అంతా బూటకమే కూటమికి హైకోర్టు వార్నింగ్
-
ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం విధానంపై నమోౖదెన అక్రమ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీరుపై ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా’ అని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవ#తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.మద్యం విధానంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖరెడ్డిని మూడు రోజులు, కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీలను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ఎలా! కేసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరఫున న్యాయవాదులు నాగార్జునరెడ్డి, దుష్యంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్ సీజ్ చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎల్రక్టానిక్ డివైజ్‌లను, మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎలా పంపుతారని ప్రశి్నంచారు.ఈ కేసును మొదట్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వారు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమరి్పంచలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రొసీజర్ ప్రకారం చేయాల్సిందే బాధితుల తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ సమరి్పంచిన మెమోలో సైతం ఏ మెటీరియల్ సీజ్ చేశారనే విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమరి్పంచలేదన్నారు. సిట్ తీరుపై విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికçప్పుడు విచారణ అధికారి ఆర్.శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిట్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో ‘కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు. మీరు డైరెక్ట్‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలి’ అని న్యాయమూర్తి విచారణాధికారిని ఆదేశించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు బాధితుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కొనసాగిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సాక్షులను బెదిరించకుండా, ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
పచ్చ మీడియా పరిస్థితి.. మింగలేక.. కక్కలేక!
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం పెట్టి.. 2014-19 మధ్య, ఏడాదిగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలను, మద్యం దందాను ఆధారాలతోపాటు ఎండగడితే.. కూటమి ప్రభుత్వం కానీ.. దాన్ని మోస్తున్న పచ్చమీడియా కానీ సరైన సమాధానమే ఇవ్వలేకపోయింది!. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో జరిగిపోయిందంటూ హడావుడి మాత్రం మళ్లీ తలకెత్తుకుంది!. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలకు ఈ మీడియా నేరుగా సమాధానం ఇవ్వలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా మద్యం దందా గురించి!.తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే, ఏపీ సీఐడీ వద్ద జగన్ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కామ్‌లకు సంబంధించి రుజువులేవీ లేనట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఆ విషయం నేరుగా చెప్పలేక ‘వేల కోట్లు దోచేసి, ఆధారాలు చెరిపేసి..’ అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక!. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరక్కుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరికి కూడా వీల్లేకుండా చెరిపి వేశారని ఈ కథనం సారాంశం. వైఎస్సార్సీపీ మద్యం ముఠా 375 పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తునకు తీవ్ర అవరోధాలు ఎదురైనా సిట్ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమన్నా అర్థం ఉందా! అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది?. ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన డేటా కంప్యూటర్లలో నమోదవుతాయి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోలేదట. తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిన వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానిని సృష్టించింది కూటమి!.రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చేవంటోంది ఆ పత్రిక. ఏతావాతా అర్థమయ్యేది ఏంటి? సీఐడీ కేసు ఓ కట్టుకథ అని! ఎల్లో మీడియా సాయంతో జగన్, వైఎస్సార్సీపీలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని!. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం.. ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం.. వారితో బలవంతంగా ఏదో చెప్పించడం.. దాని ఆధారంగా మరికొందరి అరెస్ట్.. ఇలా సాగిపోయింది కేసు విచారణ. ఇక ఎల్లో మీడియా పాత్ర మొదలైంది కూడా ఇక్కడే. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మరో విశ్రాంత అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు తరువాత ఇక జగన్ అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టింది.మద్యం కుంభకోణం లాభాలు విదేశాలకు తరలిపోయాయని ఒకసారి, బంగారం కొన్నారని రెండో రోజు.. ఆస్తులు కొన్నారని ఇంకోసారి, సంచుల్లో నగదు తరలించారని ఆ మరుసటి రోజు.. ఇలా రోజుకో రకమైన కథనాలు రాసుకుంటూ.. ఆఖరకు ఆధారాల్లేకుండా చేశారని ఏడుస్తోంది ఈనాడు! అసలు కుంభకోణమే లేనప్పుడు.. ఆధారాలెక్కడి నుంచి వస్తాయి? జగన్ హయాంలో ఏదో జరిగిందన్న అనుమానం ప్రజల్లో నాటడమే ఎల్లో మీడియా లక్ష్యమని దీంతో మరోసారి స్పష్టమైపోయింది. లేదంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చ పత్రిక ఈ కుట్రకు తెరతీసి ఉండాలి. పచ్చ మీడియా పోకడలను మొదటి నుంచి నిశితంగా పరిశీలించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని ఆధారాలతోసహా ఎండగడుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం కుంభకోణం లోతుపాతులను, అసలు కర్తలెవరు అన్నది రుజువులతో సహా ప్రజలకు వివరించారు. ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్‌పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 2014-15లో కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అంగీకారం లేకుండా, మద్యంపై ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా అప్పట్లో మద్యం విక్రయాలు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఇందులో అవినీతి ఉన్న సంగతిపై కేసు వచ్చిందని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే క్రమంలో మొత్తం టీడీపీ నేతలే వాటిని కైవసం చేసుకున్నారని, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని జగన్ సోదాహరణంగా వివరించారు. ఇక అనధికార పర్మిట్ రూము వేల కొద్ది బెల్ట్‌షాపులు, ఎమ్మార్పీకి మించి వసూళ్లు జరుగుతున్నాయని, ఇది అసలు మద్యం స్కామ్ అని జగన్ స్పష్టం చేశారు. తాము చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు తన హయాంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అండ్ కో ఓ భేతాళ కథ సృష్టించారని తెలిపారు.జగన్ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. జగన్‌ను విమర్శించేందుకు కొందరు టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టినా నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. షాపులు ప్రభుత్వం నడిపితే స్కాం జరుగుతుందా? ప్రైవేటు వారికి అప్పగిస్తేనా? అన్న జగన్ ప్రశ్నకు నిశ్శబ్ధమే సమాధానం అవుతోంది. మద్యం రేట్లు పెంచి, డిమాండ్ తగ్గిస్తే డిస్టిలరీలు ముడుపులు ఇస్తాయా? లేక మద్యం రేట్లు తగ్గించి డిమాండ్ పెంచితే ముడుపులు వస్తాయా? అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. తాను కానీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని కూడా జగన్ నిలదీశారు. ఆ అధికారులకు ఎక్సైజ్ శాఖతో సంబంధమే లేనప్పుడు వారెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లోమీడియా ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఎదురుదాడి ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి భిన్నంగా జగన్ చంద్రబాబు టైమ్‌లో కుంభకోణం ఎలా మొదలైంది? తన హయాంలో ఆ అవకాశం ఎందుకు లేకుండా పోయిందో చాలా స్పష్టంగా వివరించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నానా రచ్చ చేసేదన్నది నిర్వివాద అంశం. కానీ వీసమెత్తు ఆధారమూ లేకపోవడంతో కొంతమందిని నిందితులుగా చేసి, బలవంతంగా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుని ఎలాగొలా జగన్‌ను కూడా ఇరికించాలని చంద్రబాబు సర్కార్ వ్యూహం పన్నినట్లు తేలుతోంది. కాకపోతే నిందితుల వాంగ్మూలాలు కేసుకు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్ల అయ్యింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..
-
చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
మద్యం ముడుపుల డాన్ బాబే: వైఎస్ జగన్
ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ నియమ, నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’‘‘చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’-మీడియాతో వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్‌పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 2019–24 మధ్య అసలు మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. భేతాళ కథలు సృష్టించి.. జరగని స్కామ్‌ను జరిగినట్లు చిత్రీకరించి.. ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని.. వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక్క ఫైలైనా సీఎంవోకు వచ్చినట్లుగానీ.. సంతకం చేసినట్లుగానీ చూపించగలరా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇస్తారేమోగానీ.. పన్నులు బాదేసి, పర్మిట్లు రద్దు చేసి, వారి లాభాలు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమైన మద్యం స్కామ్‌స్టర్ చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. 2014–19 మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని.. ఆ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసును నీరుగార్చడానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడూ దోచేస్తున్నారని.. దాన్ని సమర్థించుకోవడానికే 2019–24 మధ్య జరగని మద్యం స్కామ్ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి.. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) తీర్పు, 2014–15 మధ్య కేబినెట్ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మూడు చోట్ల సంతకం చేసిన నోట్ ఫైలు.. 2014–19 మధ్య మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం లాంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ దుర్నీతిని కడిగి పారేశారు. చంద్రబాబు మోసాలను నిలదీస్తూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలతో కలసి, ప్రజల కోసం సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో ఘోర వైఫల్యం..ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా కూడా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఏడాది దాటింది. రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌లిచ్చారు.లిక్కర్ స్కామ్.. ఫ్యాబ్రికేషన్..ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్‌ను బయటకు తెచ్చారు. వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రశ్నించే గొంతులను నొక్కడానికి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నా. మీ మనస్సాక్షిని అడగండి. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక పన్నులు పెరిగి, అమ్మకాలు తగ్గిపోతే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?రెండు ప్రభుత్వాలు.. మద్యం విక్రయాలుఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ హయాంలో కంటే మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే.. పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.2014–19 మధ్య మద్యంలో అవినీతి.. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లుగానే కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్ షాప్‌ల నుంచి ఇండెంట్ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం ఐదు డిస్టిలరీలే రాష్ట్రంలో 69 శాతం మద్యాన్ని సరఫరా చేశాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. అంతేకాదు.. మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్ చేసింది (ఎంప్యానల్) కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మేం కొత్తగా ఏ డిస్టిలరీనీ చేర్చలేదు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మా విధానం సహేతుకమని సీసీఐ తీర్పు.. చంద్రబాబు అండ్ కో కంపెనీలు మా ప్రభుత్వ మద్యం విధానంపై 2022లో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశాయి. ఆ పిటిషన్లో ఉన్న అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా. ఆ అభియోగాలు ఏమిటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆరోపించారు. సీసీఐ ఆ అభియోగాలన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి సంబంధిత రికార్డులు, సప్లయ్ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్ 19న చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, మా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పేరాగ్రాఫ్ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్ కాపీలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. ఏం విలువ ఉంటుంది? చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ల టర్మ్ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు పదవికి రాజీనామా చేశాడు. వైఎస్సార్సీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు తన అభ్యరి్థని పంపించే అవకాశం ఉండదని, కూటమికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ప్రలోభాలకు గురై రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? ⇒ మరో నిందితుడిగా చెబుతున్న రాజ్ కేసిరెడ్డికి బెవరేజెస్ కార్యకలాపాలతో ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్న ఆయన ఒక వ్యాపారస్తుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకరు. అదీ రెండేళ్లు మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. ఇక విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. ఆయనకు ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, సులభంగా ప్రలోభ పెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్‌గా మారుస్తామన్నారు. అయితే అబద్ధం చెప్పకపోవడం వల్ల నిందితుడిగా చేర్చారని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు. బెవరేజెస్ కార్పొరేషన్, లిక్కర్‌తో ఎంపీ మిథున్‌రెడ్డికి ఏం సంబంధం? వాళ్ల నాన్న కనీసం ఈ శాఖ మంత్రి కూడా కాదు. అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డికి ఈ కేసుతో ఏం సంబంధం? మద్యానికి సంబంధించి ఒక్క ఫైలు అయినా సీఎంవోకు వచ్చినట్లు, ఒక్క సంతకం అయినా చూపించగలరా? అని సవాల్ విసురుతున్నా చంద్రబాబుకు. ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవారు కాదు. మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్ కంపెనీ వికాట్‌లో హోల్‌టైమ్ డైరెక్టర్. 12 దేశాల్లో వాళ్లకు కార్యకలాపాలు ఉన్నాయి. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. వికాట్ యూరప్ టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. చంద్రబాబు, ఈనాడు రాతలు, మాటలు చూస్తే.. ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవారని రాసుకొచ్చారు. నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు చాలామంది నాకున్నారు. అసలు వికాట్ అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్‌లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నాది కాని కంపెనీలో డైరెక్టర్లు, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? ఒక మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, కేసులు.. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులో భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న సత్యప్రసాద్ ఒక సాధారణ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి. సూపరింటెండెంట్లు పదుల సంఖ్యలో ఉంటారు. అనూష ఔట్ సోర్సింగ్‌లో పని చేసిన క్లరికల్ ఉద్యోగి. వాళ్లను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఆయన్ను బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాక కేంద్ర సర్వీస్‌కు వెళ్లిపోవడానికి ఎన్ఓసీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? అసలు లంచాలు ఎప్పుడిస్తారు..?మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాపులను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? లేకప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ వ్యాపారం అప్పజెప్పి అడ్డగోలుగా రోజంతా అమ్మి లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించినా తమకు కావాల్సిన వారికే షాపులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరైనా షాపులు దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా యథేచ్ఛగా అమ్ముతున్నారు. చివరకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. బెల్టుషాప్‌ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు. ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్‌పై క్యూఆర్ కోడ్ పెట్టి దాన్ని అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేసే విధానం అమలు చేశాం. ఆ డిమాండ్ మేరకు ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చాం. అలా చేస్తే లంచాలు ఇస్తారా?స్కామ్‌స్టర్ చంద్రబాబేమద్యంలో అసలు స్కామ్‌స్టర్ ఎవరంటే చంద్రబాబే. 2014–2019 మధ్య చేసిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై లేరా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్ మీరే చూడండి.. ⇒ రాష్ట్రంలో 4,380 లిక్కర్‌షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్ చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులు, బినామీలు, తన మనుషులు రిగ్గింగ్ చేసి షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికేట్ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్‌గా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఏకంగా 43 వేల బెల్ట్‌షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్ షాపుల సిండికేట్ ఏర్పాటు చేసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్ ఇప్పించారు. 2015– 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్స్ దక్కాయి. ⇒ కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్‌లో జీవో 993 ప్రకారం ఏర్పాటైన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి ప్రైవేటు వైన్‌షాప్‌లు, బార్లకు లబ్ధి చేకూర్చారు. అందుకోసం 2015 డిసెంబర్ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా మూడుసార్లు చంద్రబాబు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్‌ను కాగ్ కూడా తప్పుబట్టింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబుపై బలమైన కేసు నమోదైంది. చంద్రబాబు ఆ కేసులో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. తన ట్రేడ్ మార్క్ పాలసీ ప్రకారం స్కామ్‌లు చేస్తూ వైఎస్సార్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా? ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో.. కేరళా మాల్ట్ ఎప్పుడన్నా చూశారా? షార్ట్ విస్కీ ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ.. బెంగళూరు బ్రాందీ.. రాయల్ ల్యాన్సర్ విస్కీ.. ఓల్డ్ క్లబ్.. గుడ్ ఫ్రెండ్స్ అంట.. ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి? ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తనకు కావాల్సిన డిస్టిలరీస్‌కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా? ధరలు తగ్గిస్తానని చెప్పి..చంద్రబాబు తానొస్తే ధరలు తగ్గిస్తానన్నాడు.. తగ్గించింది లేదు కానీ షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్ పెంచాడు. ఇది స్కాం కాదా? ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. విలేకరులు గ్రామాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? రూ.99కే లిక్కర్ ఇస్తానని క్వాలిటీ గతంలో కంటే ఒక లెవల్ తగ్గించి అమ్ముతున్నారు. ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ. అన్నీ పబ్లిక్ డొమైన్లో..చంద్రబాబు హయాంలో లిక్కర్లో దోపిడీకి సంబంధించి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం. వైఎస్సార్ సీపీ హ్యాష్ ట్యాగ్.. వైఎస్సార్ సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో 22 పేజీల డాక్యుమెంట్ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్ బుక్ మీద కూడా ఇంగ్లిష్, తెలుగు వెర్షన్ కాపీలు పెడతాం. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వంచంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.అధికారులకు వేధింపులుటీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజీ ర్యాంకు అధికారి.. పీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిరాణా టాటా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం. మచ్చలేని అధికారులు.. ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. రిటైర్డ్ ఐఏఎస్. పాపం ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న కుమార్తెకు ఇటీవలే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప తన కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సునీల్ కుమార్ డీజీ స్థాయి దళిత ఐపీఎస్ అధికారి. ఆయన్ను సస్పెండ్ చేసి హరాస్ చేస్తున్నారు. సంజయ్ అడిషనల్ డీజీ, దళిత ఆఫీసర్. ఆయన్ను సస్పెండ్ చేసి కేసులు పెట్టారు. విజయ్ పాల్‌ను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ సీనియర్ ఐపీఎస్‌లు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్. రిషాంత్ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్. వీరికి పోస్టింగులు లేవు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీకి దీన్ని వెల్లడించింది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్‌లే కాదు, ఐపీఎస్‌లు కూడా మీటింగ్ పెట్టుకోవాలి.నిప్పు రవ్వలు‘‘మా హయాంలో రెండేళ్లు కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చినా రాష్ట్రాన్ని గొప్పగా సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపాం. అదే చంద్రబాబు ఏడాది పాలన.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్‌రేట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారు. చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. 436 గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం..’’ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులుఇప్పటికే సజ్జన్ జిందాల్‌ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేశారు. ఆంధ్ర అంటే నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్ జిందాల్ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబుకి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చివరకు షిప్, బియ్యం పోయాయి. ఇప్పుడు వికాట్ మల్టీ నేషనల్ కంపెనీపై పడ్డారు. వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ నమస్కారం పెడుతోంది. ఇలా పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నారు. -
లిక్కర్ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్ ధ్వజం (చిత్రాలు)
-
తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే
-
విజయసాయిలాంటి వాళ్ల స్టేట్మెంట్లకు విలువుందా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్ కోడ్ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్ ప్రశ్నించారు.గతంలో లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్మెంట్ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్, కాంతిలాల్ ఠాణా, జాషువా, విశాల్ గున్నీ, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు. -
హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
ఎల్లో మీడియాకు మద్యం కిక్కు తగ్గేలా లేదు..
-
మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు
-
పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు
-
Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే
-
గోవిందప్పతో పోలీసుల బలవంతపు సంతకాలు
-
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది
-
లిక్కర్ కేసు సృష్టికర్త చంద్రబాబే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది దుర్దినం
-
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్
-
బాబు కుట్రను ఆధారాలతో బయటపెట్టిన బోండా ఉమా
-
విచారణ పేరుతో సిట్ వేధింపులు
-
రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు భేతాళ కథలు
-
లిక్కర్ స్కామ్ లో బాబే సూత్రధారి!
-
Chandra Sekhar Reddy: మద్యం కేసులో IAS లకు సంబంధం ఏమిటి?
-
మద్యం కేసులో కేశినేని చిన్ని దంపతులను విచారించాలి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య జానకీలక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన తెలిపారు. ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ కావడంతోపాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్నారు. రాజ్ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీలక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ముందస్తు బెయిల్‌పై.. 7న నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ముందస్తు బెయిల్‌పై బుధవారం (7వ తేదీన) జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలంటూ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కొనుగోళ్లలో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యవహారమంతా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనిదని.. తామే కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లలో పేర్కొన్నారు.ఇదే కేసులో అరెస్టు నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రక్షణ కల్పించారని తెలిపారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మీరు హకోర్టులో పిటిషన్ ఎప్పుడు వేశారు?, కోర్టు ఎలాంటి నోటీసులు జారీ చేసిందని జస్టిస్ పార్దీవాలా పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.ఈ నెల 2న వేశామని, మధ్యంతర రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండానే తిరస్కరించి హైకోర్టు వాయిదా వేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పీవీ మిథున్‌రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించాం కదా అంటూ ధర్మాసనం గుర్తు చేసింది. అయితే.. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున తాము ఇందులో జోక్యం చేసుకోలేమని, మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి 7న విచారణ ఎలా సాగింది? ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనే విషయం తమకు చెప్పాలని ధర్మాసనం సూచించింది.అప్పటివరకైనా అరెస్టు చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. 7న చేపట్టనున్న విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తూ.. కేసుకు సంబంధించిన మెరిట్స్‌పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. 7న హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఫలితం ఏమొచ్చినా మరో వాయిదా అడగవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రాకు జస్టిస్ పార్దీవాలా సూచించారు. -
ఏపీ హైకోర్టులో మే 7న విచారణ ఉన్న నేపథ్యంలో కేసు వాయిదా
-
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్లో పేర్కొన్న కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మద్యం కొనుగోళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం అంతా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోనిది. మేమేకుట్ర దారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఇలాంటి ఆధారాలు లేవు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించారు. . పైగా మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. .. మాపై ఆరోపణలు చేయడం వేధింపులో భాగమే. మద్యం కొనుగోళ్లలో మా పాత్ర ఉందనే ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఏసీబీ వద్దే ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆధారాలను తాము ఎలా తారుమారు చేయగలం. మా స్థాయిని తగ్గించి, అవమానించే ఉద్దేశంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని పిటిషన్లో ప్రస్తావించారు వాళ్లు. మరో పక్క ఈ వ్యవహారంలో మే 7వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆలస్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. -
Big Question: నారా వారి సారా కథలు
-
హైదరాబాద్ లో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి -
Perni Nani: కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది
-
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్‌స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్‌లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్‌లో నియమించారు.సిట్‌ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్‌కు సంబంధించిన పోలీస్‌స్టేషన్‌ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్‌కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్‌లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
మద్యం దందా టీడీపీ లీడర్ల జేబులు ఫుల్
-
కేజ్రీవాల్‌కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది. సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
కర్నాటకలో 90రూ ఉండే మద్యం ఏపీ 99 రూపాయాలు...
-
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్‌లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
లిక్కర్కేసు: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్భూయాన్లతో కూడిన బెంచ్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.లిక్కర్‌కేసులో ఈ ఏడాది మార్చి21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా తీహార్జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో 17 నెలలు రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్ వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ విషయమై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డిఫాల్ట్ బెయిల్‌పై రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్‌పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించున్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.బెయిల్‌పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుదీ తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్కంఠ: కేజ్రీవాల్ బెయిల్‌పై తుది తీర్పు రేపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్25) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.దీనిపై సోమవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ‘ఆప్’ పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఏమైనా టెర్రరిస్టా: సునీతా కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్‌ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. -
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్‌కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. -
లిక్కర్ కేసు: కవిత జ్యుడీషియల్ కస్టడీ 21కి పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం(జూన్7) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది. జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరోగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కాగా, కవితపై ఇప్పటికే సీబీఐ ఫైల్ చేసిన ప్రధాన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేసులో కవిత పాత్ర కీలమని, సౌత్‌గ్రూపు ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులిచ్చారని అభియోగాలు మోపింది. -
తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. -
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు. -
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..
-
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం
-
కవితపై ఈడీ ఛార్జ్‌షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్‌షీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి -
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్‌పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్‌కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్‌కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్‌గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టు: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
కేజ్రీవాల్‌కు బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది.పిటిషన్‌పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఎలాంటి షరతులు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్ సీఎంగా ఏవైనా ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్‌స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
కేజ్రీవాల్ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్‌ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
‘సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర’.. వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం మానుకోవాలని బీజేపీ హితువు పలికింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కంటే జైలు నిర్వాహణ అధికారులు తమ రోగులను (ఖైదీలు) జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వం, జైలు నిర్వహణ అధికారులు కేజ్రీవాల్ (క్షీణిస్తున్న) ఆరోగ్య పరిస్థితులకు ఎందుకు బాధ్యత వహించాలని కోరుకుంటారు. ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాంటి పనులు ఎందుకు చేస్తారా? అని ప్రశ్నించారు. జైల్లో కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వలేదన్న అతిషి ఆరోపణను తోసిపుచ్చారు. భారతదేశంలో ఏ జైలు ఇలా చేయదు. మనది చాలా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఆప్ నేతలు వ్యాఖ్యలు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జైల్లో కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి సైతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చేలా నిరాకరించడం ద్వారా కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించగా.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని జైలు అధికారులు ఖండించారు. -
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్‌పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్
-
లిక్కర్ స్కాం: అరెస్ట్‌పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: న్యాయ సలహా కావాలని అడిగినా.. కానీ అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాలులో మాట్లాడిన ఆమె.. తన అరెస్ట్ అక్రమం, సీబీఐ చేస్తోంది తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి పదిన్నరకు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పా’’ అని కవిత పేర్కొన్నారు. కవిత వాదనలు కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత హక్కులను కాపాడాలి. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత రెండు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కస్టడీ పిటిషన్‌పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి. సీబీఐ వాదనలు: ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్‌నాయర్‌తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్‌ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
Kavitha Bail: ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్
-
కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
-
కవిత లిక్కర్ కేసు లో దూకుడు పెంచిన సీబీఐ
-
కవిత కొడుకు పరీక్షల భయంలో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి
-
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్‌సింగ్‌కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్‌సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్‌సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
సంజయ్‌సింగ్‌కు బెయిల్.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు !
