సాక్షి,గుంటూరు: వైఎస్సార్‌సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశశ్రామిక వేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు.. చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదే విషయాన్ని ఆర్బీఐ కుండబద్దలు కొడుతూ డిసెంబర్ 11,2025న ఆర్‌బీఐ నివేదికను విడుదల చేసింది.ఈ సందర్భంగా.. తమ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని ఖండించారు.
ఆర్‌బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. మా హయాంలో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తయారీ రంగంలో భారత్‌లోనే రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం.ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు. ప్రతిరోజు తనకున్న పైశాచికానందంతో మాపై టన్నుల కొద్ది బురద జల్లుతుంటారు.
వాస్తవం ఏంటంటే?చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవం.పేర్లు చెబుతా రాసుకోండి. సచిన్ జిందాల్,మైహోం సిమెంట్స్,శ్రీ సిమెంట్స్,రామ్‌కో సిమెంట్స్,దాల్మియా సిమెంట్స్,భారతి సిమెంట్స్‌తో పాటు ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా,ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరు’ అని తెలిపారు.
ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన ప్రెజెంటేషన్ డాక్యుమెంట్స్ కోసం 👉.. జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి


