చిత్తూరు.: చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన కలవర పెడుతోంది. ఈ మేరకు జిల్లా జడ్జికి మెయిల్ పెట్టాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యంత్రాంగం.. కోర్టు ప్రాంగణంలో బాంబ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో బాంబు పెట్టారనే బెదిరింపుతో అక్కడ ఉన్న న్యాయవాదులు పరగులు తీశారు.
డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ బాంబు బెదిరింపు ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరో మూడు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు
మరో మూడు జిల్లా కోర్టులకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఏలూరు జిల్లా కోర్టుకు సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ోర్టు ప్రాంగణంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఇక అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేప్టారు. జిల్లా కోర్టు, మెజిస్ట్రేట్ న్యాయస్థానాల్లో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి... బాంబు ఆనవాళ్లు లేవని పోలీసుల నిర్ధారించారు. విశాఖ జిల్లా కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు దిగాడు ఓ ఆగంతకుడు. తనికీల్లో ఎటువంటి పేలుడు పదార్ధాలు లేవని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో కోర్టు సిబ్బంది, లాయర్లు ఊపిరిపీల్చుకున్నారు.

విశాఖ :