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు జైలులో మగ్గుతున్న ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి సంజయ్ సింగ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ కేసులో గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ బుధవారం(ఏప్రిల్ 2) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని తమ పార్టీకి ‘మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్’గా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆప్ సీనియర్ నేత అయిన సంజయ్‌సింగ్‌కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా, వక్తగా పేరుంది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలు రచించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చి ఎన్నికల్లో విజయాలు సాధించడంలో సంజయ్సింగ్ది అందె వేసిన చేయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆప్ సాధించిన అన్ని విజయాల్లో సంజయ్‌సింగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్రస్తుతం పార్టీ కీలక నేతలు జైలులో ఉన్న వేళ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సంజయ్ సింగ్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన -
‘శీష్‌మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్‌పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్‌మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్‌ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్‌మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్‌ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్ లాక్‌ను ఓపెన్ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నారు. పలు నివేదికల ప్రకారం.. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్, డెస్క్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్‌వర్డ్‌లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాక్‌లను ఓపెన్ చేయించేందుకు యాపిల్ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం. విచారణకు సహకరించని కేజ్రీవాల్ గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 1వరకు పొడిగించింది. రేపటితో కేజ్రీవాల్ ఈడీ రిమాండ్ ముగియనుంది. కేజ్రీవాల్ ఐఫోన్ చుట్టూ దర్యాప్తు ఈలోపే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్ ఐఫోన్ పాస్‌వర్డ్‌లను ఓపెన్ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్ సంస్థను ఆశ్రయించింది. ఫోన్లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. -
నా భర్త ‘సింహం’.. ఆయన్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త అరవింద్ కేజ్రీవాల్ సింహంలాంటి వారని, ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో పెట్టలేరని అన్నారు. లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అంటూ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై విపక్ష కూటమి ఇండియా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ జైల్ నుంచి ఓ సందేశం పంపారంటూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు. ఆ మెసేజ్ గురించి చదివి వినిపించే ముందు మిమ్మల్ని ఓ మాట అడగాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ నా భర్త కేజ్రీవాల్‌ను జైలుకి పంపారు. ప్రధాని చేసింది సరైందేనా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తడు, నిజాయితీ పరుడు అని కొనియాడారు. #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ.. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ సింహం లాంటి వారు. ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ సభలో చదివి వినిపించారు. ‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని (ప్రజల్ని) కోరడం లేదు. న్యూ ఇండియా కోసం 140 కోట్ల మంది భారతీయుల్ని ఆహ్వానిస్తున్నాను. భారతదేశం వేల సంవత్సరాల నాగరికత కలిగిన గొప్ప దేశం. భారతమాత బాధలో ఉంది. భారత ప్రతిపక్ష కూటమికి ఒక్క అవకాశం ఇస్తే, మేం న్యూ ఇండియాను నిర్మిస్తాం’ అని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని చదివారు. దీంతో పాటు ఇండియా కూటమి తరుపున కేజ్రీవాల్ ఆరుహామీలను ప్రకటించారు. ఆ హామీలను సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు.