కావాలనే కుట్ర.. ఆస్తుల అటాచ్‌ ధర్మం కాదు: చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy Key Comments On Liquor Case | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసుతో సంబంధమే లేదు.. ఆస్తుల అటాచ్‌ ధర్మం కాదు: చెవిరెడ్డి

Nov 21 2025 1:43 PM | Updated on Nov 21 2025 1:51 PM

Chevireddy Bhaskar Reddy Key Comments On Liquor Case

సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్‌ కుంభకోణం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి. వందల ఏళ్ల నుంచి తన కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించిన ఆస్తులను సిట్‌ అటాచ్‌మెంట్‌లోకి తెచ్చారు.. ఇది ధర్మం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు ప్రజలకు తెలియాలన్నారు.

ఏసీబీ కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. నేను లిక్కర్‌ వ్యాపారం చేయలేదు. ఒక్క రూపాయి కూడా లిక్కర్‌ నుంచి సంపాదించలేదు. రియాల్‌ ఎస్టేట్‌ చేసి నేను సంపాదించుకున్నాను. లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు. నేను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించాను అని చెప్తున్నారు. నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నేను నిజంగా తప్పు చేసాను అనుకుంటారు. నిజం ఏంటీ అనేది ప్రజల్లోకి వెళ్లాలి. మీకు తెలియాలి. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టినా నాకు భయం లేదు. ఎన్ని రోజులు అయినా జైల్లో ఉంటాను’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement